ఢిల్లీ యువతి కారు, ఎస్కార్ట్ వాహనాల వీడియో వైరల్.. అసలు ఎవరీ యువతి..!
భారత్‌లో గతంలో పోలిస్తే లగ్జరీ, ఖరీదైన కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు మరో కీలక మార్పులు గమనించవచ్చు. గతానికి భిన్నంగా అనేక మంది మహిళలు లగ్జరీ, స్పోర్ట్స్ కార్లలో తిరుగుతున్నారు. తాజాగా బీఎండబ్ల్యూ కారులో సెక్యూరిటీ గార్డులతో కలిసి కాలేజీకి వెళ్తున్న 20 ఏళ్ల యువతి కోసం ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి చెందిన రహానా కిఫాయత్ ఇతరులతో పోలిస్తే కొంచెం భిన్నమైన లైఫ్‌స్టైల్‌ను గడుపుతున్నారు. చాలా మంది విద్యార్థినులు కార్లలో కాలేజీకి వెళ్లడం సాధారణం. అయితే రహానా మాత్రం బీఎండబ్ల్యూ Z4 స్పోర్ట్స్ కారులో ( BMW Z4 ) వెళ్తున్నారు. రహానా కారును ఆమె సెక్యూరిటీ గార్డులు రెండు మహీంద్రా బొలెరో కార్లలో అనుసరిస్తున్నారు.

రహానా తండ్రి ఆమెకు బీఎండబ్ల్యూ -3 సిరీస్ కారును బహుమతిగా ఇచ్చారు. దాంతోపాటు రహానా కోసం మరో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశారు. 30 లక్షల రూపాయలతో బీఎండబ్ల్యూ Z4 2016 మోడల్ కొనుగోలు చేశారు. ఈ కారు 2 -సీటర్ స్పోర్ట్స్ కారు యొక్క హార్ట్‌టాప్ వెర్షన్‌ను కలిగి ఉన్నారు.
BMW Z4 కారులో కాలేజీకి వెళ్తున్నప్పుడు మహీంద్రా బొలెరో నియో కార్లలో సెక్యూరిటీ గార్డులు ఎస్కార్ట్‌గా అనుసరిస్తారు. అయితే తనకు సెడాన్ల డ్రైవింగ్‌పై ఎంతో ఆసక్తి ఉందని రహానా తెలిపారు. బీఎండబ్ల్యూ Z4ను డ్రైవింగ్ చేస్తుండగా.. రెండు సెక్యూరిటీ వాహనాలు అనుసరిస్తు్న్న వీడియో వైరల్ అవుతోంది. రహానా లైఫ్ స్టైల్ చూసి చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఢిల్లీ వంటి అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ డ్రైవింగ్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని రహానా తెలిపారు. దాంతోపాటు లగ్జరీ కారు చాలా సౌకర్యంవంతమైన అనుభూతిని ఇస్తోందని రహానా తెలిపారు. అయితే తన కారులో కొన్ని సమస్యలున్నాయని త్వరలో వాటికి పరిష్కారం చూపిస్తానని తెలిపారు.
అయితే లగ్జరీ, స్పోర్ట్స్ కార్లను డ్రైవింగ్ చేయాలని చాలామంది మహిళలు కూడా బలంగా కోరుకుంటారు. అయితే రహానా వంటి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో బీఎండబ్ల్యూ Z4 వంటి స్పోర్ట్స్ కారును కలిగి ఉన్న తక్కువ మంది యువతుల్లో రహానా ఒకరిగా నిలిచారు.

ఈ వీడియోను మిహిర్ గలాత్ తన యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలోని రహానా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. రహానా కారు సహ ఆమె ఎస్కార్ట్ వాహనాల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇతరులతో పోలిస్తే రహానా కొంత భిన్నమైన లైఫ్ స్టైల్‌ను గడుపుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








