ఆయన కార్ల కలెక్షన్‌కి అవార్డు ఇవ్వాలి.. మోహన్ లాల్ గ్యారేజీలో అరుదైన, ఖరీదైన కార్లు.. మీరు ఓ లుక్కేయండి
భారతీయ సినీ పరిశ్రమలో విశిష్ట స్థానం కలిగిన నటుడు మోహన్ లాల్ (Mohanlal), ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ అత్యున్నత చిత్రపరిశ్రమ పురస్కారం, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు సెప్టెంబర్ 23, 2025న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అందించబడింది. మోహన్ లాల్ కేవలం ఒక నటుడే కాదు; దర్శకుడు, నిర్మాత, గాయకుడిగా కూడా దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. మళయాళం సినిమాలతోపాటు, ఇతర భాషల్లో తెలుగు సహా, స్టార్డమ్, అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇలాంటి ప్రతిభ కలిగిన ఆయనికి లగ్జరీ కార్ల పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.
అరుదైన, ఖరీదైన కార్లతో ఆయన వ్యక్తిగత కార్ల సేకరణ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి కారు కేవలం ఒక వాహనం కాకుండా, ఆయన వ్యక్తిత్వం, ఇష్టాన్ని ప్రతిబింబించేలా ఉంది. మోహన్ లాల్ నమ్మకమైన ఫ్రేమ్‌లు, స్పష్టమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికత కలిగిన కార్లను ఇష్టపడతాడు. ప్రతి కార్ ఆయన సినిమాటిక్ జీవితం లాగే ప్రత్యేకత, విలువ, ఆకర్షణ కలిగి వుంటుంది. ఆయన కొన్ని కార్ల కలెక్షన్ గురించి ఈ కథణంలో చూద్దాం.

ఆయన మొదటి కారు, ప్రసిద్ధ హిందూస్టాన్ అంబాసిడర్ మార్క్ 4, తన సినిమాటిక్ జీవితం ప్రారంభానికి గుర్తుగా నిలిచింది. దీని తరువాత, లంబోర్గిని ఉరుస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా వెల్ఫేర్, మెర్సిడెస్-బెంజ్ GL350 వంటి అరుదైన, ఖరీదైన కార్లు ఆయన గ్యారేజ్‌ను ఒక లగ్జరీ పారడైస్ లాగా తీర్చిదిద్దాయి. తన ప్రతి కారుకు ప్రత్యేకతను ఇచ్చే ప్రయత్నంలో, ఇష్టమైన నంబర్‌ప్లేట్లను కూడా తీసుకుంటారు.
అంబాసిడర్ మార్క్ 4:
మోహన్ లాల్ మొదటి కారు, ప్రసిద్ధ హిందూస్టాన్ అంబాసిడర్ మార్క్ 4 ఎంతో ప్రత్యేకం. 1986 మోడల్ అంబాసిడర్ 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తూ, 75 bhp పవర్, 135 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేసిన ఇది ఆయన కెరియర్ ప్రారంభానికి గుర్తుగా నిలిచింది, ఇప్పటికీ ఆయనకు నచ్చిన వాహనం. కాలం గడిచేకొద్దీ, ఆయన ఎంపికలు విలాసవంతమైన, అధునాతన స్పోర్టీ కార్ల వైపు మళ్లాయి.

లంబోర్గిని ఉరుస్:
లంబోర్గిని ఉరుస్, ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన కారు, అత్యధిక పనితీరు, ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రత్యేక స్థానం సంపాదించింది. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ 657 bhp పవర్, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, కేవలం 3.5 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందిస్తుంది. గరిష్ట వేగం 305 kmph, ప్రీమియం మెటీరియల్స్, డ్రైవింగ్ మోడ్‌లు ఈ SUVని నిజమైన లగ్జరీ స్పోర్ట్ గా మార్చాయి.
టయోటా వెల్ఫేర్:
టయోటా వెల్ఫేర్, మరో ప్రీమియం ఎంపిక, MPV లగ్జరీలో వెనకబడదు. 2.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌తో నడిచే ఈ MPV, రెండో వరుస VIP కెప్టెన్ సీట్లతో, 7-సీట్ల విశాల లేఅవుట్, మసాజ్ ఫంక్షన్స్, 14-అంగుళాల టచ్‌స్క్రీన్, JBL ఆడియో, ట్విన్ సన్‌రూఫ్‌లు, ADAS సిస్టమ్, 360 డిగ్రీల కెమెరాలు, 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో గొప్ప ప్రయాణాన్ని అందిస్తుంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్:
టయోటా ల్యాండ్ క్రూయిజర్, జపాన్ ఫ్లాగ్‌షిప్ SUV, 3.3-లీటర్ ట్విన్-టర్బో V6 డీజిల్ ఇంజిన్‌తో 304 bhp పవర్, 700 Nm టార్క్, 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది. 4WD సిస్టమ్‌తో లగ్జరీ SUV కలెక్షన్‌ను మరింత పరిపూర్ణంగా చేస్తుంది. ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్. సేఫ్టీకి 10 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు సౌకర్యాలు దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








