మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్‌ ఉందా? నెలకు రూ. 65,000 జీతం.. ప్రభుత్వమే దగ్గరుండి ఉద్యోగం ఇప్పిస్తుంది!

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో యువత సైతం రెగ్యులర్ కోర్సుల కంటే కూడా స్కిల్డ్‌ కోర్సులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలావరకు టెక్నికల్, ఇతర స్పెసిఫైడ్ కోర్సుల్లో శిక్షణ పొంది విదేశాల్లో ఎక్కువ సంఖ్యలో స్థిరపడుతున్నారు. ఇలాంటి కోర్సులకి తెలంగాణలో డిమాండ్ ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలో ఈ కోర్సులను జనాలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో సెమీ స్కిల్డ్ కోర్సుల ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలకు దారి చూపిస్తోంది.

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వమే విదేశాల్లో ప్లేస్‌మెంట్‌ని అందిస్తోంది. ఈ సెమీ స్కిల్డ్‌ ట్రైనింగ్‌ లేదా కోర్సుల్లో హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బేవరేజెస్, మెషీన్‌ టెక్నీషియన్స్, ఫిట్టర్స్, క్రేన్ ఆపరేటర్స్, డ్రైవర్స్‌, ఏసీ ఫ్రిడ్జ్ రిపేర్ టెక్నీషియన్స్, వేర్ హౌస్ అసోసియేట్స్ వంటి ఎన్నో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది.

Delivery Boy Jobs in UAE Offered By TOMCOM

ఈ కోర్సులు లేదా ట్రైనింగ్‌కి అర్హత సాధించిన వారికి ప్రభుత్వమే విదేశాల్లో ప్లేస్‌మెంట్‌ని కల్పిస్తోంది. తాజాగా దుబాయ్‌ (UAE)లో డెలివరీ బాయ్స్ (బైక్‌ రైడర్స్‌) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్తులు దరఖాస్తులను ఈ నెల 10 (అక్టోబర్) లోపు రెజ్యూమ్‌లను [email protected]కు ఇమెయిల్ ద్వారా సమర్పించవచ్చు లేదా నేరుగా హైదరాబాద్‌లోని మల్లేపల్లి ITI క్యాంపస్‌లో ఇవ్వవచ్చు.

దరఖాస్తుదారుల 21 నుంచి 40 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి. కనీసం మూడేళ్ల భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ని కచ్చితంగా కలిగి ఉండాలి. బేసిక్‌ ఇంగ్లీష్‌ వచ్చి ఉండాలి. అలాగే స్విగ్గీ, జొమాటో ఇతర డెలివరీ బాయ్స్‌కి ప్రాధన్యత ఉంటుంది. దీనికి సంబంధించిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. దుబాయ్‌ లైసెన్స్‌ కలిగిన వారికి వెంటనే ప్లేస్‌మెంట్‌ ఇప్పిస్తారు.

Delivery Boy Jobs in UAE Offered By TOMCOM

లైసెన్స్‌ లేని వారికి ఏజేన్సీ ద్వారా ట్రైనింగ్‌ ఇచ్చి లైసెన్స్‌ జారీ చేస్తారు. ఆ తర్వాత జీతంలో కొతం సొమ్ముని సదరు ఏజెన్సీకి చెల్లిస్తారు. అయితే ట్రైనింగ్‌లో సాలరీ ఇవ్వరు. వసతి, భోజన సదుపాయాన్ని మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుంది. శిక్షణ పూర్తైన తర్వాత AED 2850 (ధీరమ్స్‌- దుబాయ్‌ కరెన్సీ) జీతంగా చెల్లిస్తారు. ఇన్సెంటీవ్స్‌ కలుపుకుని ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 65,000 లు అందుతుంది.

తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ అండ్‌ కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అయిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. గల్ఫ్ ప్రాంతాలు, ఆస్ట్రేలియా, కెనడా, అనేక యూరోపియన్ దేశాలతో సహా అనేక దేశాలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో సహకారంతో రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

విదేశాల్లో ప్లేస్‌మెంట్స్‌ని సులభతరం చేయడానికి TOMCOM పనిచేస్తుంది. దీనిపై మరింత సమాచారం కోసం టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ని సందర్శించి విదేశాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు విదేశాల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. కెరీర్‌ గైడెన్స్‌కి సంబంధించిన సందేహాలను సైతం నివృత్తి చేసుకోవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, October 5, 2024, 14:52 [IST]
English summary
Delivery boy jobs offered by talangana overseas manpower company limited in dubai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+