లాక్‌డౌన్‌కు స్వస్తి పలికిన ఢిల్లీ ప్రభుత్వం; ఈ సర్వీసులన్నీ అందుబాటులోకి వచ్చేశాయ్

భారతదేశంలో కరోనా వైరస్ చాలా తీవ్రంగా వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ఈ మహమ్మారి నివారణలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొంతవరకు తగ్గుముఖం పట్టించి. ఈ కారణంగా మనదేశ రాజధాని నగరం ఢిల్లీలో కొన్ని ఆంక్షలతో కరోనా లాక్ డౌన్ సడలించడం జరిగింది.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల 2021 జూన్ 14 అనగా ఈ రోజు నుంచి (సోమవారం) ఢిల్లీలో కరోనా లాక్ డౌన్ ఎక్కువ భాగం సడలించారు. అయితే ఈ సమయంలో ప్రజలు తప్పకుండా కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సడలింపుతో మార్కెట్లు మరియు ఆఫీసులు మళ్ళీ ప్రారంభించబడ్డాయి. అంతే కాకుండా మెట్రో సర్వీస్, క్యాబ్‌లు మరియు ఆటోలు వంటి ప్రజా రవాణా కూడా సడలించబడింది. అయితే ఇందులో ప్రయాణించే ప్రజలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఢిల్లీలో గత వారం మెట్రో మరియు బస్సులను 50 శాతం సామర్థ్యంతో నడపడానికి అనుమతించారు. ప్రయాణీకులు ఈ వాహనాలలో ప్రయాణించేటప్పుడు ఒక సీటు వదిలి ఇంకో సీటులో కూర్చోవాల్సి ఉంటుంది. అయితే ప్రయాణ సమయంలో నిలబడి ప్రయాణించడానికి అనుమతించబడదు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఇది మాత్రమే కాకుండా ఆటో, క్యాబ్, ఇ-రిక్షాల్లో కూడా ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే అనుమతించబడుతుంది. ఇద్దరు ప్రయాణికులకంటే ఎక్కువమంది ప్రయాణించడానికి అనుమతించబడదు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఢిల్లీలో కరోనా లాక్ డౌన్ సడలించినప్పటికీ ఇతర రాష్ట్రాల్లోకి ప్రయాణించటానికి ఎటువంటి పరిమితి లేదు. అటువంటి పరిస్థితిలో ఢిల్లీ నివాసులు ప్రక్కనే ఉన్న నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ మరియు ఇతర ఎన్‌సిఆర్ నగరాలకు వెళ్ళడానికి ఎటువంటి అనుమతి గాని పాస్ గాని అవసరం లేదు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఇంతకుముందు మార్కెట్లు మరియు మాల్స్ సరి మరియు బేసి పద్దతిలో ఓపెన్ చేయడానికి అనుమతించబడ్డాయి. కానీ ఇప్పుడు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరవడానికి అనుమతించారు. అదే సమయంలో, రేషన్, పాలు మొదలైన ముఖ్యమైన వస్తువులతో కూడిన దుకాణాలను రాత్రి 8 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచవచ్చు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఇవి మాత్రమే కాకుండా 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్ వంటివి కూడా ప్రారంభించబడ్డాయి. ఇదే సమయంలో కరోనా నియంత్రణలో భాగంగా అన్ని భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ విధానం 2021 జూన్ 20 వరకు ట్రయల్ ప్రాతిపదికన నడుస్తుంది, నిబంధనలు పాటించకపోతే, లేకుంటే కేసులు పెరిగితే, మార్కెట్లు, మాల్స్, రెస్టారెంట్లు మళ్లీ మూసివేయబడతాయి.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఇప్పుడు కూడా బార్లు మరియు పబ్బులకు అనుమతి లేదు, దీనితో పాటు రెస్టారెంట్లలో మద్యం అందించబడదు. సినిమా హాళ్లు, పార్కులు మరియు ఉద్యానవనాలు కూడా తెరవడానికి అనుమతించబడలేదు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వస్తి; ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్వీసులు ఇవే

ఢిల్లీలో ఆఫీసులు 9 నుండి 5 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతించినప్పటికీ 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరవవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రజారోగ్యంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. ఢిల్లీలో ఆదివారం 255 కొత్త కేసులు నమోదుచేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే నగరంలో పాజిటివిటీ రేటు 0.35 శాతానికి పెరిగింది. దీన్ని బట్టి చూస్తే కేసుల సంఖ్య దాదాపు తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Delhi Unlock What Will Be Open New Guideline. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X