Just In
Don't Miss
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- News
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు
- Movies
‘ఢీ’లో అలాంటి వ్యవహారాలా?.. కంటెస్టెంట్లతో మాస్టర్ల అఫైర్స్.. బయటపెట్టేసిన సుమ
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక్కరోజులో 600 పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఎక్కడో తెలుసా.. !
భారతదేశం సంస్కృతి మరియు సంప్రదాయాలకు పుట్టినిల్లు. మన సంస్కృతిని తెలియజేయడానికి చాల కాలంనుంచి కొన్ని పండుగలను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో హోలీ పండుగను చాల కోలాహలంగా జరుపుకున్నారు.

ఉత్తర భారతదేశంలో మాత్రమే కాకుండా భరతదేశం మొత్తం ఈ పండుగను జరుపుంటుంది. ఈ హోలీ పండుగలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు పాల్గొంటారు. హోలీ పండుగలో ప్రత్యేకంగా యువకుల పాత్ర చాలానే ఉంటుంది. ఇంత సరదాగా జరుపునే హోలీలో మందు తాగడం వంటివి సాధారణం.

సాధారణంగా ఇటీవల కాలంలో మందు తాగడం తాగడం సర్వసాధారణంగా మారిపోయింది. పండుగలలో, ఉత్సవాలలో మందుతాగడం అలవాటుగా మారిపోయింది. మందు తాగడమే కాకుండా, తాగి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల చాల ప్రమాదాలు జరుగుతాయి.

రోడ్డు నిబంధనల ప్రకారం మందు తాగి వాహనాలు నడపడం చట్ట రీత్యా నేరం. కానీ రోడ్డు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి జరిమానాలు కూడా విధించబడుతున్నాయి. ఇలాంటి కఠినమైన చర్యలు ఎన్ని చేపట్టినప్పటికీ కూడా తాగి వాహనాలు నడపడం మాత్రం పూర్తిగా ఆపలేకపోతున్నారు.

ఈ హోలీ నేపథ్యంలో భాగంగా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేకదళాలు తాగి డ్రైవింగ్ చేసేవారిని తనికీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తాగి వాహనాలు నడుపుతున్నవారిని గుర్తించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పొలిసు దళాలు ఒక్కరోజులో ఏకంగా 647 మందిని గుర్తించి జరిమానా విధించారు.

అంతే కాకుండా ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న 181 మందిని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన 1,192 మందితో సహా దాదాపు 2,176 మందికి ఢిల్లీ పోలీసులు జరిమానా విధించడం జరిగింది. ప్రజలు మద్యం తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారి నుండి పడకూడదనే ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు ఈ విధంగా చేయడం జరిగింది.

గత సంవత్సరం హోలీ పండుగలో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా ప్రమాదాలు జరగకూడదని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా 170 ప్రధాన ప్రదేశాలలో 1,600 మందికి పైగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
గమనిక: ఇక్కడ ఉన్న చిత్రాలు కేవలం సూచన కోసం మాత్రమే.