టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

టాటా మోటార్స్ (Tata Motors) 1945 నుండి భారత మార్కెట్లో ఉంది. దశాబ్ధాల కాలంగా, టాటా మోటార్స్ వాణిజ్య మరియు ప్రయాణీకుల వాహన విభాగాల్లో గొప్ప ఎత్తులను అధిగమించింది. భారతదేశంలో టాటా తయారు చేసిన అన్ని వాహనాలు కూడా పూర్తిగా దేశీయ ఉత్పత్తులు అని చెప్పవచ్చు.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల విషయంలో టాటా మోటార్స్ అనేక రెట్లు మెరుపడింది. వాటి డిజైన్, ఫీచర్స్ మరియు పవర్‌ట్రైన్స్ విషయంలో కంపెనీ తమ కస్టమర్లకు కొత్తదనాన్ని పరిచయం చేసింది. దివాళ స్థితికి చేరుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టేకోవర్ చేసుకున్న తర్వాత కంపెనీ తిరిగి ఆ బ్రాండ్ కు పునఃజ్జీవం కల్పించింది.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

రతన్ టాటా సారథ్యంలో నడుస్తున్న టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో చాలా ప్రగతిని సాధించింది. ప్రత్యేకించి ప్యాసింజర్ కార్ల విక్రయాలలో వృద్ధి దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. గత సెప్టెంబర్‌ 2021 లో జరిగిన విక్రయాలే దీనికి ఉదాహరణ. టాటా మోటార్స్ గత నెలలో మొత్తం 25,729 కార్లను విక్రయించింది. ఇది సెప్టెంబర్ 2020 కంటే 21.4 శాతం ఎక్కువ.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

టాటా కార్లు ప్రాచుర్యం పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా టియాగో నుండి టాటా సఫారీ వరకూ ప్రతికారులో కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మరి టాటా కార్లలో కనిపించే ఆ విశిష్టమైన అంశాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

తిరుగులేని సేఫ్టీ..

సాధారణంగా కార్ల విషయంలో ప్రధానంగా అందరూ పరిగణలోకి తీసుకునేది వాటి సేఫ్టీ గురించి. సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్ ఇతర కార్ కంపెనీల కన్నా ముందంజలో ఉంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా ధృడమైన నిర్మాణం మరియు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ తమ కార్లను అందిస్తోంది. టియాగో, ఆల్ట్రోజ్ మరియు నెక్సాన్ వంటి కార్లు ఇప్పటికే గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అత్యుత్తమ సేఫ్టీ ఫలితాలను నమోదు చేశాయి.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

భారత మార్కెట్‌లో ప్రస్తుతం మరే ఇతర కంపెనీలు కూడా ఇలాంటి సురక్షితమైన కార్లను ఉత్పత్తి చేయడం లేదు. భారతీయ వినియోగదారులు ఇప్పుడు, కారు ధర, మైలేజ్ మరియు డిజైన్‌ వంటి అంశాలకు మించి ఆయా కార్ల భద్రతపై కూడా దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో టాటా తమ వినియోగదారులను ఏమాత్రం నిరుత్సాహపరచడం లేదు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న టాటా కార్ల విక్రయాలే దీనికి నిదర్శనం.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

ఈవీ ప్లాట్‌ఫాం సిద్ధంగా ఉంది..

రతన్ టాటా దృష్టి ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించే ఉంటుంది. అందుకే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు ధీటుగా సమాధానం చెప్పేందుకు టాటా మోటార్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దేశంలో చాలా కాలంగా పాతుకుపోయిన కార్ కంపెనీలు మరియు టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్న సంస్థలు ఇంకా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధిపై పనిచేస్తుంటే, టాటా మోటార్స్ మాత్రం ఇప్పటికే నెక్సాన్ మరియు టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి, ఈ విభాగంలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

