గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

చైనాలోని వుహాన్ నుండి సంక్రమించిన కరోనా వైరస్ నేడు ప్త్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ కరోనా మహమ్మారి వల్ల అమెరికా ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు లాక్‌డౌన్ అమలు చేశాయి. ఫలితంగా సాధారణ ప్రజల జీవితాలు ఇబ్బందుల్లో మొదలయ్యాయి. భారతదేశంలో 2 వ దశ లాక్‌డౌన్ కూడా మే 3 వరకు పొడిగించబడింది. దీర్ఘకాలిక లాక్‌డౌన్ కారణంగా కార్మికులకు పని లేకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

ఈ నేపథ్యంలో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహాయం చేయడానికి ముందుకువచ్చాయి. లాక్‌డౌన్ ద్వారా ప్రభావితమైన వారిలో ఆటో డ్రైవర్లు ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా భారతదేశంలో దాదాపు అన్ని వాహన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. ఇటీవల కాలంలో ఓలా కంపెనీ తమ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది.

MOST READ:కోవిడ్-19 టెస్ట్ కోసం తిరంగ ప్రాజెక్టును ప్రారంభించిన కేరళ గవర్నమెంట్

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

భారతదేశంలో లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఆటో డ్రైవర్లు ఆదాయం లేకుండా బాధపడుతున్నారు. రోజువారీ ఆదాయాన్ని నమ్ముకున్న ఆటో డ్రైవర్ల జీవితాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దీని ఫలితంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ. 5 వేలు ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కటి 5000 రూపాయలు చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది.

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

దాదాపు 23,000 ఆటో డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలకు ఒక్కొక్కటి రూ. 5 వేల రూపాయలు ప్రత్యక్ష బదిలీ జమ అవుతుంది. ఢిల్లీలోని రవాణా మంత్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. దీని గురించి మాట్లాడుతూ కైలాష్ గెలాడ్‌ మొత్తం 1.60 లక్షల పిటిషన్లు వచ్చాయి. వీరిలో 23,000 ఆటో డ్రైవర్లకు ప్రత్యక్ష బదిలీ పథకం ద్వారా రూ. 5000 చెల్లించారు. తన ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా నంబర్లను తనిఖీ చేసిన తరువాత ఈ ఆర్థిక సహాయం అందుతున్నాడని తెలిపారు.

MOST READ:యమహా లాంచ్ చేయనున్న రెండు కొత్త బైక్స్ : FZ 25 & FZS 25

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆటో డ్రైవర్లను సంతోషపరిచింది. ఈ విషయంపై ఆటో డ్రైవర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ, దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే తన బ్యాంక్ ఖాతా చెల్లించినట్లు చెప్పారు.

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

పెద్ద విషయం ఏమిటంటే లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోలేకపోయారని మరో ఆటో డ్రైవర్ శివకుమార్ తెలిపారు.

MOST READ: త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

ఇది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. కొంతమంది ఆటో డ్రైవర్లకు ప్రయోజనాలను ఎలా పొందాలో తెలియదు. వాటి కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం నుండి రూ. 5000 పొందడం ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు పెద్ద సహాయం చేసినట్లే అవుతుంది.

గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000

ఆటో, బస్సు సర్వీసులతో పాటు రైలు, విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అదనంగా, కార్లు మరియు బైక్‌లు రోడ్డుపై తిరగటానికి అవకాశం లేదు. దీంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది.

MOST READ: త్వరలో లాంచ్ కానున్న బిఎస్ 6 సుజుకి వి-స్ట్రోమ్ 650 XT బైక్, ఇదే

Most Read Articles

English summary
Rs.5000 transferred into 23000 auto rickshaw drivers bank accounts. Read in Telugu.
Story first published: Tuesday, April 21, 2020, 19:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X