బైక్‌పై సెక్యూరిటీ గార్డుకు లిఫ్ట్‌ ఇచ్చి కెమెరాకు చిక్కిన ధోనీ.. సింప్లిసిటీకి మరోసారి ఫ్యాన్స్‌ ఫిదా.!!

ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీకి కార్లు, బైక్‌లంటే ఎంత ఇష్టమో ఆయన ఫామ్‌ హౌజ్‌లోని గ్యారేజ్‌ను చూస్తే అర్థమవుతుంది. షోరూమ్‌లో కూడా ఇన్ని కార్లు, బైక్‌లు ఉండవేమో అని ఆశ్చర్యపోతారు. కానీ మీకో విషయం తెలుసా.. ధోనీ ఫామ్‌హౌజ్‌ లోపలికి మీరు వెళ్లాలంటే మీరు కచ్చితంగా వాహనంపై వెళ్లాల్సిందే..

ఎంఎస్‌ ధోనీ తనకు ఎంతో ఇష్టమైన క్లాసిక్‌ బైక్‌లు, కార్ల కోసం తన ఫాం హౌజ్‌లో భారీ గ్యారేజ్‌నే ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా 2 స్ట్రోక్ మోటార్‌ సైకిళ్లంటే ధోనీకి చాలా స్పెషల్‌. ఆ ఫామ్‌ హౌజ్‌ కూడా చాలా విశాలంగా కట్టుకున్నట్లు సమాచారం. అందుకేనేమో ధోనీ తన సెక్యూరిటీ గార్డును యమహా RD350 బైక్‌పై గేటు దగ్గర దింపాడు.

MS-Dhoni-Lift-To-Security-Guard

ధోనీ తన సెక్యూరిటీ గార్డును.. ఫామ్‌ హౌజ్‌ మెయిన్‌ గేట్‌ దగ్గర డ్రాప్‌ చేస్తుండగా.. అక్కడే ఉన్న ధోనీ అభిమాని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. దీనిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ధోని నివసించే ఫామ్‌హౌస్ దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఫామ్‌హౌస్ యొక్క మెయిన్‌ గేట్‌ ధోనీ నివసించే బిల్డింగ్‌కి దూరంగా ఉండటంతో.. అక్కడి నుంచి గేటు వరకు నడవాలంటే చాలా దూరం..

సాధారణంగా ధోనీ కూడా ఈ మార్గం నుంచే రాకపోకలు సాగిస్తాడు. ఎక్కువగా ధోనీ తన వింటేజ్‌ కార్లలో రాంచీ రోడ్లపై విహరిస్తూ ఉంటాడు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సారి ధోని తన ప్రైవేట్ ప్రాపర్టీలో యమహా RD350 బైక్ నడుపుతూ కనిపించడం ఆసక్తిగా మారింది.

MS-Dhoni-Lift-To-Security-Guard

సెక్యూరిటీ గార్డు షిఫ్ట్‌ టైమింగ్‌ ముగియడంతో.. ఫామ్‌హౌజ్‌లోని ఇంటి నుంచి గేటు వరకు అంతదూరం సెక్యూరిటీ గార్డు నడిస్తే సమయం వృథా అవుతుందని భావించాడేమో.. ధోనీ అతడిని మెయిన్‌ గేట్‌ వరకు డ్రాప్‌ చేశాడు. గేటు ముందు ధోనీ బైక్‌ ఆపగా.. సెక్యూరిటీ గార్డు బైక్‌ దిగడాన్ని వీడియోలో చూడవచ్చు.

ఇది చూసిన అభిమానులు ఉత్సాహంతో కేకలు వేస్తుండగా.. ధోని వారి వైపు చూస్తూ అభివాదం చేసి బైక్‌ను లోపలికి పోనిచ్చాడు. ధోనీ సింప్లిసిటీకి నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ధోనీ క్రికెట్‌లోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో కూల్‌గా ఉంటారని ఫ్యాన్స్‌ అంటున్నారు.

MS-Dhoni-Lift-To-Security-Guard

ఇక Yamaha RD350 బైక్‌ విషయానికొస్తే.. ధోనీ కలెక్షన్స్‌లో ఈ బైక్‌ చాలా స్పెషల్‌. ధోనీ ఈ బైక్‌ కొనుగోలు చేసే సమయానికి.. మార్కెట్లో అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటి. ఇది 350cc ట్విన్-సిలిండర్ టూ-స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లో టార్క్ వేరియంట్‌లోనూ సుమారుగా 28 Bhp, హై టార్క్ వెర్షన్‌లో 31 Bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

యమహా RD350తో పాటు, ధోని తన గ్యారేజీలో 150 బైక్‌లు.. ఇంకా అంతకంటే ఎక్కువ బైక్‌లనే కలిగి ఉన్నాడు. వీటి ప్రదర్శన కోసం ధోనీ ప్రత్యేకంగా బహుళ అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మించాడు. Yamaha RX100, Suzuki Shogun, నార్టన్, జావా మరియు BSA ఇలా వింటేజ్‌ బైక్‌లను కూడా కలిగి ఉన్నాడు.

MS-Dhoni-Lift-To-Security-Guard

ఇంకా కవాసకి నింజా H2, కవాసకి నింజా ZX-14R, హార్లే డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్ మరియు అల్ట్రా-రేర్‌ కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్ వంటి సూపర్ బైక్‌లు ధోనీ సొంతం. బైక్‌లు కాకుండా, ధోని వద్ద క్లాసిక్ ఇంకా వింటేజ్‌ కార్లు ఉన్నాయి. గ్యారేజీలో రెస్టో-మోడెడ్ నిస్సాన్ 1 టన్ను, రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్ II, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్ మరియు 1970 మోడల్ ఫోర్డ్ ముస్టాంగ్‌ వంటి వింటేజ్‌, క్లాసిక్‌ కార్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 1, 2023, 14:12 [IST]
English summary
Dhoni drops his security guard on yamaha rd350 bike because of the big farm house
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+