బౌద్ధ గురువు 'దలైలామా' ప్రయాణించే ఫార్చ్యూనర్ ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే, దాని విశేషాలు ఇక్కడ తెలుసుకోండి
బౌద్ధ గురువు 'దలైలామా' గురించి దాదాపు అందరికి తెలుసు. నిజానికి దలైలామా అనేది పేరు కాదు.. అది బౌద్ధుల ఆచార్య పదవి పేరు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గురువు పేరు 'టెన్జిన్ గయాట్సో' (Tenzin Gyatso). ఈయన ప్రస్తుతం 14 వ బౌద్ధ గురువుగా ఉన్నారు.
దలైలామా గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసినప్పటికీ ఆయన ఎలాంటి కార్లలో ప్రయాణిస్తారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. గతంలో చాలా సంవత్సరాల క్రితం దలైలామా ల్యాండ్ రోవర్ కారులో ప్రయాణించినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం ఈయన టయోటా కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ కారుని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే దలైలామా ప్రయాణించే ఫార్చ్యూనర్ ధర అక్షరాలా కోటి రూపాయలకంటే ఎక్కువ. వినటానికి వింతగా ఉన్నా ఇదే నిజం.

దలైలామా ప్రయాణించే ఫార్చ్యూనర్ ధర కోటి రూపాయలకంటే ఎక్కువ అంటే మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ ఫార్చ్యూనర్ బుల్లెట్ ప్రూఫ్ కలిగి ఉంటుంది. కావున ఈ కారంగానే దీని ధర ఏకంగా కోటి రూపాయలకంటే ఎక్కువ అని తెలుస్తుంది. ఇది చూడటానికి ఒక సాధారణ SUV మాదిరిగా కనిపిస్తుంది. కానీ దీనిని చాలా పటిష్టంగా రూపొందించారు. ఈ కారణంగా దీని ధర అంత ఎక్కువ ఉంది. దేశీయ మార్కెట్లో సాధారణ ఫార్చ్యూనర్ కార్లకు డిమాండ్ బాగానే ఉంది.
టయోటా ఫార్చ్యూనర్ బరువు సాధారణంగానే 1.8 టన్నుల వరకు ఉంటుంది. కానీ దీనికి బులెట్ ప్రూఫ్ ఉపయోగించడం వల్ల దాని బరువు యూ ఏకంగా 3.7 టన్నులకు పెరిగింది. అంటే దలైలామా ఉపయోగించే ఈ బులెట్ ప్రూఫ్ కారు బరువు 3.7 టన్నులు. ప్రస్తుతం దలైలామా బీహార్ లోని బుద్ధ గయా (బోధగయ) లో పర్యటిస్తున్నారు. అయితే ఈయన ప్రయాణించే ఫార్చ్యూనర్ హిమాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ చేయబడింది.
దలైలామా ప్రయాణానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో దలైలామా అభిమానులు ఆయనకు మర్యాదపూర్వకంగా నమస్కరించడం చూడవచ్చు. అంతే కాకుండా ఆయన అనుచరులను కూడా ఈ వీడియోలో చూడవచ్చు. భారత ప్రభుత్వం దలైలామాకు అత్యధిక భద్రతను కల్పించడంలో భాగంగానే బుల్లెట్ ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్ అందించినట్లు తెలుస్తుంది. ఈ వాహనంలో ఉండగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం నుంచి హాని జరిగే అవకాశం లేదు.
నిజానికి టయోటా కంపెనీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేయదు. కంపెనీ కారుని అందించిన తరువాత కొన్ని కంపెనీలు బులెట్ ప్రూఫ్ వాహనాలు మారుస్తాయి. కార్లను బుల్లెట్ ప్రూఫ్ కార్లుగా మార్చే కంపెనీలలో 'మినర్వా స్పెషల్ పర్పస్ వెహికల్స్' ఒకటి. భారతదేశంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న అధికారులు (రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మొదలైన వారు) బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఉపయోగిస్తున్నారనే సంగతి చాలా మందికి తెలుసు.
బుల్లెట్ ప్రూఫ్ కార్లు కలాష్నికోవ్ AK47, B6 లెవెల్ మందుగుండు సామగ్రి, M80 స్పెషల్ పర్పస్ మెషిన్ గన్‌లు వంటి వాటి భారీ నుంచి కూడా లోపలి వ్యక్తులను రక్షించగలవు. బాంబు పేలుళ్ల నుంచి, DM51 హ్యాండ్ గ్రెనేడ్‌లు లేదా HG85 ఫ్రాగ్మెంటేషన్ గ్రెనేడ్‌లు మరియు DM311 వంటి ల్యాండ్ మైన్‌ల నుంచి కూడా ఇది రక్షణను ఇస్తుంది. మొత్తానికి లోపల ఉన్న వ్యక్తికి ఎటువంటి హాని జరగకుండా బుల్లెట్ ప్రూఫ్ కార్లు రక్షిస్తాయి.
దలైలామా ప్రయాణించే కారు బుల్లెట్ ప్రూఫ్ అయినప్పటికీ యాంత్రికంగా ఎటువంటి మార్పులకు లోను కాలేదు. కావున సాధారణ ఫార్చ్యూనర్ మాదిరిగానే అదే పనితీరుని అందిస్తుంది. అయితే దీని అదనపు బరువును సరిగ్గా హ్యాండిల్ చేయడానికి సస్పెన్షన్ మరియు స్టీరింగ్ వంటివి కొంతవరకు అప్డేట్ చేయబడతాయి. ఇది చూడటానికి సాధారణ ఫార్చ్యూనర్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఈ కారు యొక్క విండోస్ సాధారణ కారుకంటే మందంగా ఉంటాయి.
1966 నుంచి 1976 వరకు భారతదేశంలో దలైలామా ల్యాండ్ రోవర్ సిరీస్ IIA ను ఉపయోగించారు. చైనా టిబెట్ పై దాడి చేసిన తరువాత దలైలామా నివాసం మారింది. ఎప్పుడూ దలైలామా కారు డ్రైవ్ చేయలేదు, కానీ ఎక్కువగా కారులో తిరిగారు. ఆ సమయంలో ఎక్కువగా కో-డ్రైవర్ సీటులో ప్రయాణించారు. ల్యాండ్ రోవర్ సిరీస్ IIA లో దలైలామా దాదాపు 1.10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఓడోమీటర్లో నమోదైంది.
ల్యాండ్ రోవర్ సిరీస్ IIA లో దలైలామా భారతదేశంలో మాత్రమే కాకుండా నేపాల్ లో కూడా పర్యటించారు. ల్యాండ్ రోవర్ సిరీస్ IIA 4X4 సామర్థ్యాలను కలిగి ఉంటుంది, కావున హిమాలయ వంటి రోడ్లమీద కూడా సజావుగా ముందుకు వెళ్లగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








