'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

శీతాకాలం ప్రారంభం కాకముందే భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం తగిన సన్నాహాలను ఇప్పటినుంచే ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యాయి PUC (Pollution Under Control) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతే కాకుండా వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిగ్నెల్ వద్ద తమ వెహికల్ ఇంజిన్ ఆపివేయాలని కూడా అక్కడి ప్రభుతం తాజాగా వెల్లడించింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

సోమవారం ఢిల్లీ రవాణా శాఖ, ఢిల్లీలో 'రెడ్ లైట్ ఆన్, ఇంజిన్ ఆఫ్' అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రచారం ప్రారంభించబడింది. ఈ ప్రచారం నెలకు 100 ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్‌లో నిర్వహించబడుతుంది. ఈ ప్రచారానికి గాను దాదాపు 2,500 మందికి పైగా పౌర రక్షణ వలంటీర్లను నియమించారు.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

2021 నవంబర్ 18 వరకు కొనసాగే ఈ ప్రచారం నగరంలోని 100 ట్రాఫిక్ జంక్షన్లలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల నిర్వహించబడుతుంది. ఆ సమయంలో దీనికోసం నియమించిన వాలంటీర్లు కాలుష్యం గురించి వాహనదారులకు అవగాహన పెంచుతారు.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

ఆ సమయంలో వాలంటీర్లు వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నెల్ లో లేచి ఉండేటప్పుడు తప్పనిసరిగా వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేయాలని సూచించారు. ఈ ప్రచారాన్ని ప్రారంభించాడని ఢిల్లీలో పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ITO క్రాసింగ్‌ని సందర్శించారు. కాలుష్య వ్యతిరేక పోరాటం విజయవంతం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

సాధారణంగా మామూలు సమయాల్లోకంటే కూడా శీతాకాలంలో, ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువవుతుంది, కావున ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరు ఈ సందర్భంగా వాహనదారులకు తెలిపారు. అంతే కాకుండా పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ (PCRA) నుండి వచ్చిన డేటాను ప్రస్తావిస్తూ, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఇంజిన్‌లను ఆపివేస్తే కాలుష్యాన్ని 13% నుండి 20% వరకు తగ్గించవచ్చని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. కాలుష్యంపై పోరాడటానికి మనమందరం కలిసి పోరాడాలని సూచించారు. ఈ ప్రచారానికి ప్రజల మద్దతు ఎంతైనా అవసరం అని వారు తెలిపారు.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

గతేడాది ఢిల్లీలో కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. ఢిల్లీలో శీతాకాలం ప్రారంభానికి ముందు, కాలుష్యాన్ని నియంత్రించడానికి మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ ప్రచారం ప్రారంభమైంది, కావున రాబోయే శీతాకాలానికి కాలుష్యం భారీగా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

సాధారణంగా గత నెల నాటికి వాహనాలు తప్పనిసరిగా PUC సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఢిల్లీలో వాహనదారులు చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే, దాదాపు రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో రవాణా శాఖ ద్వారా 900 పైగా పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్స్ ప్రారంభించబడ్డాయి. ఈ సెంటర్స్ నగరం చుట్టూ పెట్రోల్ బంకర్లు మరియు వర్క్‌షాప్‌లలో ఏర్పాటు చేయబడ్డాయి.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

వాహనదారులందరూ తమ వాహనాలను ఈ సెంటర్స్ లో టెస్ట్ చేసుకోవాలని మరియు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్లు పొందాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. వాహనాలు కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వివిధ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి.ఈ భాగాలు కాలానుగుణంగా పరీక్షించబడతాయి మరియు PUC సర్టిఫికెట్‌తో జారీ చేయబడతాయి.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం, 1989 కింద PUC సర్టిఫికేట్ జారీ చేయబడింది. PUC సర్టిఫికేట్లు జారీ చేయడానికి పెట్రోల్ బంకర్లలో ఆటోమేటిక్ PUC సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ఈ స్టేషన్లలో వెంటనే వాహనాలను తనిఖీ చేస్తారు. వాహనం నుంచి వెలువడే పొల్యూషన్ పరిమితిని మించి ఉంటే, వారికి PUC సర్టిఫికేట్ జరీ చేయబడదు.

'రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్' ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం: ఇంతకీ ఇదేంటో తెలుసా..!!

రోడ్డు మరియు రవాణా శాఖ ఈ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. వాహనాల PUC ధృవీకరణ కోసం సెంట్రల్ డేటాబేస్‌ను సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. యూనిఫామ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. వాహన డేటాబేస్ నేషనల్ రిజిస్టర్‌కి లింక్ చేయబడింది.

కరోనా మహమ్మారి సమయంలో, RTO ల యొక్క చాలా సర్వీసులు ఆన్‌లైన్‌లో అందించబడ్డాయి. ఇందులో భాగంగానే లర్నింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లైసెన్స్ మరియు రోడ్ టాక్స్ సర్వీస్ వంటివి ఆన్‌లైన్‌లో అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ సమయంలో ఈ ఆన్‌లైన్‌ సర్వీస్ చాలామంది ఉపయోగించుకున్నారు.

Most Read Articles

English summary
Delhi government starts red light on engine off campaign details
Story first published: Tuesday, October 19, 2021, 19:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X