కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

గతంతో పోల్చుకుంటే, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఆధునిక కార్లు అనేక రకాలుగా అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు. ప్రత్యేకించి, సేఫ్టీ విషయంలో గతంతో పోల్చుకుంటే, ప్రస్తుతం అనేక రకాల భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లు మొదలుకొని ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వరకు అనేక రకాల సేఫ్టీ ఫీచర్లు ప్రస్తుతం దాదపుగా అన్ని కార్లలో అందుబాటులో ఉన్నాయి.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

ఇందుకు మనం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి మరియు ఇలాంటి ఫీచర్లను తయారు చేసే ఇంజనీర్లకు తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అటానమస్ డ్రైవింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈనాటి కథనంలో మనం కార్లలో ఉపయోగించే 7 సాధారణ సేఫ్టీ ఫీచర్లు మరియు వాటి మూలాల గురించి చెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

1. త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు (3-Point Seatbelts)

దాదాపు 1940 వరకు కార్లలో ల్యాప్ బెల్టులు మాత్రమే ఉపయోగించబడ్డాయి. ఇవి విమానాలలో కనిపించే ల్యాప్ బెల్టుల మాదిరిగా ఉంటాయి. అయితే, ఆ తర్వాతి కాలంలో త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌ లను కనుగొన్నారు. స్వీడన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) దీన్ని కనిపెట్టింది. ఈ కంపెనీ తొలిసారిగా తమ వాహనాలలో త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌ ఫీచర్ ను అందించింది.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

ఈ త్రీ-పాయింట్ సీట్ బెల్టులలో సీట్ బెల్ట్ షోల్డ్ నుండి ప్రారంభమై ల్యాప్‌కు ఇరువైపులా కవర్ చేయబడి ఉంటుంది. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇది ప్రయాణీకుడిని కారు సీటు నుండి కదలకుండా ఉంచేందుకు సహాయపడుతుంది. అయితే, ఈ త్రీ-పాయింట్ సీటు బెల్ట్ 1959 వరకు తప్పనిసరి సేఫ్టీ ఫీచర్ గా ఉండేది. ఆ తర్వాత ప్రపంచ దేశాలు దాని ప్రాముఖ్యతను గ్రహించి, ప్రతి వాహనంలో ఈ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ ను తప్పనిసరి చేశాయి.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

2. ఎయిర్ బ్యాగ్స్ (Airbags)

ఎయిర్‌బ్యాగ్ ను మొదటిసారిగా 1905 లో కాన్సెప్ట్ మోడల్‌గా పరిచయం చేయబడింది. అయితే చాలా ఏళ్లుగా ఇది వినియోగంలోకి రాలేదు. దాని పేలవమైన డిజైన్ కారణంగా ఇది చాలా సంవత్సరాలుగా ఉపయోగంలోకి రాలేకపోయింది. అయితే, అమెరికాకు చెందిన ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (General Motors) 1970 కాలంలో తమ వాహనంలో అధిక-పనితీరు గల ఎయిర్‌బ్యాగ్‌ను మొదటిసారిగా పరిచయం చేసింది.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

జనరల్ మోటార్స్ ఈ వ్యవస్థను 'ఎయిర్ కుషన్ రెస్ట్రెయిన్ సిస్టమ్' అని పిలిచేది. ఆ తర్వాతి కాలంలో దీనిని ఎయిర్‌బ్యాగ్ పేరుతో అన్ని లగ్జరీ కార్లలో ప్రవేశపెట్టబడింది. మనదేశంలో కూడా ఒకప్పుడు ఇది యాడ్-ఆన్ సేఫ్టీ ఫీచర్ గా ఉండేది. అంటే, ఎక్కువ డబ్బులు చెల్లిస్తేనే, ఈ సేఫ్టీ ఫీచర్ లభించేది. కానీ, ప్రస్తుతం ఇది దాదాపు అన్ని ఎంట్రీ లెవల్ కార్లలో కూడా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ గా లభిస్తుంది. భారతదేశంలో విక్రయించబడే అన్ని కార్లలో ఇప్పుడు డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్ రెండూ తప్పనిసరి చేయబడ్డాయి.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

3. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)

ఏబిఎస్ అంటే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. మొదట్లో ఈ తరహా టెక్నాలజీని కేవలం విమానాల కోసం మాత్రమే ఉపయోగించబడింది. దీనిని తొలిసారిగా 1960 లో విమానాలలో ఉపయోగించేందుకు కనిపెట్టబడింది. ఆ తరువాత ఆటోమబైల్ తయారీదారులు దీనిని కార్లలో కూడా ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే, 1970 కాలంలో మొదటిసారిగా కార్లలో ABS ఫీచర్ ఉపయోగించబడింది.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

