బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

సముద్రం ఒడ్డున కారు నడపాలనే ఇద్దరు యువకుల అత్యుత్సాహం చివరకు వారిని చిక్కుల్లో పడేలా చేసింది. ఢిల్లీ నుండి గోవాకు వచ్చిన ఇద్దరు పర్యాటకులు, బీచ్ లో సరాదాగా జాయ్‌రైడ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వారు డ్రైవ్ చేస్తున్న హ్యుందాయ్ క్రెటా గోవాలోని వాగేటర్ బీచ్ వద్ద సముద్రంలో మునుగుతూ కనిపించింది. వారి అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి కారణమని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో స్పష్టం చేస్తోంది.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడం మరియు వర్షాకాలం ప్రారంభం కావడంతో, పర్యాటక ప్రదేశమైన గోవా బీచ్‌లలో రద్దీ చాలా తక్కువగా ఉంటోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అక్కడి వెదర్ ను మరియు ఖాలీ బీచ్ లను ఎంజాయ్ చేసేందుకు ఢిల్లీ నుండి ఇద్దరు పర్యాటకులు వచ్చారు. వీరిద్దరూ అక్కడ తిరిగేందుకు ఓ హ్యుందాయ్ క్రెటా కారును అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత క్రెటా కారులో వాగేటర్ బీచ్‌కి చేరుకున్నారు. బీచ్ లో జనాల తాకిడి తక్కువగా ఉండటంతో ఇసుకపై క్రెటాలో చక్కర్లు కొట్టారు.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

ఆన్‌లైన్‌లో వచ్చిన వీడియో ప్రకారం, వీరిద్దరూ సరదాగా బీచ్ లో కారు నడుపుతున్నట్లు కనిపించారు. ఆ తర్వాత కొంత సమయానికి హ్యుందాయ్ క్రెటా కారు బీచ్ లోని కొండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయినట్లు కనిపించింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరకీ గాయాలు కాలేదు. అయితే, హ్యుందాయ్ క్రెటా మాత్రం ముందు ఇంజన్ భాగం వరకూ ఇసుకలో కూరుకుపోయింది. క్రెటాకి ముందు భాగంలో రాళ్లు అడ్డుగా ఉండటంతో కారు సముద్రంలో పూర్తిగా కొట్టుకుపోకుండా ఒడ్డునే నిలిచిపోయింది.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

సముద్రపు ఒడ్డును ఇసుక మేటలో ఇరుక్కుపోయిన హ్యుందాయ్ క్రెటాను వెలికితీసేందుకు వారు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ రాత్రంతా క్రెటా కారు సముద్రంలో ఉండిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. వాగేటర్ బీచ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు గోవా పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు క్రేన్ సాయంతో హ్యుందాయ్ క్రెటాను బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు మరియు ఈ కారులో ఇలాంటి చర్యలకు పాల్పడిన డ్రైవర్‌ను లలిత్ కుమార్ దయాల్‌గా పోలీసులు గుర్తించారు.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

ఓ ఆంగ్ల వార్తా సంస్థ ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (బహిరంగ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్) మరియు 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం) కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి క్రెటా యాజమాన్యానికి వ్యతిరేకంగా పోలీసులు స్థానిక ఆర్టీఓకు నివేదిక కూడా సమర్పించారు. ఈ ఘటనకు పాల్పడిన వారు దొరికితే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏదైమనప్పటికీ, ఈ ఘటనలో తీవ్రంగా నష్టపోయింది మాత్రం హ్యుందాయ్ క్రెటానే చెప్పాలి.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

హ్యుందాయ్ క్రెటా ఇంజన్ భాగం ఎక్కువ సమయం ఉప్పు నీటిలో ఉండిపోయిన కారణంగా, ఇంజన్ లోకి నీరు చేరి ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, కారు బాడీ ప్యానెల్స్ కూడా ఉప్పు నీటిలో ఎక్కువ సమయం ఉన్న కారణంగా అవి త్వరగా తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ కారు ఇప్పుడు టోటల్ లాస్ అయినట్లే. ఈ వీడియోలో కనిపించే ఎస్‌యూవీ ప్రస్తుత తరం హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

వాగేటర్ బీచ్‌లో హ్యుందాయ్ క్రెటాతో జరిగిన ఈ సంఘటన సదరు డ్రైవర్ యొక్క మితిమీరిన విశ్వాసానికి మరియు సరిపోలని ప్రతిభకు నిదర్శనంగా ఉంటుంది. ఈ సంఘటను చూసి తర్వాతనైనా ఇతరులకు ఇలాంటి వెర్రి ఆలోచలను ఉంటే వాటిని తమ మదిలో నుంచి తొలగించుకోవడం మంచిది. ఇలాంటి సంఘటన మరియు ఈ విషయంలో పోలీసుల ప్రతిస్పందన కారణంగా, భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి దృశ్యాలు పునరావృతం కాకుండా ఉండేలా చూస్తాయని ఆశిస్తున్నాము.

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Creta Knight Edition) విడుదల..

ఇదిలా ఉంటే, కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai), తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా (Creta) లో ఇటీవలే కంపెనీ ఓ కొత్త నైట్ ఎడిషన్ (Knight Edition) ను విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరలు రూ.13.51 లక్షల నుండి రూ.18.18 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

బీచ్‌లో యువకుల అత్యుత్సాహం... సముద్రంలో కొట్టుపోయిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ!

క్రెటా నైట్ ఎడిషన్ పేరుకు తగినట్లుగానే ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో బ్లాక్ కలర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ నైట్ ఎడిషన్ క్రెటాలో లభించే ఎక్స్టీరియర్లలో ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ పై బ్లాక్ గ్లోస్ మరియు రెడ్ కలర్ ఇన్సర్ట్‌లు, బ్లాక్ గ్లోస్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌లో భాగంగా, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లు, లైట్నింగ్ ఆర్చ్ సి-పిల్లర్ గార్నిష్, సైడ్ సిల్ గార్నిష్, రూఫ్ రెయిల్స్, సైడ్ మిర్రర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ లాంప్ ఇన్సర్ట్‌లు అన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
Delhi tourists drowns hyundai creta at goa beach car siezed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X