నందమూరి బాలకృష్ణ 'లెజండ్' బైక్ మేకింగ్ వీడియో!

By Ravi

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో ‘లెజండ్' అనే కొత్త చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో మన హీరో కోసం నిర్మాతలు ఓ లెజెండ్ లాంటి బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించడాన్ని కూడా మనం ఇదివరకటి కథనంలో చదువుకున్నాం. ఇప్పుడు ఈ కస్టమైజ్డ్ బైక్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుంది.

ముంబైకి చెందిన వర్డెంచి మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది. దీని మేకింగ్‌ను క్రింది వీడియోలో వీక్షించవచ్చు. సిల్లీ మాంక్స్ దీనిని తయారు చేశారు. ఈ కస్డమైజ్డ్ వర్డెంచి మోటార్‌సైకిల్‌లో 27.2 బిహెచ్‌పిల శక్తిని, 41.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే 500సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో వెనుక టైరు 300 మి.మీ. వెడల్పును కలిగి ఉంటుంది.

Customised Vardenchi Motorcycle By Silly Monks

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల మాదిరిగానే ఇది కూడా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ కస్టమైజ్డ్ బైక్ కోసం సుమారు రూ.20 లక్షలను ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో ఫ్యూయెల్, ట్యాంక్, బాడీ పెయింట్‌, సీట్ హైట్ వంటి అంశాలను ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. పసుపు రంగులో ఉండే ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై లెజెండ్ (LEGEND) అని నలుపు రంగులో ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంటుంది. అలాగే ఇంజన్ భాగంలో కూడా 'ఎల్' (లెజెండ్ అని అర్థం) అనే అక్షరం కనిపిస్తుంది.

బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్ కు సినిమా పేరు 'లెజెండ్'ను పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బైక్ ను వేలానికి పెట్టనున్నట్టు చిత్రానికి సంబంధించిన వారు తెలిపారు. వేలంలో ఈ బైక్ కోటి రూపాయల వరకు వెల పలకవచ్చని అంచనా. వరాహి చలన చిత్రం బ్యానర్ పై 14 రిల్స్ సంస్థ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధికా ఆంప్టే నటిస్తోంది.

Legend bike

లెజెండ్ చిత్రంలోని ఓ పాట కోసం ఈ బైక్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మన బాలయ్య ఇష్టపడి మరీ పసుపు రంగు కలర్‌ను ఎంచుకున్నారట. అంతేకాదండోయ్.. ఈ చిత్రంలో బాలక్రిష్ణ కోసం బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఓ సఫారీ కారును కూడా డిజైన్ చేయించాడట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. ఫిబ్రవరి 2014లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/AAe86JboDd0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, January 3, 2014, 15:52 [IST]
English summary
This is a Vardenchi Motorcycle customised by Silly Monks. This is the first custom bike ever built for Tollywood for none other than Nandamuri Balakrishna for his forthcoming film 'Legend" also starring Radhika Apte Sonal Chauhan. Directed by Boyapati Srinu. Mounted on a Fuel Injected 500 CC engine producing 41.3 NM Torque with an impressive 27.2 BHP sitting on a 300 mm wide rear tyre driven by a belt.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+