రూ.5000 జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీస్‌ను సస్పెండ్‌ చేసిన అధికారులు.. ఎందుకంటే?

పబ్లిక్‌ రోడ్లపై ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయడం, వాహనాన్ని అతి వేగంగా డ్రైవింగ్‌ చేయడం సహా మరికొన్నింటిని ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. ఢిల్లీలో ఓ కొరియన్‌ వ్లాగర్‌కు ట్రాఫిక్‌ పోలీస్‌ జరిమానా విధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాంతంలో కొరియన్ వ్లాగర్‌ తన కారులో కూర్చుని ఉంటారు. అదే సమయంలో ట్రాఫిక్‌ పోలీస్‌ మహేశ్‌ చంద్‌ అతని వద్దకు వచ్చి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించలేదని, రూ.5000 జరిమానా చెల్లించాలని సూచిస్తారు. దీంతో ఆ కొరియల్‌ వ్లాగర్ తన వ్యాలెట్‌ తీసి 5000 రూపాయలు చెల్లిస్తాడు. అనంతరం వ్యాలెట్‌ మొత్తం ఖాళీ అయిపోయిందని తన పక్కనున్న వారికి చెప్తాడు.

traffic constable suspended who imposed fine on Korean vlogger

ఆ మాటను విన్న ట్రాఫిక్ పోలీస్‌ మహేశ్‌ చంద్‌ తాను తీసుకున్న 5000 రూపాయల నుంచి రూ.500 రూపాయలు వెనక్కి ఇస్తాడు. అయితే తీసుకున్న జరిమానాకు రసీదు ఇవ్వకుండా వెళ్లిపోతారు. ఈ ఘటన అంతా కారులోని డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డు అవుతుంది. ఈ ఘటన నెల రోజుల కిందట జరిగినట్లు తెలుస్తోంది. గత వారం వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దీంతోపాటు ఓ వ్యక్తి ట్విట్టర్‌ ద్వారా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు సహా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి కూడా ట్యాగ్‌ చేశారు. దీంతో ఈ ఘటనపై ఉన్నత అధికారులు దృష్టిసారించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. జరిమానా నగదు తీసుకొని, రసీదు ఇవ్వని ట్రాఫిక్‌ పోలీస్‌ను సస్పెండ్‌ చేశారు.

traffic constable suspended who imposed fine on Korean vlogger

ట్రాఫిక్ పోలీస్‌ మహేశ్‌ చంద్‌ను సస్పెండ్‌ చేసినట్లు డిల్లీ ట్రాఫిక్ పోలీస్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని తెలిపారు. అయితే ఈ తాను రసీదు ఇచ్చే సమయానికి కొరియన్‌ వ్లాగర్‌ వెళ్లిపోయాడని సస్పెండ్‌ అయిన పోలీస్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే భారత్‌లో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. గత వారం ఇటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌.. స్కూటర్‌ నడుపుతున్న ఇద్దరు మహిళలతో ఏదో మాట్లాడారు. తన దగ్గరకు రమ్మని సైగ చేశారు. అనంతరం మహిళా కానిస్టేబుల్‌ ప్యాంట్‌ వెనుక జేబులో ఓ మహిళ నగదు పెట్టడం వీడియోలో రికార్డు అయింది.

చాలా చోట్ల ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న పోలీసులపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. రసీదులు ఇవ్వడం లేదని, లేదా బెదిరింపులకు దిగుతున్నారన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అయితే ఉన్నత అధికారుల దృష్టికి వచ్చిన ఘటనలపై మాత్రమే విచారణ జరిగి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరాల్లో ఆన్‌లైన్‌ చలానాల వల్ల నేరుగా జరిమానా విధించే పద్ధతి చాలా వరకు మారింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 25, 2023, 18:48 [IST]
English summary
Delhi traffic constable suspended who imposed fine on korean vlogger without providing receipt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+