లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు: డిసి అవంతి
డిసి అవంతి వలన భారతీయులమైన మనం ఆటోమొబైల్ పరంగా ఒక అడుగు ముందుకు వేశాము. ఒక లగ్జరి కారు లేదా ఒక స్పోర్ట్స్ కారు కావాలంటే ఏ జపాన్, జర్మని లేదా ఫ్రెంచ్ లాంటి దేశాలు నుండి వస్తాయి అనుకుంటాం. అందుకు భిన్నంగా ఇప్పుడు దేశీయంగా డిసి అవంతి తన స్పోర్ట్స్ కారును తయారు చేస్తోంది అంతేకాదండోయ్ ఇలా తయారు చేసిన వాటిన లండన్‌కు ఎగుమతి చేయనున్నారు. అంటే మన మువ్వన్నెల జెండా లండన్‌లో ఎగరనున్నది. మరి ఇది మనకు ఎంతో గర్వకారణం అని కూడా చెప్పవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: హోండా కు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?
దేశీయంగా తయారైన డిసి అవంతి స్పోర్ట్స్ కారు లండన్‌కు ఎగుమతి కానున్న నేపథ్యంలో దీనికి సంభదించిన విశేషాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రింద ఉన్న స్లైడ్స్ మీద ఓ లుక్కేయండి.....
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: డిసి అవంతి కూపె విడుదల: ధర రూ 35,93,000.

డిసి అవంతి డిజైన్ :
డిసి అవంతి డిజైన్ ఎంతో బాగుంటుంది. ఒక సారి పక్కనున్న ఫోటోని గమనించండి దీని సైడ్ లుక్ ఎంత బాగుందో. డిసి డిజైన్ తమ కార్లలో డిజైన్ మరియు కాన్సెప్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పవచ్చు.

డిసి ఇంజన్ :
డిసి అవంతి 2.0-లీటర్, టర్బో ఛార్జ్‌డ్ యూరో-5 పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది మరియు ఇది 250 హార్సపవర్, 365 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ :
డిసి అవంతి యొక్క ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో మౌంట్ అయిఉంటుంది. మరియు దీని ఫైనల్ డ్రైవ్ రియర్ వీల్ డ్రైవ్ ట్రెయిన్ మేనెజెస్.

అవంతి అత్యధిక వేగం :
మన రోడ్ల మీద ఎక్కువగా అంటే కార్లను ఎంత వేగంతో పరుగులు పెట్టించవచ్చు అయితే మన అవంతి కారు మాత్రం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది.
తురువాత స్లైడ్‌లో డిసి అవంతి వీడియోను చూడండి.
డిసి అవంతిని ఫోటోలోనే చూశారు కదా. ఒక సారి పక్కనున్న వీడియోని చూడండి దీని గురించి మరింత తెలుసుకోగలరు. తరువాత స్లైడ్ ద్వారా అవంతి యొక్క ధర తెలుసుకోండి.

డిసి అవంతి ధర :
డిసి అవంతి యొక్క ప్రారంభ ధర అక్షరాల 35 లక్షలు రుపాయలు.


Click it and Unblock the Notifications








