కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

కార్లలో ఎయిర్‌బ్యాగులు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. కార్లలోని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో ఇప్పుడు ఎయిర్‌బ్యాగులు కూడా ఓ భాగమైపోయాయి. ఒకప్పుడు కేవలం ఆప్షనల్ ఫీచర్‌గా, అధిక ధరకు మాత్రమే లభించే ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని కార్లలో స్టాండర్డ్‌గా మారిపోయింది. భారత మార్కెట్లో విక్రయించే అన్ని కార్లలో ఇప్పుడు డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలి.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

కార్లలో ఎయిర్‌బ్యాగులు లేకపోవడం వలన జరుగుతున్న ప్రాణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మనదేశంలో ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి తయారు చేయబడే అన్ని కార్లలో తప్పనిసరిగా రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలి. అయితే, కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా, ప్రభుత్వం ఈ గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

సరే ఆ విషయం అటుంచితే, మీరు ఉపయోగిస్తున్న కారులో ఉన్నట్టుండి డ్యాష్‌బోర్డుపై ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? మరి దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో ఏదైనా లోపమా? ఈ వార్నింగ్ లైట్ ఆన్ అయితే, మీ కారులో ఎయిర్‌బ్యాగ్స్ ఇక పనిచేయవా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

సాధారణంగా, కార్లను సర్వీస్ చేయించేటప్పుడు మెకానికల్ భాగాలను మాత్రమే సర్వీస్ చేయిస్తుంటాం. కార్ల ఎయిర్‌బ్యాగ్‌ల రిపేర్ జనరల్ సర్వీస్‌లోకి రాదు, ప్రజలు వీటిని తరచుగా సర్వీసింగ్ చేయరు. ఎందుకంటే, వీటిని సర్వీస్ చేయించాల్సిన అవసరం ఉండదు కాబట్టి, కాకపోతే ఈ వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే మాత్రం వాటిని వెంటనే సరి చేయించుకోవటం చాలా మంచిది.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

ప్రమాద సమయాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు కారులోని వ్యక్తులను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఒకవేళ కారులో చిన్నపాటి ప్రమాదం జరిగి ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకున్నప్పటికీ, వాటిని తిరిగి యధాస్థానంలో ఉంచి, సెన్సార్లను రీసెట్ చేయటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి ఇలా రీసెట్ చేసిన ఎయిర్‌బ్యాగ్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు, ఫలితంగా డ్యాష్‌బోర్డుపై తరచూ వార్నింగ్ సైన్స్ కనిపిస్తూ ఉండొచ్చు.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

మీ కారు డాష్‌బోర్డ్ లేదా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లేపై ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయినా లేదా ఫ్లాష్ అవుతూ ఉన్నా, కారులోని ఎయిర్‌బ్యాగులు లోపభూయిష్టంగా ఉన్నట్లు అర్థం. ఈ లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీ కారులోని ఎయిర్‌బ్యాగులు డియాక్టివేట్ చేయబడ్డాయని గుర్తించాలి. ఇలా జరగడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి..

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

1. ఖాళీ ఎయిర్‌బ్యాగ్ బ్యాకప్ బ్యాటరీ

మీ కారులోని బ్యాటరీ పూర్తిగా ఖాలీ అయిపోయినట్లయితే, అది ఎయిర్‌బ్యాగ్‌కు శక్తినిచ్చే బ్యాకప్ బ్యాటరీని కూడా తీసివేసి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా పరిష్కరించబడుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాకప్ బ్యాటరీని సెన్సార్ రీసెట్‌తో రీఛార్జ్ చేయాల్సి రావచ్చు. కాబట్టి, కారులో ఎయిర్‌బ్యాగ్స్ చక్కగా పనిచేయాలంటే, అందులో ఆరోగ్యకరమైన బ్యాటరీ ఉండటం ఎంతో అవసరం.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

2. సెన్సార్‌లో లోపం ఉండవచ్చు

కారులోని వివిధ పరికరాల కోసం అనేక రకాల సెన్సార్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. వీటిలో ఎయిర్‌బ్యాగ్ సెన్సార్లు కూడా ఒకటి. ఈ సెన్సార్లు కారులోని ఏదైనా సంభావ్య సమస్యను గుర్తించి, ముందుగా కారులో కనెక్ట్ చేయబడిన కంప్యూటర్ వ్యవస్థకు తెలియజేసి తద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి. కొన్నిసార్లు ఎయిర్‌బ్యాగ్ సెన్సార్‌లు సరిగ్గా పనిచేయకపోవటం వలన కూడా డ్యాష్‌బోర్డుపై ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఫ్లాష్ కావచ్చు. ఈ సందర్భంలో, కారును అధీకృత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి, సెన్సార్లను రీసెట్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

3. లోపభూయిష్ట ఎయిర్‌బ్యాగ్ క్లాక్ స్ప్రింగ్

కారులోని ఎయిర్‌బ్యాగ్ క్లాక్ స్ప్రింగ్ వాహనం యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్ మధ్య కొనసాగింపును నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డ్రైవర్ స్టీరింగ్ వీల్‌ను తిప్పినప్పుడు ఈ స్ప్రింగ్ కూడా అటూ ఇటూ తిరుగుతుంది. ఇది సహజంగా కాలక్రమేణా అరిగిపోతుంది, ఫలితంగా ఎయిర్‌బ్యాగ్ వైఫల్యానికి దారితీస్తుంది.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

4. తడి ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్

ఒకవేళ మీ కారు నీటి వలన పాడైతే (అంటే కారు వరదల్లో లేదా నీటిలో మునిగిపోవటం, ఎయిర్‌బ్యాగ్స్ ఉండే ప్రాంతాలు నీటితో తడిసిపోవడం వంటివి జరిగినట్లయితే) సదరు కారులోని ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్స్ దెబ్బతింటాయి. ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్ షార్ట్ అయిపోయినా లేదా అరిగిపోయినా, అది సరిగ్గా పనిచేయదు. ఇలాంటి సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్స్‌ని రీప్లేస్ చేయాల్సి రావచ్చు.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

ఇవీ.. కారులో ఎయిర్‌బ్యాగ్స్ పనిచేయకపోవటానికి కొన్ని కారణాలు. కారణం ఏమైనప్పటికీ, మీరు మీ కారు డాష్‌బోర్డ్‌పై ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండటం చూసినట్లయితే, వెంటనే ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ మరియు సెన్సార్‌లను వీలైనంత త్వరగా రిపేర్ చేయించుకోవటం మంచిది.

కారులో ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్ ఆన్ అయిందా? కారణాలు ఏంటో తెలుసుకోండి!

కారులో కనీసం 6 ఎయిర్‌బ్యాగులు ఉండాలి:

ఇటీవల న్యూఢిల్లీలో సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల) సీఈఓల ప్రతినిధి బృందంతో సమావేశమైన కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కారు ఎయిర్‌బ్యాగ్స్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లనైనా ఇన్‌స్టాల్ చేయాలని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ తయారీదారులకు సూచించారు.

Most Read Articles

English summary
Did you see airbag warning light flashes on your car and you know why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X