భారత్‌లో గోల్డ్ ప్లేటెడ్ బైక్‌ను ఆవిష్కరించిన దియా జువెల్స్
మనం గతంలో టాటా మోటార్స్, టాటా గోల్డ్ ప్లస్ సంస్థలు అభివృద్ధి చేసిన బంగారు టాటా నానో కారును చూశాం. ఇప్పుడు ఈ కథనంలో గోల్డెన్ బైక్ గురించి తెలుసుకుందాం రండి. విలువైన లోహాలు, రాళ్లు, రత్నాలను ఉపయోగించి పలు ఆటోమొబైల్ సంస్థలు కొన్ని రకాల ప్రత్యేక మోడళ్లను అభివృద్ధి చేస్తుంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఓ ఆభరణాల సంస్థ తయారు చేసిన గోల్డెన్ బైక్.
రిద్ది సిద్ధి బులియన్ లిమిటెడ్‌కు చెందిన దియా జువెల్స్ బంగారం, ఇతర విలువైన లోహాలను ఉపయోగించి ఈ గోల్డెన్ బైక్‌ను సృష్టించింది. రిద్ది సిద్ధి బులియన్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ హోల్‌సేల్ అండ్ ట్రేడింగ్ కంపెనీలలో ఒకటి. ఇది లండన్ బులియన్ మార్కెట్ అసోషియేషన్ ద్వారా గుర్తించబడినది. ఇది భారత ప్రభుత్వంలోని కామర్స్ మంత్రిత్వ శాఖ యొక్క ఎగ్జిమ్ పాలసీ క్రింద ప్రీమియర్ ట్రేడింగ్ హౌస్‌గా కూడా సర్టిఫై చేయబడనది.
ఈ గోల్డెన్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

వింటేజ్ డిజైన్
ఈ గోల్డ్ ప్లేటెడ్ బైక్ ఓ పురాతన బైక్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం దియా జువెల్స్ వెల్లడించలేదు. ఇది జస్ట్ డిస్‌ప్లే మోడల్ అని తెలుస్తోంది.

క్రియేషన్
ఈ బైక్ తయారీలో బంగారం, వజ్రాలను ఉపయోగించారు. అయితే, ఎంత మొత్తంలో బంగారాన్ని మరియు ఎన్ని వజ్రాలను ఉపయోగించారనే విషయాన్ని దియా జువెల్స్ తెలుపలేదు.

బెంచ్‌మార్క్ క్రియేటివిటీ
రిద్ది సిద్ధి బులియన్ లిమిటెడ్‌కు చెందిన దియా జువెల్స్ ఈ గోల్డెన్ బైక్ తయారీతో ఓ బెంచ్‌మార్క్ క్రియేటివిటీని నెలకొల్పింది.

ధర
ఈ గోల్డెన్ బైక్‌కు సంబంధించి ఎలాంటి ధరను వెల్లడించలేదు. దీన్నిబట్టి చూస్తుంటే, ఇది ఎప్పటికీ షోరూమ్‌లోనే డిస్‌ప్లే యూనిట్‌గా మిగిలే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








