ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫిక్ పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు మితిమీరిన వేగం. వాహనదారుడు మితిమీరిన వేగంతో ప్రయాణించేటప్పుడు అనుకోని ప్రమాదాలు ఎదురైతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ గవర్నమెంట్ కొత్త రూల్స్ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం పరిమిత వేగంకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనదారులపై చర్యలు తీసుకోబడతాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జూన్ 8 నుండి అమలులోకి తీసుకువచ్చిన కొత్త వేగ పరిమితిని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

కొత్త నిబంధనలను ఉల్లంఘించినందుకు గత వారంలో దాదాపు 48,000 వాహనాలకు జరిమానా విధించారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జూన్ 7 మరియు జూన్ 13 మధ్య 48,412 వాహనాలకు చలాన్లను జారీ చేసినట్లు కూడా తెలిపారు. గత వారం ఢిల్లీలో కొత్త ట్రాఫి రూల్స్ అమలులోకి రావడం వల్ల ఈ విధమైన జరిమానాలు విధించడం ప్రారంభించారు.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు మరియు ఐజిఐ విమానాశ్రయం వంటి ముఖ్యమైన ప్రాంతాల గుండా ప్రయాణించే కార్లు మరియు ద్విచక్ర వాహనాల కోసం నగరంలో అత్యధిక వేగ పరిమితిని 60 నుంచి 70 కిలోమీటర్లుగా నిర్ణయించారు. నివాస ప్రాంతాలు, మార్కెట్లు మరియు సేవా రహదారులలో గరిష్ట వేగ పరిమితిని 30 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

ఇప్పుడు కొత్తగా వాహన వేగ పరిమితులను ఉల్లఘించినట్లయితే వారికి ఈ చలాన్ జారీ చేస్తారు. ఈ ఈ చలాన్ కూడా రెండు పద్ధతుల్లో జారీ చేస్తారు. వాహనం యొక్క ఓవర్‌స్పీడింగ్‌ను గుర్తించడానికి, రోడ్ల పైన ఉన్న స్తంభాలలో స్పీడ్ డిటెక్టర్ కెమెరాలు ఏర్పాటు చేయబడతాయి. ఇది వాహనం యొక్క వేగాన్ని గుర్తించి నిర్ధారిస్తుంది.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

ఇది కాకుండా, ట్రాఫిక్ పోలీసులు ఇంటర్‌సెప్టర్ కెమెరాను ఉపయోగించి కూడా చలాన్ జారీ చేస్తారు. కెమెరా ప్లేస్‌మెంట్ నుండి కొంత దూరంలో ఏర్పాటు చేయబడిన బారికేడ్ల వద్ద ఓవర్‌స్పీడింగ్ వాహనాలు నిలిపివేయబడతాయి. ఆ సమయంలో చలాన్ జారీ చేయడం జరుగుతుంది.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

ఇది వరకు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల వేగ పరిమితి 70 కి.మీ వరకు ఉండేది. కానీ అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఢిల్లీలోని ఏ రహదారిలోనైనా ద్విచక్ర వాహనాలు 60 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడానికి అనుమతి లేదు. అయితే కొన్ని రోడ్లపై కేవలం 50 కిలోమీటర్ల స్పీడ్ నిర్ణయించబడింది.

ఓవర్‌స్పీడ్‌పై విరుచుకుపడుతున్న ట్రాఫి పోలీసులు.. ఒక్క వారంలో 48,000 వాహనాలపై వేటు

2011 తరువాత జాతీయ రాజధాని రోడ్లపై వేగ పరిమితిలో చేసిన పెద్ద సవరణ ఇది. 2017 మరియు 2019 లో కూడా కొన్ని రోడ్లపై వేగ పరిమితిలో స్వల్ప మార్పులు వచ్చాయి. కానీ ఇప్పుడు అమలులోకి వచ్చిన వేగపరిమితి తప్పకుండా పాటించాలి. లేకుంటే పోలీసుల చర్యలకు లోనుకాక తప్పదు.

NOTE:ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Breaking The Speed Limit In Delhi Is Heavy, 48,000 Vehicles Cut Challan In A Week. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X