మీకు తెలుసా.. ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహదారుడు లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పకుండా కలిగి ఉండాలి. లేకుంటే చట్ట విరుద్ధమని మోటార్ వాహన చట్టం కింద భారీ జరిమానాలు వంటివి విధిస్తారు. వాహనదారుడు నిత్యం డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటివి తనతో పాటుగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని, కావున వాహనదారులకు ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకువచ్చింది.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఇప్పుడు డిజిటల్ వెహికల్ డాక్యుమెంట్స్ ఉంచడానికి ఉంచడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. కావునా వాహదారుడు తమ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రభుత్వం అనుమతించిన ఒక యాప్ లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి సంబంధిత అధికారులు అడిగినప్పుడు చూపించడానికి ఉపయోగపడతాయి.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

అయితే వాహనానికి సంబంధిచిన డాక్యుమెంట్స్ అన్ని డిజిలాకర్ లేదా ఎం-పరివాహన్ వంటి యాప్‌లలో స్టోర్ చేసుకోవచ్చు. పోలీసులు మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించమని అడిగినప్పుడు హార్డ్ కాపీలు చూపించాల్సిన అవసరం ఉండదు. అంతే కాకూండా పోలీసులు కూడా ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాలని బలవంతం చేయలేరు.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

డిజిలాకర్ ప్లాట్‌ఫారమ్ లేదా ఎం-పరివాహన్ మొబైల్ యాప్‌లో డిజిటల్ రూపంలో లభించే డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అయ్యే పత్రాలు, అని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం రవాణా శాఖ నోటీసు జారీ చేసింది.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

వాహనదారులకోసం రవాణా శాఖ జారీ చేసిన సర్టిఫికెట్స్ మాదిరిగానే ఇవి చట్టపరంగా గుర్తించబడ్డాయి. డిజిలాకర్ మరియు ఎం-పరివాహన్ యాప్ డాక్యుమెంట్లు మరియు సర్టిఫికెట్ల స్టోరేజ్, షేరింగ్ మరియు ధృవీకరణ కోసం క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు. ట్రాఫిక్ పోలీసులు మరియు రవాణా శాఖ యొక్క ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డిజిలాకర్ మరియు ఎమ్- పరివాహన్ యాప్‌లో చూపినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క ఎలక్ట్రానిక్ ఫారమ్‌ను అంగీకరిస్తాయని నోటీసులో పేర్కొంది.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

డిజిలాకర్ లేదా ఎమ్-పరివాహన్‌లో లభ్యమయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క ఎలక్ట్రానిక్ రికార్డులు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 నిబంధనల ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్‌లుగా గుర్తించబడ్డాయి. కావున వాహనదారులు తప్పకుండా ఒరిజినల్ డాక్యుమెట్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

ప్రభుత్వం నిర్దేశించిన డాక్యుమెట్స్, ప్రభుత్వం ఆమోదించిన డిజిలాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్‌లో భద్రపరచడం సురక్షితంగా మరియు చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది, అయితే వాటిని డిజిటల్‌గా నిల్వ చేయడానికి ఉపయోగించే ఇతర యాప్‌లు ఆమోదించబడవు. వాహనాదారులు దీనిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

ఇటీవల రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలను జరీ చేసింది. ఇందులో చలాన్లు మరియు జరిమానాలకు సంబంధించిన సమాచారం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 రోజుల్లోగా పోలీసులు ఇ-చలాన్ (ఎలక్ట్రానిక్ చలాన్) జారీ చేస్తారు.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

ఇందులో స్పీడ్ కెమెరాలు, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, స్పీడ్ గన్స్, బాడీ వేరబుల్ కెమెరాలు, డాష్‌బోర్డ్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, వెయిట్-ఇన్ మెషిన్‌లు వంటి పరికరాలు జరిమానా విధిచడానికి ఉపయోగించబడుతాయని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇవన్నీ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తాయి, అంతే కాకుండా ఇవి రోడ్డు ప్రమాదాల తీవ్రతను కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

ట్రాఫిక్ ఉల్లంఘనాలకు పాల్పడిన 15 రోజుల్లో ఇ-చలాన్ యొక్క సమాచారం పంపబడుతుంది మరియు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ ద్వారా సేకరించిన రికార్డులు చలాన్ చెల్లిచాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా వాహదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఈ ప్రమాదాల స్థాయిని తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సరైన రోడ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

ఇలా చేస్తే వెహికల్ డాక్యుమెంట్స్ మీతోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు

వాహనదారులు కూడా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఖచ్చితమైన ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అప్పుడే మీకు మరియు మీతోటి వారికీ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తుంది. రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. కావున వాహనదారులు కూడా తమవంతు ప్రభుత్వాలకు సహకరించి మీ ప్రాణాలను మరియు సతి వారిని కాపాడటానికి ఒక అడుగుముందుకు వేయండి.

Most Read Articles

English summary
Delhi government approves digital vehicle documents stored in m parivahan digilocker app
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X