అటువంటి వాహనాలను రోడ్ల పక్కన పార్క్ చేశారా.. మీకు చెప్పకుండానే అధికారులు తీసుకెళ్లిపోవచ్చు..!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కీలక ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్) పరిధిలోని రోడ్లపై 15 సంవత్సరాల కంటే పాతబడిన పెట్రోల్ కార్లు మరియు 10 సంవత్సరాల కంటే పాతబడిన డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధం విధించింది. దీని ప్రకారం అటువంటి వాహనాలను స్క్రాప్‌కు పంపే అధికారం ఢిల్లీ రవాణాశాఖ అధికారులకు కల్పించింది.
అయితే ఈ ఆదేశాలతో చాలా మంది కార్ల యాజమానులు తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాల ప్రకారం రాజకీయ విశ్లేషకుడు అయిన తహసీన్ పూనావల్లా హోండా CR-V కారును అధికారులు స్ర్కాపింగ్ తీసుకెళ్తుండగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పూనావాలా హోండా SUVని స్క్రాపింగ్ సెంటర్‌కు పంపించేందుకు ప్రయత్నం చేశారు. మరియు 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పూనావాలాకు చూపించారు. కారును తాను ఉపయోగించడం లేదని, వాహనం బ్యాటరీని కూడా తీసివేసి, తన ఇంటి ఆవరణలో పార్క్ చేసినట్లు చెప్పారు.
సెంటిమెంట్ కారణంగా ఆ కారును విక్రయించడం లేదని, తన కుటుంబానికి అత్యంత ఇష్టమైన పెంపుడు కుక్క ఆ హోండా CR-V SUVలో మరణించిందని, మరియు తన కుటుంబ సభ్యులకు ఆ కారుతో ఉన్న అనుబంధం కారణంగా కారును జాగ్రత్తగా కాపాడుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై తనకు అవగాహన ఉందని తెలిపారు.
అయినా గానీ తన ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారు అద్దాలను పగలకొట్టి ఎందుకు తీసుకెళ్తున్నారంటూ.. అధికారులను పూనావాలా ప్రశ్నించారు. సదరు వీడియోలను పూనావాలా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే హోండా CR-V కారు పూనావాలా చెప్పినట్లుగా తన ఇంటి ఆవరణలో కాకుండా కార్యాలయం బయట పార్క్ చేసి ఉండడం గమనార్హం.
NGT ఆదేశాలతో అలాంటి వాహనాలను స్క్రాపింగ్‌కు పంపే అధికారం ఢిల్లీ రవాణా శాఖ అధికారులకు ఉంది. ఏప్రిల్ 2023 నుంచి ఢిల్లీ రవాణాశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు.. కాలనీలు, మార్కెట్, వివిధ సొసైటిల్లో పార్క్‌చేసిన కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్‌కు పంపేందుకు వీలుగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇంటి బయట లేదా రోడ్ల పక్కన పార్క్‌చేసిన ఇటువంటి వాహనాలను స్క్రాపింగ్ పంపే అధికారం ఢిల్లీ రవాణాశాఖ అధికారులకు ఉంది.
అయితే భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో ఢిల్లీ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. గతంలో ఒకటి రెండు సార్లు సరి బేసి విధానాన్ని అమలు చేసింది. దీపావళి పండుగ సమయాల్లో టాపాసులు కాల్చకుండా కఠిన నిబంధనలు అమలుచేస్తుంది. అయినా గానీ ఢిల్లీలో గాలి నాణ్యత రేటు తక్కువగా నమోదు అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








