అమెరికన్ బ్రాండ్ కారులో ఢిల్లీ వడ పావ్ గర్ల్ - కారు ధర తెలిస్తే షాకవుతారు!
వడ పావ్ అనగానే రోడ్డు పక్కన లేదా ఓ చిన్న షాపులో విక్రయించేదిని అందరికి తెలుసు. కానీ ఢిల్లీకి చెందిన ఓ మహిళ రూ. 70 లక్షల ఫోర్డ్ కారులో వడ పావ్ విక్రయించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ విక్రయిస్తూ కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఢిల్లీ వడ పావ్ గర్ల్ విక్రయించే ఢిల్లీ మహిళ 'చంద్రికా దీక్షిత్' ట్రెండింగ్‌లో ఉన్నారు. ఈమెకు ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను కలిగి ఉంది. ఇక్కడ రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది.

కేవలం వడ పావ్ విక్రయిస్తూ ఎంతోమందిని ఆకర్షిస్తోంది. ఇటీవల సోషమ్ మీడియాలో వైరల్ అయినా వీడియోలో చంద్రికా దీక్షిత్ అమెరికన్ బ్రాండ్ కారు అయిన 'ఫోర్డ్ మస్టాంగ్'లో వడ పావ్ విక్రయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో చంద్రికా దీక్షిత్ కారు బూట్‌లో ఉండటం చూడవచ్చు. అప్పుడు ఆమె చేతిలో వడ పావ్ బ్రెడ్ ఉండటం గమనించవచ్చు.
వీడియో ప్రారంభంలో ఫోర్డ్ మస్టాంగ్ కారు కనిపిస్తుంది. కొంత సేపటి తరువాత ఒక వ్యక్తి కారు బూట్ ఓపెన్ చేయడం చూడవచ్చు. ఆ తరువాత దీక్షిత్ ఒక ప్లేటులో వడ పావ్ బ్రెడ్ పట్టుకుని కనిపిస్తుంది. చివరికి ఈమె కారులో కూర్చుని.. డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇందులో ఖరీదైన ఫోర్డ్ మస్టాంగ్ కారును చూడవచ్చు. దీని ధర దేశీయ మార్కెట్లో ఏకంగా రూ. 70 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
ముందు వడ పావ్ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని పోలీసులు పేర్కొన్నారు. చంద్రికా దీక్షిత్ యొక్క ఔటర్ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఫుడ్ స్టాల్ వద్ద ఎక్కువ జనాభా గుమికూడటం వల్ల భారీ ట్రాఫిక్ ఏర్పడుతోందని కూడా తెలిసింది. ఈ ట్రాఫిక్ అంతరాయాలు తొలగించడానికి పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు సమాచారం.
ఫోర్డ్ మస్టాంగ్: భారతదేశంలోని ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి ఫోర్డ్ కంపెనీకి చెందిన మస్టాంగ్. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఖరీదైన కారును ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. ఇందులో రోహిత్ శెట్టి, కరుణ నాయర్, సైఫ్ అలీ ఖాన్, అంబటి రాయుడు, హీరో ధనుష్, అనిరుద్ రవిచందర్ మరియు కాళిదాస్ జయరామ్ మొదలైనవారు ఉన్నారు.
గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలలో కొందరు ఖరీదైన ఆడి కారులో చాయ్ అమ్మడం, కరోనా సమయంలో టయోటా కారులో కూరగాయలు అమ్మారు. కాగా ఇప్పుడు వడ పావ్ మహిళ ఏకంగా ఫోర్డ్ కారులో కనిపించింది. అయితే ఈమె వడ పాప్ తన షాపులో విక్రయిస్తుంది. బహుశా సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఈ కారులో వడ పావ్ ప్లేటుతో కనిపించింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








