ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

దేశంలో కొంతమంది వ్యాపారదరులు కొన్ని కొన్ని సార్లు కొన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతారు. గతంలో ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ అని చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఒక కేజీ మాంసం కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ అని ప్రకటించాడు, ఒక మాంసం కొట్టు యజమాని. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

మదురై జిల్లాలోని తిరుమంగళంలో మఖిల్విట్టు మఖిల్ అనే మాంసం అంగడి ఉంది. ఈ దుకాణంలో ఒక కేజీ మాంసం కొనుగోలు చేస్తే ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ ఆఫర్‌ను జూలై స్పెషల్ ఆఫర్‌గా ప్రకటించారు. ఇక్కడ ఒక కిలో మాంసం కొనే వారికి టోకెన్ ఇవ్వబడుతుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆ టోకెన్ ఇచ్చినట్లైయితే ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది.

ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

ఈ ఆఫర్ కేవలం ఈ నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌పై కస్టమర్ల నుండి మంచి ఫీడ్‌బ్యాక్ కూడా వస్తోంది. దీనిపై న్యూస్ 18 తమిళనాడు ఛానల్ నివేదించింది. భారతదేశంలో ఉచితంగా పెట్రోల్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. ప్రపంచంలో పెట్రోల్‌పై అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాలలో భారతదేశం ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పన్నులు విధించడం వల్ల భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి.

ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు చౌకైనది కాని, భారతదేశంలో వాహనదారులకు మాత్రం టకెక్కువ ధరకు అందుబాటులో లేదు. పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని వాహనదారులు ప్రభుత్వాలను చాలా సార్లు విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలో కవర్ చేయడానికి నిరాకరిస్తున్నాయి.

ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

పెట్రోల్ మరియు డీజిల్ ధరల ప్రభావాన్ని తట్టుకోలేక చాలామంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల రాయితీలు కూడా ప్రవేశపెట్టాయి.

ఒక కేజీ మాంసం కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ, రోడ్ టాక్స్ మినహాయింపు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు కల్పించబడింది. ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని మరింత పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

Image Courtesy: News18 Tamil Nadu

Most Read Articles

English summary
Buy A Kilo Of Meat A Litre Of Petrol Is Free In Madurai. Read in Telugu.
Story first published: Thursday, July 29, 2021, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X