గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?
భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా చాల వేగంగా వ్యాపిస్తోంది. ఈ కరోనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కరోనా లాక్ డౌన్ మరియు నైట్ కర్ఫ్యూ వంటివి విధించడం జరిగింది. కావున ప్రజలు మరియు లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటరావడానికి వీల్లేదు.

అయితే అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావడానికి అవకాశం కల్పించబడింది. ఆ సమయంలో కూడా తప్పనిసరిగా పేస్ మాస్క్ ధరాయించాలి. కరోనా సమయంలో చాలామంది జీవితాలు కష్టాలు పాలయ్యాయి. ఇందులో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్స్ కి ఆర్థిక సహాయం చేయడానికి ఢిల్లీ గవర్నమెంట్ ముందుకు వచ్చింది.

నివేదికల ప్రకారం ఢిల్లీలో మొత్తం 1.56 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉన్నట్లు తెలిసింది. వీరికి వచ్చే రెండు నెలల్లో రిజిస్టర్డ్ ఆటో, టాక్సీ డ్రైవర్లందరికీ రూ. 5000 ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇది ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు చాలా సహాయంగా ఉంటుంది.

భారతదేశంలో కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఢిల్లీ ఒకటి, కావున ఢిల్లీలో గత కొన్ని వారాలుగా కరోనా లాక్ డౌన్ విధించబడింది. అయితే ఈ లాక్ డౌన్ కాస్త ఇప్పుడు అది మే 10 వరకు పొడిగించబడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాబోయే రెండు నెలలు, ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఆర్థిక సహాయం కోసం ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు 5000 రూపాయల సహాయం అందించబోతోంది.

ఇందుకోసమే డ్రైవర్ల సహాయార్థం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5000 రూపాయలకు సహాయం చేయబోతున్నట్లు ప్రకటించారు, ఈ క్లిష్ట సమయంలో వారికి పెద్దగా సహాయపడకపోవచ్చు, అయితే కొంత ఆసరాగా ఉంటుంది. కావున ఢిల్లీలో పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని, లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం మరింత పొడిగించే అవసరం ఉండదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

డ్రైవర్లకు సహాయం చేయడమే కాకుండా ఢిల్లీలో ఉన్న 72 లక్షల రేషన్ కార్డుదారులకు రెండు నెలల పాటు ఉచిత రేషన్ కూడా ఇవ్వబడుతుంది. ఈ క్లిష్ట సమయంలో పేదలకు ఈ సహాయం చాలా ఆసరాగా ఉంటుందని చెప్పారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు కూడా కొంత సహకరించాలి.

ఢిల్లీలోలో ఒక్క ఆదివారం రోజు మాత్రమే 20,394 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ దాదాపు 71,997 కరోనా టెస్ట్ లు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం దేశ రాజధాని ఆసుపత్రులలో భారీ ఆక్సిజన్ కొరత ఉంది. కావున ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. ఏది ఏమైనా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.


Click it and Unblock the Notifications








