ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ఒలంపిక్ గేమ్స్ టోక్యోలో హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలోని చాలాదేశాల ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభను కనపరుస్తున్నారు. ఇందులో భారతీయ ఆటగాళ్లు కూడా ఉన్నారు. భారతదేశం తరపున పాల్గొన్న ఆటగాళ్లలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించి శుభారంభం చేసింది. తరువాత పివి సింధు కూడా బ్రాంజ్ మెడల్ సాధించి తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండియన్ హాకీ మహిళా టీమ్ ఒలంపిక్ గేమ్స్ లో తమదైన ముద్ర వేస్తూ పతకాల వేటలో పరుగెడుతున్నారు. హాకీ మన నేషనల్ గేమ్ అయినప్పయికి చాలా సంవత్సరాలుగా హాకీలో మెడల్ మాత్రం సాధించలేకపోతోంది. అయితే ఇప్పుడు మహిళా హాకీ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి 'సావ్‌జీ ధోలాకియా' బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ఒలింపిక్స్ చరిత్రలో భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. కానీ భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. అయితే ఇప్పటికి కూడా భారత్‌కు కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది. మహిళల హాకీ జట్టు అద్భుతమైన ప్రతిభ కనపరిస్తే కాంస్య పతకం తప్పకుండా సాధించవచ్చు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ఇంతలో, ఖరీదైన బహుమతుల అందించడంలో ప్రాచుర్యం పొందిన, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, భారత మహిళా హాకీ జట్టు మెడల్ గెలుచుకుని వస్తే, వారికి సొంత ఇల్లు ఏర్పాటు చేసి ఇస్తామని, అంతే కాకుండా మహిళల హాకీ జట్టు సభ్యులందికి రూ. 11లక్షలు ఇస్తానని హెచ్‌కే గ్రూప్‌ అధినేత ప్రకటించారు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ఒకవేలా ఇళ్లున్నవారికి కారు గిఫ్టుగా ఇస్తానని తెలిపారు. టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్‌కు చేరిన సందర్భంగా ధోలాకియా ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. మహిళల హాకీ టీమ్‌ సాధించిన అద్భుతమైన విజయం గర్వంగా ఉందని. భారత్ యావత్తు మహిళల హాకీ టీమ్ ను చూసి గర్విస్తోందని అన్నారు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధోలాకియా ఖరీదైన బహుమతులు ఇస్తూ ఇంతకు ముందుకూడా వార్తల్లో నిలిచారు. ఖరీదైన బహుమతులు అందించుదాం ఇతనికి ఇదే మొదటి సరి కాదు. యితడు దీపావళి పండుగకు కార్లను తమ ఉద్యోగులకు బోనస్‌గా అందిస్తారు. ఈ నేపథ్యంలోనే ధోలాకియా తన ఉద్యోగులకు దాదాపు 1,000 కి పైగా కార్లను బహుమతిగా ఇచ్చాడు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

కంపెనీలో ఉద్యోగులలో 25 సంవత్సరాలు సేవలందిస్తున్న ముగ్గురు ఉద్యోగులకు ఖరీదైన మరియు అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలను గిఫ్ట్ గా ఇచ్చారు. సూరత్‌లో జరిగిన వేడుకలో మూడు ఎస్‌యూవీలను తమ ఉద్యోగులకు అందజేశారు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

తన ఉద్యోగులకు ఇచ్చిన కారు బహుమతులు వైరల్ అయిన తర్వాత సావ్‌జీ ధోలాకియా వార్తల్లో కనిపించడం ప్రారంభించాడు. గతంలో, వారు తమ ఉద్యోగులకు దాదాపు 500 ఫియట్ కార్లు, 1,260 మారుతి కార్లు మరియు 1,200 యూనిట్ల డాట్సన్ రెడీ-గో కార్లను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీపై 4-5 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దాదాపు 40 సంవత్సరాల తరువాత, టోక్యో ఒలింపిక్స్ ద్వారా భారత హాకీ జట్టు మళ్లీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఇప్పటివరకు 12 పతకాలు సాధించినట్లు తెలిసింది. ఇందులో 8 బంగారు, 3 కాంస్య, 1 రజతం పతకాలు ఉన్నాయి.

ఒలంపిక్స్‌లో భారత మహిళా హాకీ టీమ్ పతకం గెలిస్తే.. ఇల్లు, కారు ఇంకా ఎన్నెన్నో; వజ్రాల వ్యాపారి బంపర్ ఆఫర్

ఒలింపిక్స్ చరిత్రలో ఒక జట్టు సాధించిన గొప్ప విజయం ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని ఓడించి భారత హాకీ జట్టు ఈసారి సరికొత్త రికార్డు సృష్టించింది. మనం నేషనల్ గేమ్ లో మెడల్ సొంతం చేసుకుని, మళ్ళీ ఈ ఆటకు పూర్వ వైభవం తీసుకువచ్చారు. ఏది ఏమైనా ఒలంపిక్స్ లో పాల్గొన్న అందరూ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Diamond merchant promises houses car for women hockey team if they win olympic medal details
Story first published: Friday, August 6, 2021, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X