జర్మన్ బ్రాండ్ కారు కొన్న దంగల్ నటి.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
సెలబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో బుల్లితెర నటుల దగ్గర నుంచి వెండితెర నటుల వరకు, అటు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు సినీతారలు కొనుగోలు చేసిన కార్లను గురించి తెలుసుకున్నాం. ఇటీవల బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ ఖరీదైన ఓ 'మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ' (Mercedes Benz GLE 300D) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నిజానికి 'ఫాతిమా సనా షేక్' అనే పేరు తెలుగు వారికి కొత్తగా అనిపించినా దంగల్(యుద్ధం) నటి అంటే మాత్రం వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ సినిమా తెలుగు వాళ్లలో కూడా అలాంటి ముద్ర వేసింది. ఈ సినిమాలో 'గీత కుమారి ఫోగట్'గా అలరించిన ఈమె తాజాగా రూ.1.15 కోట్ల విలువైన బెంజ్ జీఎల్ఈ 300డీ కారును కొనుగోలు చేసింది. నలుపు రంగులో ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉండటం ఇక్కడ చూడవచ్చు.

నివేదికల ప్రకారం ఫాతిమా సనా షేక్ తన కొత్త మెర్సిడెస్ బెంజ్ కారులో ముంబైలోని ఒక రెస్టారెంట్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఫోటోలకు ఫోజులివ్వడం పూర్తయిన తరువాత ఆమె రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. అబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్ యొక్క క్లాసీ షేడ్‌లో కనిపించే ఈ కారు ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన మోడల్. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఈ కారు ఉంది.
నటి ఫాతిమా సనా షేక్.. జీఎల్ఈ 300డీ వేరియంట్ కొనుగోలు చేసింది. ఇది 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 245 పీఎస్ పవర్ మరియు 500 Nm టార్క్ అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన ఈ కారు కేవలం 7.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 225 కిమీ/గం.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 3.0 లీటర్ వీ6 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. ఇది 365 పీఎస్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ జీఎల్ఈ 450 వేరియంట్‌లో లభిస్తుంది. అంతే కాకుండా 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 435 Bhp పవర్ మరియు 520 Nm టార్క్ అందిస్తుంది.
అద్భుతమైన డిజైన్ కలిగిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ కారు ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటుఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.
ఫాతిమా సనా షేక్ మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు కలిగిన సెలబ్రిటీల జాబితాలో హృతిక్ రోషన్, టెలివిజన్ నటి మోనా సింగ్, బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, నటి గౌహర్ ఖాన్, క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్, బాలీవుడ్ నటి నేహా శర్మ మరియు రిచా చద్దా వంటి వారు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది ఎంతమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కారో తెలిసిపోతోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