ఏబిఎస్ టెక్నాలజీలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు, చక్రాలు కదలకుండా లాక్ అవడాన్ని ఈ ఫీచర్ నిరోధిస్తుంది. ఫలితంగా, ఆ కాస్తంత సమయంలో డ్రైవర్ తన వాహనాన్ని అదుపు చేయడానికి లేదా తనకు నచ్చిన దిశలో స్టీరింగ్ తిప్పడానికి ఏబిఎస్ ఫీచర్ సహకరిస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అన్ని కార్లలో ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరి చేయబడింది. కొన్ని హై-ఎండ్ ద్విచక్ర వాహనాలలో కూడా తయారీదారులు ఈ ఫీచర్ ను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ గా అందిస్తున్నారు.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

4. డిస్క్ బ్రేకులు (Disc Brakes)

డిస్క్ బ్రేక్‌లు ఆటోమొబైల్ పరిశ్రమలోని తొలి ఆవిష్కరణలలో ఒకటి. కానీ, ఈ ఫీచర్ ను సిట్రోయెన్ ఉపయోగించేందుకు దాదాపు ఐదు దశాబ్దాలు పట్టింది. అవును, సిట్రోయెన్ తమ వాహనాలలో డిస్క్ బ్రేక్ ‌లను ప్రవేశపెట్టిన మొదటి ఆటోమొబైల్ కంపెనీ. ఈ ఫీచర్ కనుగొనబడే వరకు వాహనాలలో సాంప్రదాయ డ్రమ్ బ్రేక్‌లు మాత్రమే ఉపయోగించబడ్డాయి. ప్రస్తుతం, దేశంలో లభిస్తున్న చవకైన వాహనాలలో డ్రమ్ బ్రేకులు లభిస్తుండగా, ఖరీదైన వాహనాలలో డిస్క్ బ్రేకులు లభిస్తున్నాయి. ఏబిఎస్ ఫీర్ కోసం డిస్క్ బ్రేకులు చాలా అనువుగా ఉంటాయి.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

5. క్రంపుల్ జోన్స్ (Crumple Zones)

క్రంపుల్ జోన్ అనే సేఫ్టీ ఫీచర్‌ను 1952 లో అభివృద్ధి చేశారు. దీనిని క్రంపుల్ జోన్‌లు, క్రష్ జోన్‌లు లేదా క్రాష్ జోన్‌లు అని కూడా పిలుస్తారు. ఇది వాహనాల్లో, ప్రధానంగా ఆటోమొబైల్స్‌లో ఉపయోగించే ఓ నిర్మాణాత్మక భద్రతా లక్షణం. ఇది వాహనం ఢీకొన్న సమయంలో, ప్రమాదానికి గురైన సదరు వాహనం, క్రాష్ వలన జనించే శక్తిని ఈ క్రంపుల్ జోన్స్ గ్రహించి ప్రమాద తీవ్రతను తగ్గించడంలో సహకరిస్తాయి.ఇటీవలి సంవత్సరాలలో, ఈ ఫీచర్ ను రైళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

6. సేఫ్టీ గ్లాస్ (Safety Glass)

ఒకప్పటి కార్లలో అసలు విండ్‌షీల్డ్ లేదా రూఫ్ టాప్ అనేవి ఉండేవి కాదు. అయితే, కాలక్రమేనా కార్లు అన్ని వైపుల నుండి మూసివేయబడినట్లుగా ఉండే నిర్మాణాన్ని పొందాయి. ఆ సమయంలో పుట్టుకొచ్చిందే ఈ సేఫ్టీ గ్లాస్. ఈ ఫీచర్ ను రసాయన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బెనెడిక్టస్ అనుకోకుండా సృష్టించారు. అతను దీనిని మొదటగా 1903 లో కనుగొన్నాడు. టక్కర్ కార్ కంపెనీ దానిని తన టార్పెడో మోడల్‌లో ఉపయోగించింది. ప్రమాదం జరిగినప్పుడు సేఫ్టీ గ్లాస్ చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతుంది. ఫలితంగా, దాని వలన కలిగే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది.

కార్లలో ఉపయోగించే ఈ 7 సేఫ్టీ ఫీచర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ వాటి మూలాల గురించి తెలుసా?

7. స్థిరత్వ నియంత్రణ (Stability Control)

స్థిరత్వ నియంత్రణ లేదా స్టెబిలిటీ కంట్రోల్ గా పిలిచే ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్ ను ఫ్రాంక్ వెర్నర్ మోన్ అనే యువ సెక్యూరిటీ ఇంజనీర్ రూపొందించారు. ప్రమాదం జరుగుతుందని గుర్తించినా లేదా వాహనం హఠాత్తుగా రోడ్డుపై పట్టును కోల్పోయినా ఈ ఫీచర్ యాక్టివేట్ అయి, డ్రైవరుకు సదరు వాహనంపై కంట్రోల్ ను అందించడంలో ఈ సేఫ్టీ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది కొన్ని మిడ్-రేంజ్ మరియు హై-ఎండ్ కార్లలో అందుబాటులో ఉంటుంది. ఇది తప్పనిసరి సేఫ్టీ ఫీచర్ కాకపోయినప్పటికీ, దీని వలన చాలా ప్రయోజనం ఉంటుంది.

Article Published On: Thursday, March 17, 2022, 12:26 [IST]
English summary
Did you know the origin of these seven car safety features lets find out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+