DRL డే టైమ్ రన్నింగ్ లైట్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ.. ఓ అధ్యాయనంలో వెల్లడి..

LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ ఫీచర్ కారణంగా యాక్సిడెంట్లు తక్కువగా జరుగుతున్నాయని వెల్లడించింది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆ కంపెనీ ప్రత్యేకంగా అధ్యయం చేసింది. ఈ రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలను తాజాగా వివరించింది.

DRL ఆధునిక కార్లలో ఇది ప్రధాన ఫీచర్ గా ఉంది. ప్రస్తుతం వస్తున్న ప్రతీకారులోనూ ఈ ఫీచర్ ను కచ్చితంగా సంస్థలు తీసుకువస్తున్నాయి. ఇది సదరు కారుకి లేదా వాహనానికి ప్రత్యేక స్టైల్, విజువల్ రూపాన్ని అందిస్తుంది. తాజాగా పేర్కొన్న అధ్యయనంలో ఈ లైట్లు ప్రమాదాన్ని 8.8 శాతం తగ్గిస్తుందని మోనాష్ యూనివర్సిటీ అధ్యయన నివేదిక వెల్లడించింది.

DRL Lights

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలోనూ ప్రమాదాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో, DRLలు వాహనాలు ముందు వచ్చే వాహనాలకు అలెర్ట్ గా ఉంటూప్రమాదాలను నివారించడానికి సహాయపడతాయని అధ్యయనం కనుగొంది.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని మోనాష్ యూనివర్సిటీలోని యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్ ఈ అధ్యయన నివేదికను జర్నల్ ఆఫ్ సేఫ్టీలో ప్రచురించింది. ఈ అధ్యయనంలో భాగంగా న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్‌లాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి పోలీసు డేటాను ఉపయోగించి DRLలు నాన్-రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే ప్రమాదాన్ని ఎంతవరకు తగ్గిస్తాయో స్టడీ చేసింది.

డ్రైవింగ్ చేసేటప్పుడు చోదకుడి విజిబిలిటీ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇందుకోసం డే టైమ్ రన్నింగ్ లైట్లు అవసరమని పేర్కొంది. దీని వల్ల ప్రమాదాల తీవ్రత 8.8 శాతం మేర తగ్గుతున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. అధిక వేగంతో పాటు తెల్లవారుజామున, సాయంత్ర సమయాల్లో, ప్రకాశవంతమైన పగటి వెలుతురుతో పోలిస్తే ప్రమాదాల నుంచి ఇవి రక్షిస్తాయని వివరించింది.

2010 నుంచి 2017 మధ్య జరిగిన ప్రమాదాల ఆధారంగా పోలీసుల నుంచి సేకరించిన ప్రమాద డేటా ఆధారంగా అధ్యయనం చేసినట్లు పేర్కొంది. ఈ అధ్యాయనం ప్రకారం ఎల్‌ఈడీ డే రన్నింగ్ లైట్లు వల్ల ప్రమాదాలు తగ్గినట్లు చెప్పింది. ఇక మిగతా వాటితో పోల్చితే ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని నివేదించింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో వాహనాలన్నింటికీ డే టైమ్ లో కూడా ఎల్‌ఈడీ రన్నింగ్ లైట్లు తప్పనిసరి చేసింది.

అందుబాటులో ఉన్న ఆధునిక ప్రాథమిక వాహన భద్రతా సాంకేతికత ఆధారంగా ప్రమాదాల సంఖ్య తగ్గిందని అధ్యయనం పేర్కొంది. అయితే తెల్లవారుజామున, సంధ్యా సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించింది. కొత్త వాహనాల్లో DRLలను తప్పనిసరి చేయడంతో ఫలితాలల్లో స్పష్టమైన మార్పులు వస్తున్నాయని అధ్యయనం చెప్పింది. ప్రమాదాల తీవ్రతను తగ్గించుకోవడం కోసం కొన్ని ప్రామాణిక భద్రతా ఫీచర్లు కలిగి ఉన్న కార్లను పరిగణనలోకి తీసుకోవడం మంచిదని అధ్యయనం పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో లభిస్తున్న అన్ని స్కూటర్లతో పాటు ఇతర వాహనాల్లో వీటిని ఖచ్చితం చేశారు. కావున సంస్థలు కూడా అందుకు తగినట్లుగా వీటిని రూపొందిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య ఆధారంగా అంతే మొత్తంలో ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంతో కొంత ఇవి ప్రమాదాన్ని నివారించనున్నాయి కాబట్టి వీటిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న కార్లలో చాలా సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కావున కారును కొనుగోలు చేసేటప్పుడు ఉత్తమ సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లను ఎంచుకోవడం మంచిది. దీనివల్ల ప్రమాదాలను నివారించడంతో పాటు కచ్చితమైన ప్రయాణానికి అవకాశం ఉంటుంది. వివిధ సేఫ్టీ మెజర్ మెంట్స్ తో అందుబాటులో ఉన్న కార్ల జాబితా ఆధారంగా కూడా మీరు కారును కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, April 17, 2023, 18:51 [IST]
English summary
Day time running lights reduce accidents in risk by 8 percent survey revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+