Video Viral స్కూటీపై పెళ్లి కుమార్తె చక్కర్లు.. ఊహించని గిఫ్ట్ పంపిన పోలీసులు..!!
సోషల్ మీడియా ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో గడిపే కాలం ఈ మధ్య గణనీయంగా పెరిగింది. కొంత మంది వ్యక్తులు పాపులారిటీ కోసం వీడియోలను క్రియేట్ చేసి తమ సోషల్‌మీడియా వేదికల్లో షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం యువత కొత్త కొత్త ఆలోచనలతో వీడియోలను రూపొందించిన సోషల్‌మీడియాల్లో షేర్ చేస్తున్నారు.
అయితే అలాంటి రీల్స్, వీడియోలు రూపొందిస్తున్న సమయంలో చాలా సార్లు నిబంధనలను అతిక్రమిస్తుంటారు. అవి కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం కూడా కావచ్చు. ఇటీవల ఢిల్లీలో ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అలా ఢిల్లీ పోలీసుల వరకు చేరింది. స్పందిన పోలీసులు యువతికి 6 వేల రూపాయల ఫైన్ విధించారు.

ఢిల్లీకి చెందిన పెళ్లి కుమార్తె స్కూటీని డ్రైవ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న యువతి హెల్మెట్ లేకుండా తన వాహనంతో ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టింది. అతికొద్ది సమయంలో వీడియో కాస్త వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ఢిల్లీ పోలీసులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించారు.
బైక్ లేదా స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. అయితే ఈ వీడియోలో ఉన్న యువతి పెళ్లి కుమార్తె దుస్తుల్లో ఉంది. ఆ దుస్తులు బాగా పొడవుగా ఉండడం మనం గమనించవచ్చు. దాంతో స్కూటీ టైర్లలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఇలాంటి చర్యలు తమను ఆందోళనకు గురిచేశాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. దాంతోపాటు ఆ యువతికి జారీచేసిన జరిమానాను కూడా షేర్ చేశారు. చలాన్‌లో 6 వేల రూపాయల జరిమానా విధించినట్లుగా ఉంది.
హెల్మెట్ ధరించనందుకు 1000 రూపాయలు మరియు స్కూటీ డ్రైవింగ్ చేసిన యువతికి లైసెన్స్ లేని కారణంగా మరో 5 వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా బైక్ లేదా కారును డ్రైవింగ్ చేయడం నేరం. అదే మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు పెట్టవచ్చు. ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు మరో కామెంట్ చేశారు. రీల్స్, వీడియోలు రూపొందించుకొనేందుకు రోడ్లు సరైన ప్రదేశాలుకావని స్పష్టంచేశారు.
ఎవరైనా ఇలాంటి రీల్స్ లేదా వీడియోలు రూపొందించాలనుకుంటే మూసి ఉన్న రోడ్లు లేదా మైదానాలను ఎంచుకోవాలి. మరియు డ్రైవింగ్‌పైనా దృష్టిపెట్టాలి. రోడ్లపై ఇలాంటి వీడియోలు రూపొందించే సమయంలో ప్రమాదాలకు దారితీయవచ్చు. ఇలాంటి ఘటనలపై గతంలో పోలీసులు దీటుగానే స్పందించారు. భారీగా జరిమానాలు విధించారు.
మరియు ఇలాంటి వీడియోలు రూపొందించే వ్యక్తులు తాము ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని గుర్తుంచుకోవాలి. రీల్స్ చేసే సమయంలో రోడ్లపై ప్రయాణం చేస్తున్న ఇతరులు కూడా అసౌకర్యానికి గురవుతారని గుర్తించాలి.


Click it and Unblock the Notifications








