భారత సైన్యంలోకి మరో 97 తేజస్ యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లు.. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం
భారత సైన్యం కోసం భారీగా యుద్ధ విమానాలు, ఇతర అవసరమైన తేలిక పాటి విమానాలు మరియు వాహనాలను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. అందులో భాగంగా తాజాగా సాయుధ బలగాల మొత్తం పోరాట సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది.
యుద్ధ విమానాలు హెలికాప్టర్ల కొనుగోలు కోసం ప్రాథమిక అనుమతిని పొందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదించంది. దీనితో పాటు భారత వైమానిక దళంలో తన ఎస్‌యూ-30 ఫైటర్ ఫ్లీట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను కూడా ఆమోదించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

మెగా ప్రొక్యూర్‌మెంట్, ఎస్‌యూ-30 అప్‌గ్రేడ్ వల్ల రూ.1.6 లక్షల కోట్ల మేర భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా. డిఏసీ క్లియర్ చేసిన ప్రాజెక్టుల వివరాలను త్వరలో రక్షణ మంత్రిత్వ శాఖకు అందించనుంది. ఆ తర్వాత వీటికి క్లియరెన్స్ లభించనుంది. భారత వైమానిక దళం కోసం దాదాపు రూ. 65,000 కోట్లతో 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
వీటితో పాటు 156 LCH ప్రచండ్ ఛాపర్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. 84 ఎస్‌యూ-30MKI యుద్ధ విమానాల అప్‌గ్రేడ్ ప్లాన్ కూడా క్లియర్ చేసింది. ఈ అన్ని రకాల ప్రతిపాదనలు రూ. 1.6 లక్షల కోట్ల విలువైనవిగా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ అంచనా వ్యయం పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)చే అభివృద్ధి చేయబడుతున్న తేజస్ రక్షణ విభాగానికి ఇందులో అధిక ప్రాధాన్యతను ఇస్తుంది రక్షణ శాఖ. దీనితో వైమానిక రక్షణ, సముద్ర నిఘా మరియు ఇతర ముఖ్య ఆపరేషన్లు చేపట్టేందుకు HAL తయారు చేస్తుంది. ఇది ఒక మల్టీరోల్ విమానం. తేజాస్ Mk-1A, తేలికపాటి యుద్ధ విమానం.
ఏవియానిక్స్, అలాగే యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్టీర్డ్ రాడార్, అప్‌డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ మరియు విజువల్ రేంజ్ మిస్సైల్ సామర్థ్యాన్ని తేజస్ కలిగి ఉంటుంది. కొత్త వేరియంట్ పెరిగిన స్టాండ్-ఆఫ్ పరిధుల నుంచి అనేక ఆయుధాలను మట్టు పెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. దీని అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఏఎల్ నిర్విరామంగా కృషి చేస్తోంది. తాజాగా వీటి సంఖ్యను కేటాయింపుల ఆధారంగా ఉత్పత్తి ఉండనుంది.

ప్రచండ్ ఇది ఒక లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH). ఇది కూడా HALచే రూపొందించబడింది. ఇది 5,000 మీటర్ల (16,400 అడుగులు) ఎత్తు నుండి ల్యాండ్ మరియు టేకాఫ్ చేయగల సామర్థ్యం కలిగిన మల్టీ రోల్ తేలికపాటి ఎటాక్ హెలికాప్టర్. ఇది సలభంగా ఆపరేట్ చేయడానికి అనువైనది. భారత సరిహద్దులోని ఎత్తైన ప్రాంతాలలో మరియు దాగి ఉన్న శత్రువులను గుర్తించి వారిని దాడి చేయడంలో దిట్ట.
అంతే కాకుండా శత్రువుల రాడార్‌లు మరియు శత్రు క్షిపణుల ఇన్‌ఫ్రారెడ్‌ల నుంచి రక్షించే కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంది. ఇది వివిధ రకాల గాలి నుండి భూమి మరియు గాలి నుండి గాలికి ప్రయోగించే క్షిపణులను కాల్చి వేయగలదు.

ఇందులో అత్యుత్తమ స్టెల్త్ లక్షణాలు, ఆర్మర్డ్ షీల్డ్ సిస్టమ్‌లు మరియు డార్క్ మోడ్ అసాల్ట్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. వీటితో పాటు, ప్రచండ్ రాడార్ మరియు ఇన్‌ఫ్రారెడ్ సిగ్నేచర్ వంటి ఇతర సాంకేతికతలపై దాని క్రాష్- రెసిస్టెంట్ ల్యాండింగ్ గేర్ ఉంటాయి.


Click it and Unblock the Notifications








