Just In
- 6 min ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
- 31 min ago
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 2 hrs ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
Don't Miss
- News
లాలూకు భారీ ఊరట- గడ్డి స్కాంలో నాలుగో కేసులో ఎట్టకేలకు బెయిల్..
- Sports
మరో అద్దిరిపోయే రికార్డ్‌కు చేరువలో రోహిత్: ఆ మైల్ స్టోన్‌కు దగ్గరగా: జాయింట్‌గా జాయిన్
- Movies
చావు కబురు చల్లగా.. ఓటీటీలో మరింత కొత్తగా..
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే; 2 గంటల ప్రయాణం 45 నిముషాల్లో పూర్తి
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే ఇటీవల ప్రజల ఉపయోగార్థం ప్రారంభించబడింది. ఈ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానానికి 2018 వ సంవత్సరం మే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పునాదిరాయి వేశారు. అయితే ఎట్టకేలకు ఇది మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తయింది.

ఇటీవల ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన వీడియోను నితిన్ గడ్కరీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించడం వల్ల ఢిల్లీ మరియు మీరట్ మధ్య జరిగే ప్రయాణం 2.5 గంటల నుండి కేవలం 45 నిమిషాలలో పూర్తి చేయాడానికి అనుకూలంగా ఉంటుంది.

సాధారణంగా ఈ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి ముందు ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణ సమయం 2.5 గంటలు పట్టేది. అయితే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రారంభం వల్ల ఆ ప్రయాణం కాస్త కేవలం 45 నిముషాల్లో పూర్తవుతుంది.
MOST READ:2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే పొడవు 82 కి.మీ. వీటిలో 60 కి.మీ ఎక్స్‌ప్రెస్‌వే, 22 కి.మీ జాతీయ రహదారి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 8,346 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో మొత్తం 24 చిన్న, పెద్ద బ్రిడ్జ్ లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 10 ఫ్లైఓవర్లు, 3 రైల్వే బ్రిడ్జ్ లు, 95 అండర్‌పాస్‌లు మరియు పాదచారులకు అనేక ఓవర్‌బ్రిడ్జ్ లు ఉన్నాయి.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే నాలుగు వేర్వేరు దశల్లో నిర్మించబడింది. మొదటి దశ నిజాముద్దీన్ బ్రిడ్జ్ నుండి ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వరకు, రెండవ దశ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు నుండి దాస్నా వరకు, మూడవ దశ దాస్నా నుండి హాపూర్ వరకు, చివరి దశ హపూర్ నుండి మీరట్ వరకు నిర్మించబడింది.
MOST READ:నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలోని వివిధ ప్రాంతాల్లోని వాహనాల గరిష్ట వేగ పరిమితిని గంటకు 80 కిమీ నుండి 100 కిమీ వరకు నిర్ణయించారు. ప్రతి వాహనం యొక్క వేగాన్ని చూపించడానికి ప్రతి 10 కి.మీ.కి డిస్ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేలో సేఫ్టీ కోసం, ఎక్స్‌ప్రెస్‌వే యొక్క నాల్గవ దశలో దాస్నా నుండి మీరట్ వరకు 72 సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణీకుల భద్రత కోసం మొత్తం రహదారిపై 4,500 కి పైగా లైట్స్ మరియు కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.

సైక్లిస్టులు మరియు పాదచారులకు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో వసతి కలిపించడం జరిగింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 2.5 మీటర్ల సైకిల్ కారిడార్ మరియు 1 మరియు 2 వ సందుల వెంట 2 మీటర్ల వెడల్పు గల ఫుట్‌పాత్ ఉన్నాయి. రాత్రి ప్రయాణానికి సౌకర్యంగా ఉండటానికి ఎక్స్‌ప్రెస్‌వేలో కలర్ ఫ్లాష్‌లైట్లు ఏర్పాటుచేయబడ్డాయి.

ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ANPR) తో ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రవేశపెట్టబడింది. ఈ సిస్టం ఎక్స్‌ప్రెస్‌వేలో అధిక వేగ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థకు టోల్ గేట్ వద్ద వాహనాలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు.
MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన ‘గాతిమాన్ ఎక్స్‌ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

పరిసర ప్రాంతాలతో అనుసంధానించడానికి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో అనేక ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్లు అందించబడ్డాయి. ఇవి అక్షర్ ధామ్, దుండహేరా, సారాయ్ ఖేల్ ఖాన్, దాస్నా, ఇంద్రపురం మరియు నోయిడా ప్రాంతాలలో ఉన్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయడానికి ఎక్స్‌ప్రెస్‌వే అంతటా ప్రత్యేక ఇసిబిలు ఏర్పాటు చేయబడతాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోల్ బంకర్లు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఏది ఏమైనా ఈ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది.