పైలెట్లు.. మౌత్ వాష్, జెల్,పేస్ట్ వినియోగించకూడదు.. డీజీసీఏ కీలక ఆదేశం.. ఎందుకంటే?
భారత్‌లోని పైలెట్లకు (Pilots) డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నూతన మార్గదర్శకాలను జారీచేసింది. పైలెట్లు మౌత్ వాష్, టూత్ జెల్, టూత్ పేస్ట్‌లను వినియోగించకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అయితే డీజీసీఏ (DGCA New Norms) నూతన మార్గదర్శకాలపై కొంత చర్చ జరిగింది. పైలెట్లు.. మౌత్ వాష్, టూత్ జెల్, టూత్ పేస్ట్‌ల వినియోగిస్తే ఏం జరుగుతుందనే దానిపై స్పష్టత ఇచ్చింది. భారత్‌లో మద్యం తాగి వాహనాలు నడిపించడం నేరం, పోలీసులు తనిఖీల్లో పట్టుపడితే జరిమానా సహా శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

భారత్‌లో భారీగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యం మత్తు కూడా ప్రధాన కారణంగా ఉంది. పైలెట్లు కూడా మద్యం తాగి విమానాలు నడపకుండా ప్రత్యేక చట్టం ఉంది. ఈ కారణంగా పైలెట్లు విమానాలు నడిపే ముందు వారికి కీలక పరీక్షలు నిర్వహిస్తారు.
ఆ పరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తేనే విమానాలు నడిపేందుకు అనుమతి ఇస్తారు. ఇందులో బ్రీత్ ఎనలైజర్ పరీక్ష ఒకటి. పైలెట్లు విమానం నడిపేందుకు వెళ్తున్న ప్రతిసారి మద్యం తాగారో లేదో పరీక్షలు చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే అనుమతి ఇస్తారు. అయితే మౌత్ వాష్, టూత్ జెల్, టూత్ పేస్ట్ వినియోగిస్తున్న పైలెట్లకు మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఫలితాలు వస్తున్నాయి.

ఆల్కాహాల్ ఉండడమే: ఈ తరహా ఉత్పత్తుల తయారీ కొంత శాతం ఆల్కాహాల్ ఉండడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో మౌత్ వాష్, టూత్ జెల్, టూత్ పేస్ట్ వినియోగించినా.. మద్యం తాగినట్లు పరీక్షల్లో కనిపిస్తోంది. అయితే పైలెట్లు మద్యం తాగకున్న బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో పాజిటివ్ వస్తోంది. ఇలాంటి పరీక్ష ఫలితాలతో పైలెట్లను విధులకు అనుమతి ఇవ్వటం చట్టప్రకారం ఇబ్బందులు వస్తాయి.
దీంతో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మౌత్ వాష్, టూత్ జెల్, టూత్ పేస్ట్ సహా ఆల్కాహాల్ ఆధారిత ఉత్పత్తుల వినియోగంపై నిషేదం విధించింది. ఎవరైనా వీటిని ఉల్లఘిస్తే నేరాన్ని బట్టి, ఎన్నిసార్లు నేరం చేసారో ఆ వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్యూయల్ సెల్ టెక్నాలజీ: పైలెట్ సహా క్యాబిన్ సిబ్బందికి ప్యూయల్ సెల్ టెక్నాలజీతో కూడిన బ్రీత్ ఎనలైజర్ పరికరాలతో పరీక్షలను తప్పనిసరి చేశారు. కాలిబ్రేషన్ ఏజెన్సీల పర్యవేక్షణ మరియు నిఘా కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30వ తేదీన ఈ నూతన మార్గదర్శకాలు వచ్చాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








