86 వసంతాలు పూర్తి చేసుకున్న డెక్కన్ క్వీన్ రైలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

By Anil

ఆంగ్లేయులు ఆరభించి వెళ్లిపోయిన వాటిలో రైల్వే ఒకటి. ఈ రైల్వే నేడు ఇండియన్ రైల్వేగా దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. ఇండియన్ రైల్వే గురించి తెలుసుకోవాలంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో మనకు స్వాతంత్ర్యం రాక ముందు సేవలు ప్రారంభించిన డెక్కన్ క్వీన్ రైలు ఒకటి. సరిగ్గా నేటితో 86 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ రైలు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

జన్మదినం

జన్మదినం

డెక్కన్ క్వీన్ రైలు యొక్క జన్మదినం నేడు అని చెప్పవచ్చు. సరిగ్గా జూన్ 1, 1930 సేవలు అందివ్వడం ప్రారంభించింది. అప్పట్లోనే విద్యుత్ రైలుగా పేరు గాంచి విద్యుత్‌ను ఇంధనంగా వినియోగించుకునేది.

ముంబాయ్ మరియు పూనేల మధ్య

ముంబాయ్ మరియు పూనేల మధ్య

ముంబాయ్ మరియు పూనేల మధ్య ఈ డెక్కన్ క్వీన్ రైలు సేవలు ఆరంభించింది. మొదటి సారిగా ఈ డెక్కన్ క్వీన్ రైలును WCM1 అనే లోకోమోటివ్ ఇంజన్‌ లాగింది.

వారాంతాల కోసం అందుబాటులోకి

వారాంతాల కోసం అందుబాటులోకి

1930 ల కాలంలో దీనిని ముంబాయ్ మరియు పూనేల మధ్య కేవలం వారాంతాల కోసం మాత్రమే నడిపే వారు. ఆ తరువత కాలంలో దీనిని డైలీ సర్వీసుగా మార్చారు.

మొదటి స్థానంలో డక్కన్ క్వీన్

మొదటి స్థానంలో డక్కన్ క్వీన్

డెక్కన్ క్వీన్ రైలు అందుబాటులోకి వచ్చిన తరువాత దీని పేరు మీద అనేక మొట్ట మొదటి రికార్డులు నమోదయ్యాయి. అవి,

  • భారతదేశపు మొదటి సూపర్ ఫాస్ట్ రైలు
  • ఎక్కువ దూరం ప్రయాణించే మొదటి ప్రయాణికుల ఎలక్ట్రిక్ రైలు
  • మొదటి సారిగా మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన రైలు
  • భోజనశాలలు

    భోజనశాలలు

    భారత దేశంలో ఉన్న ప్యాసింజర్ రైళ్లలో ఈ డెక్కన్ క్వీన్ రైలులో మాత్రమే భోజనాలు చేసేందుకు వీలుగా డైనింగ్ కార్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉదయం ఫలహారాలు మరియు సాయంకాలం స్నాక్స్ అందించే వారు.

    సమయానికి వచ్చే డెక్కన్ క్వీన్ రైలు

    సమయానికి వచ్చే డెక్కన్ క్వీన్ రైలు

    డెక్కన్ క్వీన్ రైలు ప్రతి రోజు ఉదయం 7:15 లకు బయలుగదేరి 10:25 లకు ముంబాయ్‌కు చేరుకుంటుంది. తిరిగి సాయంకాలం 5:10 లకు ముంబాయ్‌ నుండి బయలు దేరి రాత్రి 8:25 లకు పూనేకు చేరుకుంటుంది. ఈ రైలు గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్న సందర్బాలు చాలా తక్కువ.

    ప్రజల యొక్క డెక్కన్ క్వీన్

    ప్రజల యొక్క డెక్కన్ క్వీన్

    దీనిని ప్రజల యొక్క డెక్కన్ క్వీన్ రైలు అనడానికి కారణం ఎవరయితే దీని వయస్సుతో సమానంగా ఉన్నారో వారు ఈ రైలు ప్రారంభించిన రోజును పుట్టిన రోజుగా కేక్‌ కట్ చేసి పండుగను జరుపుకుంటారు. ఇలా జరుపుకునే రైలు కూడా ఇదే.

    86 వసంతాలు పూర్తి చేసుకున్న డెక్కన్ క్వీన్ రైలు

    ప్రపంచపు అత్యంత పొడవైన రైలు సొరంగం

    170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు

More from DriveSpark

Article Published On: Wednesday, June 1, 2016, 18:36 [IST]
English summary
Deccan Queen' Completes 86 Years On The Rails
Read more on: #రైలు #rail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+