కారు కొనుగోలు చేశాక కస్టమర్లు పెద్ద ‘కీ'తో ఫొటో ఎందుకు దిగుతారో తెలుసా.. అందుకు గల కారణాలివే..
కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు యజమానికి.. షోరూమ్ ఓనర్లు పెద్ద తాళం చెవి ఇచ్చి ఫొటో దిగుతారు. ఇలా కారు ఓనర్‌కు పెద్ద కీ ఎందుకు ఇస్తారని ఎప్పుడైనా గమనించారా.. ఈ స్టోరీలో తెలుసుకోండి..
కారు కొనాలనేది జీవితంలో ఎవరికి అయినా ఓ డ్రీమ్.. అందుకే తమ జీవితంలో తొలిసారిగా కారు కొన్న సందర్భాన్ని ఓ పండుగలా జరుపుకొంటారు. కారు కొనుగోలు చేశాక.. ఏ కార్ల తయారీ సంస్థ అయినా యజమానికి కార్డ్ లాంటి పెద్ద తాళం అందించి ఫొటో దిగుతారు. కారు డెలివరీ అనంతరం చాలా మంది సోషల్ మీడియాలో ఈ సంతోషకర సందర్భాన్ని పంచుకుంటారు.

అయితే మీరు ఆ కీని కార్లలో ఉపయోగించలేరు. సాధారణంగా కారు కీ చాలా చిన్నగా ఉంటుంది. ఫొటో దిగిన అనంతరం ఈ పెద్ద కీని ఓనర్‌కి ఇవ్వరు. కేవలం ఫోటో కోసం మాత్రమే ఈ కీని వారికిస్తారు. మరి ఇలా చేయడానికి కారణమేంటి.. దీని వెనుక కొన్ని కారణాలున్నాయి.
షోరూమ్ ఓనర్లు ఇంత పెద్ద కీని ఎందుకును కారు యజమానికి ఎందుకు ఇస్తారంటే.. ఒరిజినల్ చిన్న తాళం చెవితో ఫొటో దిగితే అది ఫొటోలో కనిపించదు. కేవలం పోజుల కోసమే ఇలా దిగుతున్నారని అనుకునే ఛాన్స్ ఉంటుంది. దీని వెనుక మార్కెటింగ్ ట్రిక్ కూడా ఉంది. ఇలా పెద్ద తాళం చెవితో ఫొటో దిగడం ద్వారా కార్ మేకర్ కంపెనీకి కూడా మంచి పేరొస్తుంది. కస్టమర్లకు కూడా ఇదో సంతృప్తి..

కొత్త కారు కొనుగోలు చేసిన కస్టమర్లకు పెద్ద తాళం ఇచ్చి.. వారిని కారు ముందు నిలబెట్టి ఫోటోలు దిగడం ద్వారా వారికి తాము కొత్త కారు కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదే అని భావనను కలిగించడమే వారి ప్రయత్నం. తమ బడ్జెట్ ధరకు మంచి కారు లభించిందనే సంతృప్తి వారిలో కలిగేలా చేస్తారు.
కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు తమ సంపాదనలో భారీ మొత్తాన్ని అందులో పెట్టుబడి పెడతారు. అందుకే కొత్త కారు కొనుగోలు వారి జీవితంలో మరిచిపోలేనిది. అందుకే ఆ సందర్భాన్ని ఫొటో తీసి.. వారికి మరపురాని జ్ఞాపకాన్ని అందించాలనేదే కార్ల తయారీదారుల ప్రయత్నం. కారు భవిష్యత్తులో పాతగా అయిపోయినా.. ఈ ఫొటో మాత్రం వారికి స్వీట్ మెమొరీగా ఉంటుంది.
ఫోటో దిగే సందర్భంలో చాలా మంది కారు ముందు నిలబడటంతో కారులో ఎక్కువ భాగం కస్టమర్, ఓనర్ ఫ్యామిలీనే కవర్ చేస్తుంది. దీంతో కార్ల తయారీ కంపెనీకి పెద్దగా ప్రచారం లభించదు. ఈ సందర్భంలో, కారు తాళం చెవి లాంటి ప్లాస్టిక్ కీని ఫొటోలో ఉంచడం ద్వారా.. షోరూమ్ యజమాని కస్టమర్‌కు ఇస్తున్నట్లుగా ఉంటుంది. అంతే కాకుండా కీపై కార్ల తయారీ సంస్థ యొక్క లోగోను స్పెషల్‌గా ముద్రిస్తారు.
కస్టమర్లు ఆ ఫొటోను ఇంట్లో పెట్టుకున్నప్పుడు.. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఆ ఫొటోను చూసినప్పుడు కారు కంపేనీ పేరును చూస్తారు. దాని ద్వారా కారు కంపెనీకి కస్టమర్లు ఉచితంగా ప్రచారం చేసినట్లే.. దీని ద్వారా సదరు కార్ కంపెనీకి లబ్ధి చేకూరుతుంది.
ఈ విధంగా తీసిన ఫోటోను కస్టమర్లు తప్పకుండా తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తారు. ఎందుకంటే ఫన్నీ వీడియోలతో పాటు వారి జీవితంలోని మధురమైన జ్ఞాపకాలను పంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి పోస్టుల ద్వారా కూడా కార్ల తయారీదారులకు ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చినట్లే..
కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు అంత పెద్ద ఫేక్ కీ ఇచ్చి ఫోటోకి ఎందుకు పోజులిస్తారనే విషయం వెనుక మార్కెటింగ్, వ్యక్తిగత పరంగా ఇలాంటి కారణాలున్నాయి. ఇది ప్రతి కంపెనీలో తప్పనిసరిగా ఓ ఫార్మాలిటీ.. ముఖ్యంగా మార్కెటింగ్ ట్రిక్ అనే చెప్పవచ్చు. కేవలం అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారానే కాకుండా కస్టమర్లు కూడా కార్ మేకర్‌లు కూడా పబ్లిసిటీకి దోహదపడుతున్నారనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








