ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, కస్టమర్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంటారు. అంతేకాకుండా, సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే, సరదా విషయాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. తాజాగా, ఓ ట్విట్టర్ యూజర్ ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ కు ఆయన ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

అశోక్‌ కుమార్‌ అనే ట్విటర్‌ యూజర్‌ తాను ఇటీవలే కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) తో దిగిన ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ, ఆ పోస్ట్ లో ఆనంద్ మహీంద్రా ని ట్యాగ్ చేశారు. అశోక్ కుమార్ చేసిన ట్వీట్ లో "10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ని కొనుగోలు చేశాను సార్, మీ ఆశీర్వాదం కావాలి." అంటూ పోస్ట్‌ చేసి, అందులో ఆనంద్‌ మహీంద్రా ను ట్యాగ్ చేశాడు.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

అశోక్ కుమార్ చేసిన ట్వీట్ కి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ "ధన్యవాదాలు, కానీ మీరే మీ ఛాయిస్ తో (మహీంద్రా ఎస్‌యూవీ కొనుగోలుతో) మమ్మల్ని ఆశీర్వదించారు. కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్" అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయ్యింది. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కి స్పందనగా అశోక్‌కుమార్‌ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

చాలామంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందంటూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్‌ మహీంద్రా ఇచ్చిన రిప్లై పట్ల కూడా ప్రశంసలు వ్యక్తం చేశారు. ఓ సగటు మధ్యతరగతి వ్యక్తికి తన జీవితంలో కారు కొనడం అనేది ఓ పెద్ద కల. అలాంటి కల నిజమైనప్పుడు ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనుకుంటాడు. అశోక్ కుమార్ కుడా తన కారు కలను సాకారం చేసుకోవడంతో ఆ విషయాన్ని నేరుగా ఆ కార్ల కంపెనీకి చెందిన యజమానితో పంచుకున్నాడు.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ విషయానికి వస్తే, ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఇది టాప్ ప్లేస్ లో ఉంది. ఈ మోడల్ లో కొన్ని వేరియంట్ల కోసం దాదాపు ఏడాది వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ కారు విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది దాని సేఫ్టీ. సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ ఈ కారును రూపొందించింది. అంతేకాకుండా, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకుంది.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఇది అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను దక్కించుకుంది. అలాగే, దీని డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు కూడా టాప్ నాచ్ గా ఉంటాయి. భారత మార్కెట్లో మహీంద్రా నుండి ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లతో లభిస్తున్న మొట్టమొదటి కారు కూడా ఇదే.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలోఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్స్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఇందులో డ్యాష్‌బోర్డులో డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కోసం), వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా లభిస్తాయి.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటి బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు మొదలైనవి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ లోని హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఏడిఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇవన్నీ కూడా డ్రైవర్ కాన్ఫిడెన్స్‌ని పెంచడంతో పాటుగా రోడ్డుపై సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయని కంపెనీ చెబుతోంది.

ఆనంద్ మహీంద్రా సార్ 10 ఏళ్ల కష్టంతో కొత్త కారు కొన్నాను, ఆశీర్వదించండి.. దీనికి సార్ రిప్లై చూడండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో విక్రయిస్తోంది. వీటిలో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197bhp శక్తిని మరియు 380Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, దీని 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. మొదటిది 182bhp గరిష్ట శక్తిని మరియు 450Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా,లో-స్పెక్ వేరియంట్‌లలో ఉపయోగించిన ఇదే డీజిల్ ఇంజన్ 153bhp గరిష్ట శక్తిని మరియు 360Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Customer tagged anand mahindra in tweet after buying xuv700 read what he replied
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X