బైకుపై స్పైడర్ మ్యాన్ జంట విన్యాసాలు.. చివరకు ఏం జరిగిందో తెలుసా?

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి యువత కొన్నిసార్లు పెడదోవ పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

స్పైడర్‌ మ్యాన్‌, స్పైడర్‌ ఉమెన్‌ కాస్ట్యూమ్స్‌ ధరించిన ఓ జంట బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలిసింది. ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఢిల్లీ పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు పాల్పడిన వారు 20 ఏళ్ల ఆదిత్య మరియు 19 ఏళ్ల అంజలి అని తెలుస్తోంది.

Delhi s Spiderman Couple Bike Stunt

వీడియోలో గమనించినట్లయితే.. అంజలి స్పైడర్‌ ఉమెన్‌ డ్రెస్ ధరించింది. అప్పటికే రోడ్డుపై బైకుపై వెయిట్ చేస్తున్న ఆదిత్య వద్దకు వెళ్లి బైకుపై కూర్చుంది. ఆ తరువాత వారు రైడింగ్ ప్రారంభించారు. వీరు ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను 'స్పైడర్‌మ్యాన్ ఇన్ నజాఫ్‌గఢ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది అతి తక్కువ కాలంలోనే బాగా వైరల్ అయింది.

స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకున్న యువతి, యువకులు రైడ్ చేసే బైక్‌పై నెంబర్ ప్లేట్ లేకపోవడం వీడియోలో చూడవచ్చు. అంతే కాకుండా వారు బైక్ రైడ్ చేసే సమయంలో హెల్మెట్ కూడా ధరించకపోవడాన్ని చూడవచ్చు. బైక్ రైడ్ చేస్తున్న వ్యక్తి మధ్యలో చేతులు వదిలేసి రైడ్ చేయడం వంటి దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. అంతే కాకుండా వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తెలుస్తోంది.

Delhi s Spiderman Couple Bike Stunt

హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేయడం, మిర్రర్ లేకపోవడం, లైసెన్స్ వంటివి లేని నేరాలకు మోటార్ వెహికల్ యాక్ట్ కింద వివిధ సెక్షన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు నెంబర్ ప్లేట్ పెట్టకపోవడానికి సంబంధించిన కారణాల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటానికి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పైడర్‌ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి వీరు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ స్పైడర్‌ మ్యాన్ జంట గురువారం ఢిల్లీలో జరిగిన వాకాన్నే అనిఫెస్ట్‌కు హాజరయ్యారు. అక్కడ వేదికపై స్పైడర్ మ్యాన్ ఫోజులు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు.

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచములోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భర్త కూడా ఒకటిగా నిలిచింది. ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఎవరైనా వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో దోహదపడతాయని తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 29, 2024, 9:05 [IST]
English summary
Delhis spiderman couple bike stunt without helmet cops arrested
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+