డించక్ పూజ వేగానికి బ్రేకులు వేయనున్న ఢిల్లీ పోలీసులు: అసలేమైంది?

Written By:

డింఛక్ పూజ ఓ సాధారణ కాలేజీ యువతి, షడన్‌గా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. యూ ట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన డింఛక్ పూజకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. "సెల్ఫీ మేనే లేలి" అనే ఒక్క పాటతో డింఛక్ పూజ అప్‌లోడ్ చేసిన వీడియోకు కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి.

డించక్ పూజ

అనుకోకుండా యూ ట్యూబ్ స్టార్‌గా అవతరించిన డింఛక్ పూజ "దిలోన్ క షూటర్" అనే వీడియోతో మళ్లీ యూ ట్యూబ్ లోకి వచ్చింది. ఎప్పటిలాగే ఈ వీడియోకు కూడా భారీ వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాట ఉన్న వీడియో ద్వారా డింఛక్ పూజ చిక్కుల్లో పడింది.

డించక్ పూజ

డింఛక్ పూజ ఎరుపు రంగులో ఉన్న పియాజియో వెస్పా స్కూటర్ మీద ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతూ తాజాగా విడుదల చేసిన వీడియోలో కనిపించింది. అయితే దీనికి వ్యతిరేకంగా డింఛక్ పూజను వ్యతిరేకించే వాళ్లు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ, హెల్మెట్ ధరించకుండా ఢిల్లీ వీధుల్లో స్కూటర్ నడపడం గురించి ప్రస్తావించారు.

డించక్ పూజ

నెటిజన్లు చేస్తున్న ట్వీట్లకు పూర్తి వివరాలను తెలపండి కోరుతూ ఢిల్లీ పోలీసులు మరో ట్వీట్ చేశారు. ఇందుకు స్పందిస్తూ, డింఛక్ పూజ అనే సోషల్ మీడియా సెలబ్రిటీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి ట్రాఫిక్ రూల్ ఉల్లంఘించిందంటూ ఫిర్యాదు చేసాడు.

డించక్ పూజ

ఢిల్లీలోని సూరజ్ మాల్ ప్రాంతంలో పెద్ద శబ్దంతో పాటలు పాడుతూ, హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందున ఢించక్ పూజ మీద చర్యలు తీసుకొంటామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

డించక్ పూజ

గతంలో కూడా ఢించక్ పూజ తన తొలి పాట షూటింగ్‌లో ఆడి ఏ4 కారులో ప్రయాణిస్తూ, సన్ రూఫ్ ద్వారా నిలబడి పాటలు పాడిందని, అదే తరహాలో ఇప్పుడు టూ వీలర్ మీద ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ పర్ఫామెన్స్‌లు ఏమిటని నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

డించక్ పూజ

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై స్వయంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ ద్వారా దేశంలోని అన్ని నగరాల ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

డించక్ పూజ

కంప్లైట్ ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు ఓ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ రిలీజ్ చేశారు. Traffic Sentinel అనే అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని, రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారి వీడియో లేదా ఫోటోలను పంపవచ్చు.

డించక్ పూజ

ఏదేమయినప్పటికీ సోషల్ మీడియా సెలబ్రిటీ పేరు తెచ్చుకున్న డింఛక్ పూజకు ఢిల్లీ పోలీసుల నుండి చేదు అనుభవం ఎదురుకానుంది. దూరం ఎంతైనా సరే హెల్మెంట్ ధరించే బైక్ డ్రైవ్ చేయండి సుమా...!

English summary
Read In Telugu: Dhinchak Pooja In Trouble For Not Wearing Helmet
Story first published: Thursday, June 29, 2017, 13:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark