ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

భారతదేశంలోని డెన్మార్క్ రాయబారి స్వెన్ ఫ్రెడ్డీ ఢిల్లీలో ఓ ఇ-ఆటో (ఎలక్ట్రిక్ ఆటోరిక్షా) ను నడుపుతూ కనిపించారు. ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ ప్రచారంలో భాగంగా ఆయన ఇలా చేశారు. గ్రీన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశం మరియు డెన్మార్క్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ, కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో మరియు పర్యావరణాన్ని పరిశుభ్రంగా మార్చడంలో ఇరు దేశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

భారత రాజధాని న్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ సర్కారు కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, మే 24 నుండి ఢిల్లీలో 150 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా మే 24 నుంచి మే 26 వరకు టిక్కెట్ లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూడా ప్రజలకు కల్పించారు.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

రాజధానిలో ఇ-బస్సులను ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే లక్ష మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. వీరిలో 40 శాతం మంది ప్రయాణికులు మహిళలే కావటం విశేషం. దీనిపై ఢిల్లీ పర్యావరణ మంత్రి కైలాష్ గెహ్లాట్ కూడా ట్వీట్ చేసి, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రజా రవాణాను బలోపేతం చేయడానికి తాను నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

FAME-2 పథకం ద్వారా ఇ-బస్సులపై సబ్సిడీ

ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక FAME-II పథకం (భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం) కింద 64 నగరాల్లో 5,595 ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రా-సిటీ మరియు ఇంటర్‌సిటీ కార్యకలాపాల కోసం ఆమోదించబడ్డాయి. ఢిల్లీలో FAME-2 పథకం కింద 300 ఇ-బస్సులు కేటాయించబడ్డాయి, వాటిలో 150 బస్సులను మే 24న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం సహకారంపై సీఎం కేజ్రీవాల్ వివరణ ఇస్తూ.. వచ్చే పదేళ్లలో ఈ ప్రాజెక్టుపై ఢిల్లీ ప్రభుత్వం మొత్తం రూ.1,862 కోట్లు వెచ్చించాలని యోచిస్తోందని, కేంద్రం ఇందుకు రూ.150 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇ-బస్సులను ప్రారంభించిన సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, "ఢిల్లీ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన రోజు - DTC (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) యొక్క ఫ్లీట్‌లో 150 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు చేర్చబడ్డాయి. మేము ఈ బస్సులను అధికారికంగా ప్రారంభించాము మరియు వాటిలో ఒకదానిలో ప్రయాణించడానికి కూడా వెళ్ళాము. ఈ బస్సులు చాలా ఆకట్టుకునేవిగా, అందంగా నిర్మించబడ్డాయి మరియు ఇవి ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి" అని అన్నారు.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

ఢిల్లీలో కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులతో పబ్లిక్ బస్సుల సంఖ్య 7,200 మార్కును అధిగమించింది, ఇది మునుపెన్నడూ లేని విధంగా అత్యధికం. వచ్చే నెలలో మరో 150 ఇ-బస్సులను జతచేస్తామని, 2023 నాటికి నగరానికి మరో 2,000 కొత్త ఇ-బస్సులను తీసుకు వస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

ఢిల్లీలో ఇ-సైకిల్‌పై తగ్గింపు

ఇదిలా ఉంటే, ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ బైక్‌ల తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ఇ-సైకిళ్లపై కూడా సబ్సిడీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల, ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ఎలక్ట్రిక్ సైకిళ్ల కొనుగోలుపై ధరలో 33 శాతం సబ్సిడీని ప్రకటించారు, ఇది గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

ఈ కొత్త విధానం ప్రకారం, ఢిల్లీలో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ సైకిల్ ధరపై 25 శాతం మరియు కార్గో ఎలక్ట్రిక్ సైకిల్ ధరపై 33 శాతం సబ్సిడీని పొందవచ్చు. కార్గో ఇ-సైకిళ్లపై గరిష్టంగా రూ.5,500 సబ్సిడీ ఇస్తోంది. మొదటి 1,000 మంది కొనుగోలుదారులకు రూ.2,000 అదనపు తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

జూన్ 2022 నుండి పెరగనున్న థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం

జూన్ 1, 2022 నుండి థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం (Third Party Vehicle Insurance Premium) పెంచాలని ప్రభుత్వం మరియు బీమా సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పెంచిన ప్రీమియం వివరాలను వెల్లడించింది. ఈ నిర్ణయం తర్వాత, వాహనదారులకు జూన్ 1 నుంచి కార్లు, టూ వీలర్ల ఇన్స్యూరెన్స్ కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతున్న డెన్మార్క్ రాయబారి.. కారణం ఏంటంటే..

దేశంలో కోవిడ్-19 విజృంభన కారణంగా విధించిన మారటోరియం వలన గత రెండేళ్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా 2019-2020 లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియంను సవరించారు. కాగా, ఇదివరకు థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్లను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డిఏఐ) ప్రకటించేది. అయితే, ఇప్పుడు తొలిసారిగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఐఆర్‌డీఏఐతో సంప్రదించి ప్రీమియం రేట్ల ను ప్రకటించింది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Denmark ambassador rides e auto in delhi 150 electric buses launched in city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X