ప్రస్తుతం టాటా ఎలక్ట్రిక్ కార్ పోర్ట్ ఫోలియోలో టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) మరియు టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) మోడళ్లు లభిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం దేశంలో పలు విదేశీ కంపెనీలు అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరతో పోలిస్తే, సగం ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు లభిస్తున్నాయి. అలాగని, ఇవి ఫీచర్స్ మరియు బ్యాటరీ రేంజ్ విషయంలో సదరు విదేశీ మోడళ్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌళిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్న మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం అంత తేలికైన పనేమీ కాదు. కానీ, టాటా మోటార్స్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కేవలం తమ కస్టమర్లకే కాకుండా దేశంలోని ఇతర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల కోసం కూడా చార్జింగ్ మౌళిక సదుపాయాలను కల్పించేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ ప్రయత్నిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కంపెనీ ఆఫర్ చేస్తున్న బ్యాటరీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ ని ఆఫర్ చేస్తుందని నిర్ధారించబడింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, టాటా మోటార్స్ కొత్త ఉత్పత్తులు మరియు కొత్త సాంకేతికలపై నిరంతరం పనిచేస్తూనే ఉంది.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

స్వదేశీ ఉత్పత్తి అయినందుకు గర్వంగా ఉంది..

టాటా మోటార్స్ అందిస్తున్న కార్లు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను మరియు దేశీయంగా లభించే విడిభాగాలను ఉపయోగించి తయారు చేయబడుతాయి. గతంలో విక్రయించిన ఇండిగో నుండి ఇటీవల ప్రారంభించిన టిగోర్ ఈవీ వరకు కూడా అన్ని పూర్తిగా భారతదేశంలో తయారైన మేడ్ ఇన్ ఇండియా కార్లే కావటం విశేషం మరియు ఇది భారతీయులకు గర్వకారణం.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

సమర్థవంతమైన పవర్‌ఫుల్ ఇంజన్లు..

భారతదేశంలో కొత్త కాలుష్య ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత, దేశంలోని అనేక ప్రముఖ కార్ల తయారీదారులకు డీజిల్ ఇంజన్లతో కూడిన కార్లను విక్రయించడం అసాధ్యంగా మారింది. ఇది ఎంతలా ప్రభావితం అయిందంటే, నెలకు సగటున 1.5 లక్షల కార్లను విక్రయించే భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అసలు డీజిల్ కార్లను విక్రయించడమే మానేసింది.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

కానీ, టాటా మోటార్స్ మాత్రం ఇప్పటికీ బిఎస్6 స్టాండర్డ్స్ కి అనుగుణంగా డీజిల్ కార్లను విక్రయిస్తోంది. టాటా మోటార్స్ యొక్క రివోటార్క్ మరియు రివోట్రాన్ సిరీస్ ఇంజన్లు, కఠినమైన బిఎస్6 నిబంధనలకు లోబడి ఉంటాయి. అంతేకాదు, ఇవి అద్భుతమైన పనితీరు అందిస్తూనే, అంతే అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తాయి.

టాటా కార్లలో మీరు ఈ విశిష్టమైన విషయాలను గుర్తించారా? కొనేముందు ఓ లుక్కేస్కోండి!

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లేటెస్ట్ కంఫర్ట్ ఫీచర్స్..

టాటా మోటార్స్ తమ కార్లను సురక్షితమైనవిగా మార్చడమే కాకుండా, సౌకర్యాల విషయంలో కూడా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. డ్రైవర్, ప్రయాణీకుల సౌకర్యం మరియు ఆన్‌బోర్డ్ సౌకర్యాల విషయంలో టాటా కార్లలో అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. చౌకైన టియాగో హ్యాచ్‌బ్యాక్ కారు అయినా సరే లేదా ఆధునికమైన టాటా సఫారీ కారు అయినా సరే కంఫర్ట్ ఫీచర్లను అందించే విషయంలో టాటా మోటార్స్ చాలా చక్కగా వ్యవహరిస్తోంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ మరియు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు టాటా కార్లలో లభిస్తున్నాయి.

Most Read Articles

English summary
Did you notice these unique things in tata cars must read before you buy one
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X