అర్ధరాత్రి సమయంలో బైక్‌కు నిప్పంటించిన మహిళ.. వీడియో వైరల్‌

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఘటన జరిగింది. ఓ మహిళ.. పార్కింగ్‌ ప్రాంతంలో ఉన్న బైక్ నుంచి పెట్రోల్‌ తీసి అదే బైక్‌కు నిప్పు పెట్టింది. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతోంది.

సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీలోని జైత్‌పూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 02:45 గంటల సమయంలో పార్కింగ్‌ ప్రాంతానికి ఓ మహిళ వచ్చింది. అక్కడ పార్కింగ్‌లో ఉన్న వాహనాల దగ్గరికి వెళ్లింది. బైక్‌ వద్దకు వెళ్లి ట్యాంక్‌ నుంచి పెట్రోల్‌ లీక్‌ చేసింది. అనంతరం తన వద్దనున్న అగ్గిపెట్టెతో బైక్‌కు నిప్పు పెట్టింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Delhi women sets parking bike on fire

అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీన్ని మనం వీడియోలో గమనించవచ్చు. అయితే అదే మహిళ మరో వాహనానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు, గమనించిన స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఎక్కడైనా పార్కింగ్ చేసిన బైక్‌ నుంచి పెట్రోల్‌ తీసివేయడం చాలా సులభం. ఎలక్ట్రానిక్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ సిస్టమ్‌కు బదులుగా కార్బ్యోరేటర్‌ ఉన్న బైక్‌ నుంచి పెట్రోల్‌ లీక్‌ చేయవచ్చు. కార్బ్యోరేటర్‌ నుంచి బయటకు వచ్చే ఫీడర్‌ పైపును తొలగించడం ద్వారా పెట్రోల్‌ బయటకు తీయవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ కూడా ఇదే విధంగా పెట్రోల్‌ను లీక్‌ చేసి ఉండవచ్చు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అయితే సదరు మహిళ బైక్‌కు ఎందుకు నిప్పుపెట్టిందో ఇప్పటికి తెలియలేదని సమాచారం. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ ప్రతికారం తీర్చుకొనేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారా.. లేదా ఏదైనా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతుందా అనేది కూడా తెలియలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనలో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. 2022 సంవత్సరంలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ డెలివరీ ఏజెంట్‌ తన బైక్‌కు తానే నిప్పు అంటించాడు. ఇటీవల ఢిల్లీ పోలీసులు 23 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మల్టీలెవల్‌ పార్కింగ్‌లో ఉన్న మారుతీ సుజుకి Ertiga కారును ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటించాడంటూ అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో మంటలు వ్యాపించి ఆ పార్కింగ్‌లో ఉన్న సుమారు 20 కార్లు కాలిపోయాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 13, 2023, 12:55 [IST]
English summary
Delhi women sets parking bike on fire video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+