మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

సాధారణంగా కొన్ని సార్లు మనిషిలో ఉన్న సృజనాత్మకత ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా తెలుసుకుని ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

నివేదికల ప్రకారం మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ ఒక చిన్న జీపుని తయారుచేసాడు. దీనిని చూసిన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అది తనకు ఇచ్చి మహీంద్రా యొక్క బొలెరో వాహనాన్ని తీసుకోమని ఆఫర్ ఇచ్చాడు. ఇది నిజంగా అతని సృజనాత్మకతకు దొరికిన బహుమతి అనే చెప్పాలి.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

దత్తాత్రేయ లోహర్ చేసిన చిన్న జీపుకు సంబంధించిన వీడియో గతంలో చాలా వైరల్ అయ్యింది. వీడియాలో ఒక చిన్న జీప్ చూడవచ్చు. కానీ ఈ జీప్ సాధారణంగా స్టార్ట్ కాదు, దీనిని కిక్ స్టార్ట్ తో స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వినటానికి కొంత వింతగా ఉన్నా, మీరు ఇక్కడ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

ఆనంద్ మహీంద్రా ఆ వ్యక్తి దగ్గర తీసుకున్న ఈ కొత్త జీప్‌ను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శన కోసం ఉంచాలనే కోరికను కూడా తెలిపాడు. తక్కువ వనరులతో కూడా ఒక వాహనాన్ని ఎలా తయారుచేయాలో ఇది మనకు స్పష్టంగా తెలుపుతుందని ఆయన అన్నారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

మొదట్లో ఆనంద్ మహీంద్రా ఆఫర్‌ను దత్తాత్రేయ కుటుంబం వద్దనుకున్నారు. ఎందుకంటే మహీంద్రా బొలెరో జీపు నిర్వహణ ఖర్చు భరించలేమన్నారు. రెండేళ్లు కష్టపడి పొదుపు చేసిన డబ్బుతో ఈ కారును తయారు చేశానని తెలిపారు. ఈ వాహనం అతన్ని చాలా రక్షించింది మరియు మొదటిసారిగా లక్ష్మి ఇంట్లోకి వచ్చిందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

ఆనంద్ మహీంద్రా దత్తాత్రేయ లోహర్ తెలివితేటలు మరియు నైపుణ్యాన్ని ప్రశంసించారు, అయితే ఈ వాహనం ఏ వాహన చట్టానికి అనుకూలంగా లేదు, కావున ఈ వాహనాన్ని ఎప్పుడైనా సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కావున ఈ జీపుకు బదులుగా కొత్త మహీంద్రా బొలెరో తీసుకోవాలని కూడా తెలిపాడు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

అయితే మొత్తానికి దత్తాత్రేయ చివరకు తన జీపును ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. తన జీపు ఇచ్చేసి కొత్త మహీంద్రా బొలెరో వాహనం తీసుకోవడం ఇక్కడ చూడవచ్చు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన కొత్త కొత్త వాహనాలు తాయారు చేసేవారిని ఎప్పూడూ మరింత ఉత్సాహపరుస్తుంటాడు. ఇందులో భాగంగానే ఇది కూడా జరిగింది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

ఇక దత్తాత్రయ్ లోహర్ యొక్క జీప్ విషయానికి వస్తే, యితడు పెద్దగా చదువుకోకపోయినా తన స్వంత ఫాబ్రికేషన్ వర్క్‌షాప్‌ను నడుపుతున్నాడు. అయితే అతనికున్న పరిజ్ఞానంతో టూ వీలర్ ఇంజన్, ఫోర్ వీలర్ బానెట్, ఆటో రిక్షా వీల్స్ ఉపయోగించి రూ. 60 వేలు వెచ్చించి ఈ జీపును సిద్ధం చేశాడు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

ఈ జీప్ టూ వీలర్ లాగా స్టార్ట్ అవుతుంది. అంతే కాకూండా ఇది ఒక లీటర్ పెట్రోల్‌లో దాదాపుగా 40 నుండి 45 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ జీపును చూసి చాలా మంది ఇలాంటి జీపును తయారు చేయమని ఆర్డర్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

భారతీయ మార్కెట్లో మోటార్ వాహన చట్టం ప్రకారం, చట్టబద్దమైన వాహనాలే ప్రజా రహదారిపై తిరగడానికి అర్హతను కలిగి ఉంటాయి. చట్ట వ్యతిరేకమైన వాహనాలు ప్రజా రహదారులపైన తిరగరాదు. అలంటి వాహనాలపైన సంబంధిత అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు. కావున వాహనాలను మాడిఫైడ్ చేసేవారు తప్పకుండా వీటన్నింటిని గుర్తుంచుకోవాలి. లేకుంటే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏది ఏమైనా దత్తాత్రయ్ లోహర్ యొక్క సృష్టి నిజంగా ప్రశంసనీయం, కానీ ఇది చట్టబద్దం కాదు.

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: తుక్కు జీపుకి కొత్త బొలెరో

భారతదేశంలో ఇంతకుముందు కూడా చాలా వాహనాలను చట్ట విరుద్దమని సీజ్ చేసిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. చట్టబద్దం కానీ వాహనాలు సురక్షితం కాదు, కావున వీటి వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరిగే అవకాశం ఉంటుంది. కావున వాహనాలు తప్పకుండా చట్టపరిధిలో తయారై సురక్షితమైన ఉన్నప్పకుడే అవి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులు దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Dattatreya lohar accepts anand mahindras offer gets bolero suv
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X