Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి
ఇటీవల కాలంలో వాహనప్రియులు తమకు వాహనాలపై ఉన్న ఆసక్తి వల్ల తమ వాహనాలను తమకు నచ్చినట్లు మాడిఫై చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మాడిఫై చేసిన వాహనాలు చట్ట విరుద్ధం. ఇటువంటి వాహనాలు ప్రజా రవాణాలో ఉపయోగించినట్లతే వాటిని బ్యాండ్ చేయడమే కాకుండా, భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మనం గతంలో మాడిఫై వాహనాలపై విధించిన జరిమానాలు మొదలైన వాటిని గురించి తెలుసుకున్నాం.

ఇప్పుడు ఒక మాడిఫై చేయబడిన ఒక స్కార్పియోను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘజియాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహీంద్రా స్కార్పియో కారు చట్ట విరుద్ధమైన మార్పులు కలిగి ఉండటం వల్ల పోలీసులు దేనిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అభ్యంతరకరమైన మార్పులు ఈ కారులో ఉండటం వల్ల పోలీసులు దానికి భారీ మొత్తంలో అనగా 41,500 రూపాయల భారీ జరిమానా విధించడం జరిగింది. ఈ మాడిఫై స్కార్పియోను ఘజియాబాద్ పోలీసులు సాధారణ తనిఖీ సమయంలో పట్టుకున్నారు.
MOST READ:వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ స్కార్పియోను "డ్యాన్స్ స్కార్పియో" అని పిలుస్తారు. ఈ డ్యాన్స్ స్కార్పియో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారును స్వాధీనం చేసుకోవడానికి ఈ వీడియో కూడా ఒక ప్రధాన కారణం.

మాడిఫైడ్ డ్యాన్స్ స్కార్పియోలో లోపల పెద్ద స్పీకర్లు వ్యవస్థాపించబడ్డాయి, ఈ స్పీకర్ ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. కారులో డ్రైవర్ పాటను ప్లే చేస్తున్నప్పుడు పట్టుబడ్డాడు. ఈ స్కార్పియోలో సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు బౌన్స్ అవ్వడం ప్రారంభించే విధంగా మాడిఫై చేయబడింది.
MOST READ:జనవరి 2021లోనైనా కొత్త ఫోర్స్ గుర్ఖా వచ్చేనా? థార్‌కి పోటీ ఇచ్చేనా?

సాంగ్ ప్లే చేసినప్పుడు కారు బౌన్స్ అవ్వడం వల్ల దీనిని డ్యాన్స్ స్కార్పియో అని పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం అదే స్కార్పియో వీధుల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ స్కార్పియోకి ఉన్న వెహికల్ నెంబర్ ఢిల్లీ ప్రాంతానికి చెందినది. ఈ వాహనం వివాహాది శుభకార్యాలకు ఉపయోగించేవారని కూడా ఒక ఇవేదికలో తెలిసింది.
ఈ కారుని వివాహాలకు ఉపయోగించడమే కాకుండా, బౌన్స్ అవ్వడం వల్ల చుట్టూ ఉన్న ప్రజలను కూడా చాలా ఆకర్షిస్తుంది. ఈ విధమైన ప్రత్యేకత కలిగి ఉండటం వల్ల ఈ కారుకి రూ. 15 వేలు నుంచి 20 వేలు వరకు డిమాండ్ చేస్తారని ఆ కార్ ఓనర్ తెలిపాడు.

పోలీసులు ఈ మాడిఫై వాహనం యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించారు. ఈ వాహనానికి సంబంధించిన చాలా డాక్యుమెంట్స్ లేవు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల రూ .5 వేల రూపాయలు, సౌండ్ పొల్యూషన్ కి రూ .10,000 జరిమానా విధించినట్లు తెలిసింది. మిగిలిన జరిమానా గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

ఈ ప్రాంతంలో డ్యాన్స్ చేసే కారు ఇది మాత్రమే కాదు. వివాహాల వంటి కార్యక్రమాల కోసం అద్దెకు ఇవ్వడానికి చాలామంది మాడిఫైడ్ చేసిన వాహనాలను కలిగి ఉన్నారు. కొంత డిఫరెంట్ గా ఉండే వాహనాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. కావున కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ వాహనాలను పిలుస్తారు. ఈ వాహనాల్లో ఫాస్ట్ సాంగ్స్ మరియు డీజే సాంగ్స్ వంటి వాటిని ప్లే చేసి ఆనందిస్తారు.

ఘజియాబాద్ ప్రాంతంలో, ఇటువంటి వ్యాన్లు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాహనం యొక్క నిర్మాణంలో మార్పులు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తన 2019 తీర్పులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ మాడిఫై చేసిన మహీంద్రా స్కార్పియో అనేక నియమ నిబంధనలను ఉల్లంఘించింది. కొత్త మోటారు వాహనాల చట్టం అమలు తరువాత, పోలీసులు అలాంటి వాహనాలను బ్యాండ్ చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తున్నారు.
MOST READ:అటల్ టన్నెల్లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి
సాధారణంగా వాహనంలో నిర్మాణ పరమైన మార్పులు మాత్రమే కాకుండా దీనికి పెద్ద టైర్లను వ్యవస్థాపించడం, ప్రెజర్ హార్న్స్, ఆఫ్-రోడింగ్ కోసం స్టీల్ బంపర్ మరియు బుల్‌బార్లు కూడా భారతదేశంలో నిషేధించబడ్డాయి.
కొత్త చట్టం ప్రకారం వాహనంలో ఏదైనా మార్పు వాహనం యొక్క నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది మరియు కారును అంత సురక్షితంగా ఉంచదు. వాహనంలోని బుల్‌బార్ మరియు ఆఫ్-రోడ్ స్టీల్ బంపర్ ఈ వస్తువులు పాదచారుల భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేనందున పాదచారులకు ప్రమాదం కలిగిస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌బ్యాగ్ యొక్క పనితీరు బుల్‌బార్ ప్రభావితం చేస్తుంది.

ఈ మాడిఫైడ్ మహీంద్రా స్కార్పియోకి జరిమానా చెల్లించిన తరువాత పోలీసులు ఈ వాహనాన్ని తిరిగి ఓనర్ కి అప్పగిస్తారో, లేదో ఖచ్చితంగా తెలియదు. సాధారణంగా కొన్ని నిబంధనల ప్రకారం వాహనాన్ని తిరికి యధావిధిగా చేయాలనీ వాహనదారునికి చెబుతారు. దీని కోసం పోలీసులు ప్రాంతీయ ఆర్టీఓకు సమాచారాన్ని అందజేస్తారు.