ఢిల్లీ పోలీసులకు ఆస్టన్ మార్టిన్ కారా?

Posted By:

పోలీసులు ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లలో పెట్రోలింగ్ చేస్తూ తిరగడం అభివృద్ధి చెందిన దేశాలలో చాలా సహజం. అయితే మన దేశంలో పోలీసులు ఇంకా మారుతీ జిప్సీలు, మహీంద్రా బొలెరోలనే ఉపయోగిస్తున్నారు. కాకపోతే కొన్ని రాష్ట్రాలలోని పోలీసులు మాత్రం ఎకోస్పోర్ట్ మరియు ఎర్టిగాలను వాడుతున్నారు.

అయితే, ఇండియాలో ఎక్కడా చూడని విధంగా ఢిల్లీ పోలీసులు ఆస్టన్ మార్టిన్ కారును పెట్రోలింగ్ కోసం వినియోగిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది.

ఢిల్లీ పోలీసుల వద్ద ఆస్టన్ మార్టిన్ కారు

కొద్ది రోజుల నుండి ఢిల్లీ పోలీస్ అనే స్టిక్కర్ల తో ఉన్న ఆస్టన్ మార్టిన్ కారు ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటో చూసిన ఆటో నిపుణులు మన ఢిల్లీ పోలీసులకు ఇంతటి ఖరీదైన కారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ కారుకు ఢిల్లీ పోలీసులకు ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం రండి.

ఈ కారు నిజంగా ఢిల్లీ పోలీసులదేనా?

ఈ కారు నిజంగా ఢిల్లీ పోలీసులదేనా?

ఢిల్లీ పోలీస్ మరియు డయల్ 100, నీలం మరియు ఎరుపు చారలతో ఉన్న ఈ కారు నిజంగా ఢిల్లీ పోలీసులది కాదు. సుశాంత్ సింగ్ రాజపుత్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెస్ నటిస్తున్న "డ్రైవ్" అనే చిత్రం కోసం సిద్ధం చేసిన కారు అని నిర్మాత కరణ్ జోహార్ వివరించాడు.

"డ్రైవ్" సినిమా చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుశాంత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ మరియు లాంబోర్గిని మర్సియోలాజ్ కలిగి ఉన్న ఫోటో షేర్ చేస్తూ, నవంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.

ఢిల్లీ పోలీసుల వద్ద ఆస్టన్ మార్టిన్ కారు

ఇలాంటి కార్ల తో ఉన్న సినిమాల్లో మంచి యాక్షన్, చేసింగ్ సన్నివేశాలు ఉంటాయనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు. ఆస్టిన్ మార్టిన్ మార్టిన్ ర్యాపిడ్‌తో పాటు, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు బెంట్లీ కార్లను కూడా ఫోటోలలో గమనించవచ్చు.

ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ గురించి...

ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ గురించి...

బ్రిటిష్‌కు చెందిన ఆస్టన్ మార్టిన్ ప్రపంచంలోనే పర్ఫామెన్స్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన కంపెనీ. పై ఫొటోలో ఉన్న ర్యాపిడ్ మోడల్ ఆస్టన్ మార్టిన్ కార్ల యొక్క మొదటి ఫోర్ డోర్ ఫాస్ట్ బ్యాక్ కారు.

ఢిల్లీ పోలీసుల వద్ద ఆస్టన్ మార్టిన్ కారు

ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ స్పోర్ట్స్ కారులో 5.9-లీటర్ల సామర్థ్యం ఉన్న వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 470బిహెచ్ పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దేశీయంగా ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ కార్లు చాలా అరుదుగా ఉన్నాయి అందులో ఇదీ ఒకటి.

ఆస్టన్ మార్టిన్ కారును ఏ దేశ పోలీసులు వాడతారు?

ఆస్టన్ మార్టిన్ కారును ఏ దేశ పోలీసులు వాడతారు?

ఆస్టన్ మార్టిన్ కారును ఎక్కువగా దుబాయ్ పోలీసులు పెట్రోలింగ్‌కు ఉపయోగిస్తారు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. దుబాయ్ పోలీసులు ఆస్టన్ వన్77 అనే మోడల్ కారును ఉపయోగిస్తున్నారు. ఈ ఒక్క కారే కాదండోయ్ దుబాయ్ పోలీసుల దగ్గర బుగట్టి వేరాన్ మరియు నిస్సాన్ GT-R లాంటి ఖరీదైన స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి.

ఈ కారు మీరు కొనవచ్చా?

ఈ కారు మీరు కొనవచ్చా?

మీ దగ్గర 1.35 కోట్లు ఉంటె Big Boyz Toyz వారి నుండి ఈ కారును తప్పకుండా కొనవచ్చు. కాకపోతే, మీరు కొనే కారుకు ఢిల్లీ పోలీస్ అనే స్టిక్కెర్లు మాత్రం ఉండవండోయ్.

English summary
Read In Telugu To Know More Delhi Police Aston Martin Rapide For Bollywood Movie

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark