ఇకపై మీరే ట్రాఫిక్‌ పోలీస్‌.. ఫోటోలు, వీడియోలు తీసి పంపితే రూ. 50 వేల రివార్డు మీ సొంతం!

దేశంలో రోజురోజుకు రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లే ట్రాఫిక్‌ ఉల్లంఘనలు కూడా అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అలాగే కొత్త రూల్స్‌ని అమలు చేసేందుకు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి పోలీసు శాఖ తన వంతుగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అయితే వాటి వల్ల పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సీసీటీవీ, వైరల్ వీడియోల ఆధారంగా ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీటిని తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు తమ ప్రత్యేక యాప్‌ని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా తోటి వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే కంప్లైంట్‌ చేయవచ్చు. దీనికి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ప్రహరీ అనే పేరుతో యాప్‌ని లాంచ్ చేయబోతున్నారు.

hi traffic police Prahari app Citizens Complaint App

ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ యాప్‌ని ప్రవేశ పెట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసిన సిటిజెన్స్‌ని రివార్డులు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన వారికి రూ.10 నుంచి రూ.50 వేల వరకు రివార్డు ఇస్తారు.

ఇది వరకే అందుబాటులో ఉన్న ట్రాఫిక్‌ సెంటినల్‌ మొబైల్ యాప్‌ని అప్‌డేట్‌ చేసి దీనిని సరికొత్తగా ప్రవేశపెట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇటీవల ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. దీని ఆధారంగా సెప్టెంబర్ 1 నుంచి ట్రాఫిక్‌ ప్రహరీ యాప్‌ని పోలీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిలో ఎక్కువగా ఫిర్యాదులు అందించే వ్యక్తికి రివార్డు లభిస్తుందని తెలుస్తోంది.

Prahari App in Delhi

ఈ రివార్డులను నాలుగు కేటగిరీల కింద అందజేయనున్నారు. అత్యధిక ఫిర్యాదులు చేసి మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 50 వేలు రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 25 వేలు, ఆ తర్వాత 3,4 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.15 వేలు, రూ. 10 వేలు ఇవ్వనున్నారు. ఇలా రివార్డులు అందించడం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు అరికట్ట వేయండ వల్ల ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని యోచిస్తున్నారు. భారతదేశంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో ఢిల్లీ ఒకటిగా ఉంది. ఈ కొత్త చర్య ఢిల్లీని ఉల్లంఘనలు జరగకుండా కాపాడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ యాప్‌లో మెంబర్‌షిప్‌ పొందడం చాలా సులభంగా ఉంటుంది. వినియోగదారులు ముందుగా తమ మొబైల్ ఫోన్లలో ట్రాఫిక్ ప్రహరీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Delhi Traffic Rules

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ట్రాఫిక్ ఉల్లంఘన సంఘటనలను ఫోటో లేదా వీడియో ఫ్రూఫ్‌ని అప్‌లోడ్ చేయడం ద్వారా కంప్లైట్‌ చేయవచ్చు. ఇక ఫిర్యాదులను నమోదు చేసేటప్పుడు తేదీ, సమయం, స్థలం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను కూడా అందించాలి. చిన్న పొరపాటు జరిగినా పోలీసులు ఫిర్యాదును తిరస్కరిస్తారు.

డ్రైవ్స్‌పార్క్ ఒపీనియన్: ప్రజలు సరైన సమాచారాన్ని నమోదు చేసి సరిగ్గా రిపోర్ట్ చేయడం ద్వారా మెరుగైన అవుట్‌పుట్‌ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య తగ్గనుంది. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ భద్రతపై పోలీసులు అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది విజయవంతంగా అమలైతే ఇతర రాష్ట్రాలు కూడా దీనిని ఫాలో కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, September 1, 2024, 7:20 [IST]
English summary
Delhi traffic police prahari app allows citizens over traffic violations
Read more on: #india #traffic rules
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+