సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. ఆనందంలో మునిగిపోయిన తండ్రి - వీడియో
సాధారణంగా తల్లిదండ్రులే తమ పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటారు. అయితే అప్పుడప్పుడు పిల్లలే.. తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అలాంటి సంఘటనే ఒకటి ఇటీవల వెలుగులులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ఒక అమ్మాయి తన తండ్రికి ఇష్టమైన డ్రీమ్ బైకుని గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో గమనించినట్లయితే అమ్మాయి తన తండ్రికి రూ. 2.5 లక్షల విలువైన 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350' (Royal Enfield Classic 350) గిఫ్ట్ ఇవ్వడం చూడవచ్చు. కూతురు ఇచ్చిన గిఫ్ట్ చూసి తండ్రి ఆనందంలో తేలిపోవడం ఇక్కడ గమనించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ గిఫ్టుతో తండ్రిని ఆశ్చర్యానికి గురి చేసిన వీడియోను ఆ 'ఆర్తి సావంత్' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. బహుశా ఆ యువతి పేరు ఆర్తి సావంత్ అని తెలుస్తోంది. ఇందులో ఆర్తి తన తల్లిదండ్రులను డీలర్‌షిప్‌కు తీసుకెళ్లడం చూడవచ్చు. మొదట తన టాబ్లెట్‌లో బైక్ చెక్ చేసి.. ఆ తరువాత తండ్రి కళ్ళకు గంతలు కట్టి క్యాబ్‌లో డీలర్‌షిప్‌కి తీసుకెళుతుంది.
బైక్ కొనుగోలు చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు వంటివి అప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తండ్రి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లే సమయంలో ఆయనకు సహాయం చేస్తుంది. ఆ తరువాత కళ్ళకు ఉన్న గంతలు తొలగించి ఎదురుగా కవర్ చేసిన బైకుని చూపిస్తుంది. ఆ సమయంలో తండ్రి ముఖంలో తండ్రి ముఖంలో చిరునవ్వు, ఉత్సాహం కనిపిస్తుంది. వారు బైకుపైన ఉన్న కవర్ తీసేస్తారు.

డీలర్‌షిప్ నుంచి బైకుని డెలివరీ చేసుకున్న తరువాత సమీపంలోని గుడి దగ్గర హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. మొత్తానికి వీడియోలో ఆ తండ్రి బైక్ రైడ్ చేయడానికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. రోడ్డుపై అంతా ఆయన నవ్వుతూ బైక్ రైడ్ చేయడం గమనించవచ్చు. తల్లిదండ్రులకు పిల్లలు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. వీడియోలో యువతి తన తండ్రికి ఇచ్చిన బైక్ క్రోమ్ రెడ్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు. ఈ బైక్ ధర రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఏ వేరియంట్ ఎంచుకుంది అనేది ఇక్కడ వెల్లడించలేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ సరికొత్త జే-ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 349 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 20.2 పీఎస్ పవర్ మరియు 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పనితీరుపరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 270 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం పొందుతుంది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ కూడా ఉంటుంది. ఈ బైకులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారుకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








