స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో స్పోర్ట్స్‌ కారు దూకుడు.. అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టి.. ఆ కాసేపటికే..

DC అవంతి భారతదేశంలో తయారైన తొలి సూపర్ స్పోర్ట్స్‌ కారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైవేపై జరిగిన ప్రమాదంలో ఈ స్పోర్ట్స్‌ కారు ఒకటి దెబ్బతింది. ఈ ప్రమాదం మరియు ప్రమాదానికి గురైన DC అవంతి కారు గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక రోజుల్లో ప్రమాదాలు జరగడం సాధారణే. ముఖ్యంగా కొత్త సంవత్సరం రోజున రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరగడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే స్వాతంత్ర్య దినోత్సవం లాంటి ప్రత్యేక రోజుల్లో మాత్రం పోలీసు సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ వేడుకల్లో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది.

DC-Avanti-Crashes

దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇటీవల దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున చాలా మంది వాహనదారులు తమ వాహనాల్లో జాతీయ జెండాలను రెపపెపలాడిస్తూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీ- ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఒక హైవేపై, కొంతమంది తమ వాహనాల్లో పెద్ద జాతీయ జెండాలను ఎగురవేస్తూ చిన్న ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ వాహన కవాతులో ఖరీదైన డీసీ అవంతి సూపర్ స్పోర్ట్స్ కారు కూడా పాల్గొంది. స్వాతంత్య్ర దినోత్సవ కవాతు సందర్భంగా వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తూ జాతీయ జెండాలను మోసుకెళ్లాలి. కానీ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో జరిగిన ఈ ర్యాలీలో డీసీ అవంతి కారు డ్రైవర్ దూకుడుగా నడిపేందుకు ప్రయత్నించాడు.

DC-Avanti-Crashes

డీసీ అవంతి కారు డ్రైవర్ హైవేపై గుంపులుగా వస్తున్న ఇతర వాహనాల మధ్యకు దూసుకెళ్లి సాహసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పి హైవే మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ పూర్తిగా అదుపు తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

డివైడర్‌ను ఢీకొనడంతో కారు రోడ్డుకు అవతలి వైపునకు దూసుకెళ్లింది. అంతలో కియా సోనెట్ కారు ఎదురుగా రావడంతో డీసీ అవంతి కారు ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగిపోయింది. దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న వీడియోలో చూసినట్లయితే సంఘటన సమయంలో DC అవంతి కారును డ్రైవర్‌ అతి వేగంతో నడుపుతున్నట్లు చూడవచ్చు.

ఈ ప్రమాదంలో డీసీ అవంతి స్పోర్ట్స్ కారు బాగా దెబ్బతింది. కారు ఢీకొనడంతో కియా సోనెట్ కూడా స్వల్పంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన కియా సోనెట్ కారు సన్‌రూఫ్‌లోంచి ఇద్దరు వ్యక్తులు బయటకు చూస్తూ ప్రయాణిస్తున్నారు.

మన దేశంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు సన్‌రూఫ్‌లోంచి చూడటం చట్టవిరుద్ధంగా నేరం. ఇలా సన్‌రూఫ్‌ నుంచి బయటకు చూడటం ద్వారా సడెన్‌గా కారు బ్రేక్‌ వేసినా.. ప్రమాదాలు జరిగినా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. DC అవంతి కారు వేగానికి కియా సోనెట్ బోల్తా పడి ఉంటే, లేదా సన్‌రూఫ్‌లోంచి చూస్తున్న వ్యక్తులు బయటకు పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా ఇలా దూకుడుగా కారను డ్రైవ్‌ చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ప్రమాదాలు జరగడం ఇది తొలిసారి కాదు. గూగుల్‌లో కనుక వెతికినట్లయితే ఫ్రీడమ్ మార్చ్‌లో పాల్గొన్న వాహనాలకు సంబంధించిన చాలా ప్రమాదాలు ఇంటర్నెట్‌లో మీరు చూడవచ్చు. ఏదేమైనా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయనేది దానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.

More from DriveSpark

Article Published On: Wednesday, August 16, 2023, 18:59 [IST]
English summary
Dc avanti sports car crashes while doing high speed stunts during independence day rally video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+