మరింత అందంగా మారిన మహీంద్రా థార్!.. లక్షలు ఖర్చు పెట్టిన బ్యూటీ

ఆధునిక కాలంలో మోడిఫైడ్ వాహనాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మోడిఫైడ్ కార్లు, చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా అలాంటి ఘటన గురించి తెలుసుకోబోతున్నాయి. అయితే ఇక్కడ అల్లాయ్ వీల్స్ కోసమే ఏకంగా రూ. 2.2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన మహీంద్రా థార్ కారుకు.. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు.. వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

2020లో మహీంద్రా కంపెనీ తన థార్ SUVని లాంచ్ చేసినప్పటి నుంచి, ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలతో దూసుకెళుతోంది. మహీంద్రా థార్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికి కూడా చాలా ఉందని కంపెనీ నివేదికలు చెబుతున్నాయి. థార్ ఎక్కువగా అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం మంచి డిజైన్, ఫీచర్స్ లభిస్తాయనే కాదు.. మోడిఫైడ్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, కాబట్టి ఎక్కువమంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

Woman Customised Thar SUV With 22 Inch Alloy Wheel

ఇక మోడిఫైడ్ మహీంద్రా థార్ విషయానికి వస్తే.. వీడియోలో థార్ యజమాని అయిన మహిళ.. తన కారు గురించి వివరిస్తూ.. తనకు మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ అంటే ఇష్టమని పేర్కొంది. మహీంద్రా థార్ SUV కొనుగోలు చేయడానికి ముందు.. రెండు సంవత్సరాల క్రితం తన స్నేహితుని మహీంద్రా థార్ డ్రైవ్ చేసింది. ఆ సమయంలో ఆమెను థార్ ఎంతగానో ఆకట్టుకుంది. అప్పుడే థార్ కొనాలని నిర్చయించుకున్నట్లు సమాచారం.

ఢిల్లీ మహిళకు చెందిన మహీంద్రా థార్ 7 స్లాట్ గ్రిల్‌తో అప్‌డేట్ చేయబడింది. హెడ్‌లైట్‌లు ఆఫ్టర్‌మార్కెట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ముందు బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ వంటివి అలాగే ఉంచబడ్డాయి, ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. రూఫ్ లైట్లు కూడా ఇందులో గమనించవచ్చు. ఫాగ్‌ల్యాంప్‌ల లైట్లను ఎల్‌ఈడీలుగా మార్చినట్లు సమాచారం. మొత్తం మీద చూడటానికి సాధారణ మహీంద్రా థార్ మాదిరిగానే ఉందని తెలుస్తోంది.

Woman Customised Thar SUV With 22 Inch Alloy Wheel

ఇక 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ విషయానికి వస్తే.. థార్ కొనుగోలు చేసినప్పుడు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో వచ్చింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చూసి 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను ఇష్టపడింది. ఇలాంటి అల్లాయ్ వీల్స్ తన థార్ SUVకి అమర్చుకోవాలని అనుకుంది. ఆ తరువాత వీటిని పంజాబ్ నుంచి దిగుమతి థార్ కారుకు అమర్చుకుంది. దీనికోసం ఆ మహిళ రూ. 2.2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

కారు విండ్‌షీల్డ్‌లన్నీ నలుపు రంగులో ఉన్నాయి. వేడి మరియు సెక్యూరిటీ కారణాల వల్ల తాను కిటికీలను లేతరంగులోకి మార్చుకున్నట్లు ఆ మహిళ పేర్కొంది. కారు సైడ్ ప్రొఫైల్‌లో ఇతర మార్పులు చేయబడలేదు. వెనుక ప్రొఫైల్‌లో, టెయిల్‌లైట్‌లు ఆఫ్టర్‌మార్కెట్ లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయబడినట్లు తెలుస్తోంది. కారు క్యాబిన్‌లో కూడా చాలా మార్పులు జరిగినట్లు సమాచారం. ఈ వీడియోలో క్యాబిన్‌లో జరిగిన మార్పులను చూడవచ్చు.

క్యాబిన్‌లో గుర్తించదగిన మార్పులలో ఏసీ వెంట్‌లు మరియు యాక్టివ్ యాంబియంట్ లైటింగ్ చూడవచ్చు. థార్ SUV ధరతో పాటు.. మోడిఫైడ్ చేయడానికి అయిన ఖర్చు మొత్తం రూ. 22 లక్షలు అని తెలుస్తోంది. అల్లాయ్ వీల్స్ కొంత పెద్దదిగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో ఈ కారును డ్రైవ్ చేయడం కొంత కష్టమని ఆమె వివరించారు. ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 5, 2024, 9:10 [IST]
English summary
Delhi woman customised thar suv with 22 inch alloy wheels
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+