తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

కరోనా పేరు వినగానే యావత్ ప్రపంచాన్ని కుదిపివేసిన భయంకరమైన వైరస్ గుర్తుకు వస్తుంది. చైనాలో 2019లో పుట్టిన ఈ వైరస్ దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ ద్వారానే 'కరోనా' అనే పేరు ప్రపంచానికి తెలిసింది.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

కానీ, ఈ పేరుతో కొన్ని బ్రాండ్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? వీటిలో మన హైదరాబాద్‌లో తయారయ్యే కరోనా బస్సులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మరి ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

భారతదేశంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఐషర్ వంటి సంస్థలతో పాటుగా మెర్సిడెస్ బెంజ్, స్కానియా వంటి కంపెనీలు కూడా హై-ఎండ్ బస్సులను తయారు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో కరోనా బస్ మ్యాన్యుఫాక్చరింగ్ అనే సంస్థ కూడా హై-ఎండ్ బస్సులను తయారు చేస్తోంది.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

ఇదొక భారతీయ కంపెనీ. తెలంగాణాలోని డెక్కన్ ఆటో సంస్థతో కలిసి ఈ కంపెనీ పనిచేస్తోంది. కరోనా బ్రాండ్ పేరుతో ఈ కంపెనీ బస్సులను తయారు చేసి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తుంటుంది. ఈ బస్సుల తయారీలో వాడే పరికరాలన్నింటినీ కంపెనీ దాదాపు పూర్తిగా భారతదేశం నుండే సమీకరిస్తుంది.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

అన్ని భారతీయ కంపెనీల బస్సుల మాదిరిగానే, ఈ కరోనా బస్సులలో కూడా వెనుక ఇంజన్ కాన్ఫిగరేషన్ ఉపయోగించబడుతుంది. కరోనా బ్రాండింగ్‌తో తెలంగాణలో ఉన్న డెక్కన్ ఆటో ఈ బస్సులను రూపొందిస్తుంది. ఈ కంపెనీ 2004లోనే ప్రారంభమైంది. యాదృచ్ఛికంగా, ఈ బస్సుల పేరు ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా మహమ్మారి పేరుతో బ్రాండ్ చేయబడ్డాయి.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

డెక్కన్ ఆటో ఈ బస్సులను హైదరాబాద్‌లో తయారు చేస్తుంది మరియు వీటన్నింటినీ కూడా పూర్తిగా భారతదేశంలో తయారు చేస్తారు. ఈ బస్సుల తయారీలో ఉపయోగించే ఇంజన్ నుండి బాడీ వరకూ అన్నింటినీ భారతీయ కొనుగోలుదారుల నుండే సేకరిస్తుంది. కరోనా బస్సు ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

గత 2004లో ప్రారంభమైన కరోనా బస్ మ్యాన్యుఫాక్చరింగ్ సంస్థ తమ బస్సులలో ఉపయోగించే సాంకేతిక సహకారం కోసం చైనా బస్సు కంపెనీ జోంగ్‌టాంగ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఈ చైనా కంపెనీకి చెందిన కొన్ని బస్సులను కూడా భారతదేశంలో అసెంబుల్ చేశారు.

MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

అయితే, ఇప్పుడు కరోనా బ్రాండ్ కింద తయారు చేయబడిన అన్ని బస్సులలో మాత్రం, భారతదేశంలో తయారు చేసిన భాగాలు మరియు సామగ్రినే ఉపయోగిస్తాయి. కరోనా బస్సులలో అమర్చిన ఇంజన్లను పురాతమ ఆటోమొబైల్ బ్రాండ్ కమ్మిన్స్ నుండి తీసుకోబడ్డాయి. ఈ బస్సులలో, సాధారణ చాస్సిస్‌కు బదులుగా మోనోకోక్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

ఈ బస్సు తయారీలో ఉపయోగించే ఫ్రేమ్ కూడా భారతదేశంలో తయారవుతుంది. ఇవి కాకుండా, బస్ సస్పెన్షన్ వ్యవస్థ మరియు కొన్ని కీలకమైన విడిభాగాలు కూడా భారతదేశంలోనే తయారు చేయబడతాయి. మొత్తంమీద, కరోనా బస్ సంస్థ భారతదేశంలోని స్థానిక మహీంద్రా, టాటా మరియు ఐషర్ కంపెనీల మాదిరిగానే ఓ స్వదేశీ సంస్థగా ఉంటుంది.

MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

భారతదేశంలో ఈ కంపెనీ మార్కెట్ గురించి మాట్లాడితే, ఈ సంస్థకు దేశంలోని ఎంపిక చేసిన నగరాల నుండి బస్సుల కోసం ఆర్డర్లు లభిస్తాయి. ఈ సంస్థ యొక్క పేలవమైన మార్కెటింగ్ వ్యూహం కారణంగా, కరోనా బస్ బ్రాండ్ పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఇండోర్‌లో డెక్కన్ కరోనా బస్సులను ఉపయోగిస్తున్నారు. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్‌లకు కూడా కంపెనీ తమ కరోనా బస్సులను పంపిణీ చేసింది.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

కరోనా బస్సుల విషయానికి వస్తే, డెక్కన్ ఆటో నాలుగు రకాల మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. వీటిలో స్కైప్యాక్ 009, స్కైప్యాక్ 009 బిఆర్‌డి, ఫార్చ్యూన్ 007 మరియు మల్టీ ప్లస్ స్లీపర్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఎయిర్ సస్పెన్షన్‌తో వచ్చే ఈ బస్సులన్నీ కమ్మిన్స్ 5900 సిసి సూపర్ రిఫైన్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మోనోకోక్ నిర్మాణంపై తయారుచేసి, విడుదల చేసిన తొలి భారతీయ బస్ కంపెనీలలో కరోనా బ్రాండ్ ఒకటి. కరోనా బస్సులు తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం కారణంగా హైవేపై మరింత స్థిరంగా పరిగణించబడతాయి. కరోనా బస్సులలో వెనుక ఇంజన్ మరియు తేలికపాటి నిర్మాణం కారణంగా అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

డెక్కన్ ఆటో యొక్క బలహీనమైన మార్కెటింగ్ వ్యూహం కారణంగా, ఈ సంస్థ మీడియా లేదా వార్తలలో చాలా తక్కువ ప్రాచుర్యం పొందింది. మరి భవిష్యత్తులో ఈ కంపెనీ కరోనా బ్రాండ్ పేరుతో బస్సులను తయారు చేస్తుందో లేదో చూడాలి.

Most Read Articles

English summary
Deccan Auto Manufactures Buses With Corona Branding In Telangana, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X