వాహనదారులకు షాక్: పాత కార్లు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేస్తారు!

వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. ఢిల్లీ NCRలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పెట్రోల్ వాహనాలను మరియు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ వాహనాల వినియోగాన్ని పూర్తిగా నిషేదించింది. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో పార్కింగ్ చేయకూడదని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఢిల్లీ NCR ప్రాంతంలో ఎక్కడైనా పబ్లిక్ ప్రదేశాల్లో 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనం లేదా 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనం కనిపించకూడదు. ఒకవేలా అలాంటి వాహనాలు అధికారులకు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటారు. దీనికి సంబంధించిన నోటీసును ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. తప్పకుండా ప్రజలు ఈ నియమాలను పాటించాలని, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Delhi Govt Will Seize Old Cars

ప్రభుత్వం అందించిన నోటీసులో.. నిషేధించబడిన వాహనాలు వ్యక్తిగత పార్కింగ్ స్థలాలలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. పబ్లిక్ రోడ్డుపై అలాంటి వాహనాలు కనిపిస్తే సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ వయసున్న వాహనాలు 5.5 మిలియన్స్ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ వాహనాల రిజిస్ట్రేషన్ ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది. కాబట్టి ఆ వాహనాలు ప్రజా రహదారుల మీద తిరగకూడదు.

ప్రస్తుతం ఢిల్లీలో ఎక్కువ వయసున్న వాహనాలు కలిగి ఉన్న వాహనదారులు లేదా యజమానులు తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో పార్కింగ్ చేయకూడదు. మీకు సంబంధించిన ఏదైనా ప్రైవేట్ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలి. ఒక వేలా మీకు ప్రైవేట్ స్థలం లభించకపోతే.. మీ కారు కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందేందుకు సంబంధిత అధికారులను సంప్రదించాలి.

Delhi Govt Will Seize Old Cars

వాహనం యొక్క గడువు తేదీ ముగిసిన తర్వాత ఒక సంవత్సరంలోపు NOC జారీ చేస్తారు. కాబట్టి అలాంటి NOC సర్టిఫికెట్ పొందిన తరువాత భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. నిర్ణీత వయసు ముగిసి ఏడాది కంటే ఎక్కువ వయసు ఉంటే.. అలంటి వాహనాలకు NOC జారీ చేసే అవకాశం లేదు. కాబట్టి వాహన వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలి.

NOC లభించని వాహనాలను స్కాపేజ్ లేదా ఏదైనా ఇతర పార్కింగ్ ప్రదేశాల్లో తీసుకెళ్లి వదిలేయసిందే. ఎందుకంటే అలంటి వాహనాలు పబ్లిక్ రోడ్డు మీద తిరగటం నేరం, అలాంటి వాహనాలతో.. వాహన వినియోగదారులు కనిపిస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఢిల్లీ NCR ప్రాంతంలో ఉండే ప్రజలు ఈ నియమాలను తూ చ తప్పకుండా పాటించాలి.

ఢిల్లీ హైకోర్టు రూల్ ప్రకారం 10-15 ఏళ్ళు నిండిన వాహనాలు ప్రజా రహదారులపై తిరగటం నిషిద్ధం. ఈ విషయమై ఢిల్లీ హైకోర్టుకు వేల సంఖ్యలో పిటిషన్లు వచ్చాయి. పిటిషనర్లు 15సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలు మరియు 10సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించిన ఢిల్లీ ప్రభుత్వ విధానాన్ని సవాలు చేసారు. ఈ నిబంధన వారి కార్ల మీద ఉన్న హక్కును ఉల్లంఘిస్తుందని వాదించారు.

ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని సమీక్షించి.. తర్వాత కొత్త నిబంధనను తీసుకువచ్చింది. కొత్త నియమం ప్రకారం, సీజ్ చేయబడిన ఎండ్ ఆఫ్ లైఫ్ కార్లను వాటి యజమానులకు తిరిగి ఇచ్చేయాలి. అయితే ఆ వాహనాలు నగరంలో తిరగటానికి వీలు లేదు. కాబట్టి ఇలాంటి వాహనాలు పబ్లిక్ రోడ్డు మీద కాకుండా ఇంటి ఆవరణ లేదా.. ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ చేసుకోవచ్చు. లేదా అవసరమా డాక్యుమెంట్స్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించుకోవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2024, 12:04 [IST]
English summary
Delhi govt will seize old cars seen in public space check the reason
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+