ఫేస్‌బుక్ వీడియో: డేంజర్ అండ్ థ్రిల్లింగ్ సైకిల్ రైడ్
కొండప్రాంతాల్లో సైకిల్ రైడ్ ఎంత థ్రిల్‌గా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ప్రత్యేకించి సైకిల్‌ను ఉపయోగించే నిర్వహించే 'మౌంటైన్ డౌన్‌హిల్ ఛాలెంజ్' అనే స్పోర్ట్‌లో సైకిల్ రైడింగ్ చాలా ప్రమాదకరంగాను అంతే వినోదభరితంగాను ఉంటుంది.
ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో ఇలాంటి ఓ వీడియోని వీక్షిద్దాం రండి..! కొండ ప్రాంతాల్లో ఉపయోగించేందుకు తయారు చేసిన సైకిళ్లను మౌంటైన్ బైక్స్ అంటారు. ఇవి మామూలు సైకిళ్ల కన్నా తేలిక, ధృడంగా ఉంటాయి.
మౌంటైన్ డౌన్‌హిల్ ఛాలెంజ్‌లో రోడ్లు లేని ఎగుడు దిగుడు ఉండే కొండలపై నుంచి నేరు క్రిందకు దిగుతూ విన్యాసాలు చేస్తుంటారు. ఈ విన్యాసాలు చూడటానికి ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అయితే, ఒక్కోసారి ఇవి బెడిసి కొడుతుంటాయి కూడాను.
మనం చూడబోయే ఈ వీడియోలో రెడ్‌బుల్ ర్యాంపేజ్ పేరిట నిర్వహించిన మౌంటైన్ డౌన్‌హిల్ ఛాలెంజ్‌లో జరిగిన టాప్ 5 సైకిల్ క్రాష్‌లను చూద్దాం రండి. గమనిక: మీరు మాత్రం ఇలాంటి స్టంట్‌లను ఎట్టి పరిస్థితుల్లోను ట్రై చేయకండి.


Click it and Unblock the Notifications








