దర్శన్‌కు హ్యార్లీ డేవిడ్‌సన్ క్రూయిజ్ బైక్ కానుక

Darshan
ఆ మధ్య భార్యపై చేయి చేసుకున్న కేసులో బుల్లితెరపై కనిపించిన వివదాస్పద వెండితెర కన్నడ నటుడు దర్శన్ ఇప్పుడు హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై సవారీ చేయనున్నాడు. అయితే, ఈ ఖరీదైన బైక్‌ను ఆయన తన స్వంత డబ్బులు పెట్టి కొనుగోలు చేయటం లేదట.

ఈ కన్నడ సూపర్ స్టార్ నటించిన 'బుల్‌బుల్' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటుండటంతో, ఆ చిత్ర దర్శక నిర్మాతలు సుమారు రూ.20 లక్షల విలువైన అమెరికన్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను (మోడల్ తెలియదు) దర్శన్‌కు కానుక ఇవ్వనున్నారు.

స్వతాహాగా కార్లు బైకులంటే దర్శన్‌కు మహా ఇష్టమని, స్విట్జర్లాండ్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో దర్శన్ దృష్టంతా బైక్‌లపైనే ఉన్నదని, నిజానికి అతను కవిరాజ్‌తో కలిసి ఓ షోరూమ్‌కు కూడా వెళ్లి గంటల తరబడి బైక్‌లను చూస్తూ గడిపాడని దినకర్ చెప్పుకొచ్చాడు.

వాస్తవానికి ఈ బైక్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దర్శన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కానుకగా ఇవ్వాలనుకున్నామని, అయితే బుల్‌బుల్ 50 రోజులను వేడుక సందర్భంగా జులై 12న ఈ ఖరీదైన బైక్‌ను ఆయనకు బహుకరిస్తున్నామని ఆయన చెప్పారు.

కోలీవుడ్ హీరోలకు క్రూయిజ్ బైక్‌లంటే మహా క్రేజ్ కాబోలు. మొన్నామధ్య కన్నడ నటుడు సుదీప్ (ఈగ చిత్రంలో విలన్‌గా చేసిన నటుడు) కూడా ఓ హ్యార్లీ డేవిడ్‌సైన్ బైక్‌ను, హ్యోసంగ్ ఎస్‌టి క్రూయిజ్ బైక్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2013, 13:30 [IST]
English summary
Kannada super star Darshan will soon be seen riding a brand new Harley Davidson cruise motorcycle worth Rs 20 lakh. The actor is not buying it himself, but the team of Bulbul will be gifting it to him on July 12.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+