కాలుష్యాన్ని ఆపే కొత్త ప్లాన్.. సంచలన నిర్ణయం తీసుకున్న అక్కడి ప్రభుత్వం! గాలి కోసం గట్టిగానే పోరాటం
వాయు కాలుష్యం ఇప్పుడు కేవలం పర్యావరణ సమస్యగా మిగలకుండా, ఎంతోమంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసే తీవ్రమైన సవాలుగా మారింది. ఈ విషయంలో, దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మరింత ఆందోళన కలిగించే స్థితిలో ఉంది. అంతర్జాతీయ వాయు నాణ్యత పరిశోధన సంస్థ అయిన IQAir విడుదల చేసిన 2024 గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం, ఢిల్లీ ప్రపంచంలోని రెండవ అత్యంత కాలుష్య రాజధాని నగరంగా గుర్తించబడింది. మొదటి స్థానంలో ఆఫ్రికన్ దేశమైన చాడ్ రాజధాని N'Djamena ఉంది. ఈ రెండు నగరాల వాయు నాణ్యత స్థాయిలు చరిత్రలోనే అత్యంత ప్రమాదకరంగా నమోదు అయ్యాయి. ఢిల్లీ వార్షికంగా PM2.5 సాంద్రత 90 మైక్రోగ్రాములు క్యూబిక్ మీటరుకు దాటి నమోదవుతుండగా, ఇది WHO సిఫార్సుల కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువగా ఉంది.
దీని ప్రభావం కేవలం వాతావరణంపై కాదు, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. శ్వాస సంబంధిత, గుండె సంబంధిత సమస్యలు, పిల్లలలో అలెర్జీ సమస్యలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని, ఢిల్లీ ప్రభుత్వం ఎట్టకేలకు కీలక చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకంగా ఉన్న పాత పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధానికి సిద్ధమవుతోంది.

ఈ చర్యల్లో భాగంగా, ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 1 నుండి కొత్త చట్టాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా, ఇకపై BS VI ప్రమాణాలకు అనుగుణమైన వాహనాలు, CNG ఆధారిత వాణిజ్య వాహనాలు, లేదా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు అనుమతించబడతాయి. దీనర్థం ఏమిటంటే, BS IV లేదా అంతకంటే పాత డీజిల్, పెట్రోల్ వాణిజ్య వాహనాలు ఇకపై ఢిల్లీలోకి ప్రవేశించలేవు.
ఈ కొత్త చట్టం ప్రైవేట్ వాహనాలకు కాదు, వాణిజ్య వాహనాలకు మాత్రమే. పరిశుభ్రమైన నగర వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ఈ విధానానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను, ప్రజల అవగాహన కోసం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఇవి వాహనదారులపై ఒత్తిడి కలిగించగల నిర్ణయాలు అయినప్పటికీ, ప్రజల ఆరోగ్య భద్రత కోసం, నగర వాతావరణాన్ని రక్షించేందుకు తప్పనిసనరి.

ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముందుగానే ముస్తాబవుతోంది. ఢిల్లీకి ప్రవేశించే అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రవేశ పాయింట్ల వద్ద వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేసే ఆధునిక కెమెరాల వ్యవస్థను, ముఖ్యంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీకగ్నిషన్ (ANPR) టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా, వాహన వివరాలు తక్షణమే గుర్తిస్తారు.
వాయు కాలుష్య నివారణ ప్రణాళిక 2025ను ప్రారంభిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మాట్లాడుతూ, "క్లీన్, గ్రీన్, హెల్తీ ఢిల్లీ" అనే లక్ష్యాన్ని సాధించడం రాష్ట్ర ప్రభుత్వ గొప్ప కలగా మారిందని పేర్కొన్నారు. ఈ దిశగా ముందడుగు వేసేందుకు, ఈ సంవత్సరం వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే ప్రణాళికను రూపొందించామని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేయబోయే చర్యలకు ప్రజల సహకానరం తోడవ్వాలని ఆమె తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








