70-లీటర్ల ట్యాంకులోకి 74-లీటర్ల ఇంధనాన్ని నింపారు...!!
మీ కారులో డీజల్ ట్యాంకు ఇంకొంచెం పెద్దగా ఉండే బాగుండేది. సుమిత్ పర్మార్ అనే ఢిల్లీ వాసి పెట్రోల్ బంకు నిర్వాహకులు చెప్పిన ఈ సమాదానం విని అశ్చర్యపోయాడు. ఢిల్లీ నగరంలో ఇతను తన ఎక్స్‌యూవీ500 వాహనాన్ని ఇంధనం నింపడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. అయితే 74 లీటర్ల డీజల్ నింపినట్లు నిర్వహకులు ఇతనికి బిల్ ఇచ్చారు. 70-లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులోకి 74 లీటర్ల డీజల్ ఇంధన ఎలా నింపారు అనేది ఇతనికి పాలుపోలేదు. అదేతడవుగా వారిని ప్రశ్నిస్తే మొదట్లో మేము రాసిన విధంగా సమాధానం ఇచ్చారు.

సుమిత్ కథనం ప్రకారం తన వాహనంలో అప్పటికే 10 లీటర్లు డీజల్ కలదు. తద్వారా ఇందులో 70 లీటర్లు నింపే సామర్థ్యం ఉండేది. అయితే 74 లీటర్లు డీజల్ ఎలా నింపారు అని ప్రశ్నించగా పెట్రోల్ బంకు యాజమాని అక్కడికి దగ్గర్లో పోలీస్ మరియు కేజ్రీవాల్ బందువులని వారించి అక్కడ నుండి సుమిత్‌ను పంపించేశారు.
Also Read: డ్రైవింగ్ గురించి ఈ విషయాలు నిజంగా తెలుసా ?
వీరి చేష్టలకు అసంతృప్తితో ఉన్న సుమిత్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఇచ్చిన బిల్‌ను మరియు పెట్రోల్ బంకును ఫోటోగా తీసి ప్రముఖ సామాజిక వేదిక అయిన ఫేస్‌బుక్‌లో పూర్తి వివరాలు వ్రాసి ఫేస్‌బుక్ ద్వారా అందరినీ సహాయాన్ని కోరాడు. ఇతను దీనిని పోస్ట్ చేసిన 24 గంటల్లోపే సుమారుగా 13,000 మంది షేర్ చేశారు.

Also Read: 350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు
ఈ సమాచారం మొత్తం నూటికి నూరు శాతం నిజం. ఈ దేశానికి ఏమైందో మీరే చెప్పండి ? బాగా డబ్బున్న వాళ్లతో పోల్చితే సామాన్యుల జీవితం రాను రాను ఎంత దౌర్భాగ్యమౌతోందో చూస్తున్నారా ? దేశాభివృద్దిలో భాగంగా ఉండాల్సిన పోలీసులు మరియు రాజకీయ వేత్తలు ఇలా ప్రజలను మోసం చేసే వారికి అండగా నిలుస్తున్నారు. ఇలాంటి మోసాలు చేస్తే అందరితో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నారా ?



Click it and Unblock the Notifications








